పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (ఆగష్టు 1, 1900 - ఆగస్టు 11, 1962) ప్రముఖ రచయిత, సాహితీకారుడు.

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి

జీవిత విశేషాలు

మార్చు

ఈయన విశాఖపట్టణం జిల్లా చోడవరంలో వారి మాతామహులు రాంభట్ల జగన్నాథ శాస్త్రి ఇంట్లో 1900, ఆగష్టు 1 న జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వేంకట రత్నము, అన్నప్ప పంతులు. పెదమామ గారగు కొత్తూరు అప్పల నరసయ్య పంతులు ( పార్వతీపురములో ప్రముఖ న్యాయవాది ) ఆదర్శ పాలన వీరినెంతో ప్రభావితులను చేసింది. వీరి స్వస్థలము ఒడిషా లోని బరంపురం ( గంజాము జిల్లా ).

విద్యాభ్యాసము

మార్చు

మిడిల్ స్కూల్ - చోడవరము, విశాఖపట్నము ( సి. బి. యమ్ పైస్కూలు).

రచయితగా

మార్చు

ఈయనకు మహాభారతము యెడల ప్రీతి మెండు. పురాణములు పిన్నవయసునుంచి చదివేవాడు. పద్యరచన యందు అప్పటినుండి ఆసక్తి జనించెను. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమమున పాల్గొని 1923 లో కారాగార బద్ధుడయినాడు. జాతీయగీతములు పాడి, ఉద్యమ ప్రచారము చేసెను . వడ్డాది సీతారామాంజనేయకవి ఇతని సహచరుడు, సతీర్థ్యుడు. పురాణం సూర్యనారాయణ తీర్థులు ఇతని ఆరాధ్య గురువు.

రచనలు

మార్చు

"దండాలు దండాలు భరతమాత " అను సుపరిచిత ప్రబోధ గీతము ఈయన వ్రాసినదే . వడ్డాది కవితో కలిసి స్వరాజ్య గీతామృతము, ఆత్మ శిక్ష అను కంద శతకము ( 1923 ) లను రచియించెను. వాటిని ప్రభుత్వమువారు నిషేధించిరి . స్వతంత్రముగా ' భక్తకల్పద్రుమము ' అను దైవభక్తి ప్రబోధ శతకము ', " కుమారా " అను మకుటముగల కందశతకము పిల్లలకు నీతి బోధకముగ 1945 లో రచించెను .

ఉద్యోగము

మార్చు

జయపుర సంస్థానము ( ఒడిషా ) శ్రీ విక్రమదేవవర్మ మహారాజు పాలనలో 1925 నుండి 1960 వరకు అమీనుగను, మేనేజరుగను పనిచేశారు.

నిరాడంబర జీవనము, భగవంతునియెడ సర్వ సమర్పణ భావనతో ధర్మాచరణ చేసి 1962, ఆగస్టు 11 వ తేది శుభకృత్ శ్రావణ శుక్ల ఏకాదశి దినమున ( స్థిరవారము ) కటకము లో పెద్దకుమారుని ఏకాంతములో పరమపదించాడు.

మూలాలు

మార్చు

ఇతరలింకులు

మార్చు

వనరులు

మార్చు
  • పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి వారి స్వవిషయము