చోడవరం
చోడవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా, చోడవరం మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది అనకాపల్లి నుండి మాడుగుల వెళ్ళే దారిలో, అనకాపల్లికి 18 కి.మీ. దూరంలో ఉంది. రైలు మార్గం లేదు, రోడ్డు మీద వెళ్ళాలి. సుమారు వంద ఏళ్ళ క్రితం వరకు ఇది మన్యపు ప్రాంతంగా పరిగణించబడేది.చోడవరం పూర్వ నామం చోళవరం. ఇది క్రమంగా చోడవరంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో అడ్డతీగెల దగ్గర ఉన్న రంపచోడవరం వేరు, ఈ చోడవరం వేరు. ఇక్కడ శ్రీ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవాలయం కలదు
చోడవరం | |
— రెవిన్యూ గ్రామం — | |
చోడవరం గ్రామం లోని గణేష్ ఆలయ దృశ్య చిత్రం. | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°49′47″N 82°56′05″E / 17.829718°N 82.934718°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,384 |
- పురుషుల సంఖ్య | 1,695 |
- స్త్రీల సంఖ్య | 1,689 |
- గృహాల సంఖ్య | 1,061 |
పిన్ కోడ్ | 531036 |
ఎస్.టి.డి కోడ్ |
విశేషాలుసవరించు
చోడవరంలో శివాలయం చూడచక్కని ప్రదేశం. పక్కన ఉన్న కొలను కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వినాయకుని గుడి ప్రసిద్దమైనది. అక్కడ భక్తితో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం. వినాయకుని తొండం భూగర్భంలో చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. ఆ తొండం క్రమెపి పెరుగుతు ఉంది. అక్కడున్న మార్కంరేవు మంచి విహారయాత్రా ప్రాంతం. వెంకన్నపాలెం గ్రామంలో షిర్డీ సాయిబాబా గుడి ప్రసిద్దమైంది.
విద్యాసంస్థలుసవరించు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇతర కళాశాలలు ఉన్నాయి.
ఈ గ్రామం పంచాయితీ హోదా కలిగి ఉంది. చుట్టుపక్కల కొన్ని మండలాలకి వాణిజ్య కేంద్రంగా ఉంది.విశాఖపట్నం జిల్లాలో ఇది 3వ పెద్ద పట్టణంగా వెలుగొందుతుంది. త్వరలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే మునిసిపాలిటీల్లో చోడవరం పేరును కూడా పరిగణించడం జరిగింది.
ప్రముఖులుసవరించు
మూలాలుసవరించు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-12.