పూణే మెట్రోపాలిటన్ ప్రాంతం

మహారాష్ట్రలోని పూణే నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం.

పూణే మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్రలోని పూణే నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇందులో రెండు నగరపాలక సంస్థలు, మూడు కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. పూణే మెట్రోపాలిటన్ ప్రాంతం మొత్తం 7,256.46 కిమీ2 విస్తీర్ణంలో ఉంది.[1][5][6] 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంత జనాభా 7,541,946.[3]

పూణే మెట్రోపాలిటన్ ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాపూణే
తాలూకాపూణే, పీసిఎంసి పరిధి, హావేలి[1][2]
Area
 • Metro
7,256.46 km2 (2,801.73 sq mi)
Population
 (2011)[3]
 • Metro
75,41,946
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
అభివృద్ధి సంస్థపూణే మహానగర అభివృద్ధి సంస్థ (పిఎమ్‌ఆర్‌డిఎ)[4]
చైర్మన్ఉద్ధవ్ థాఖరే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికల కొరకు పూణే మహానగర అభివృద్ధి సంస్థ (పిఎమ్‌ఆర్‌డిఎ)కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ సంస్థ మహారాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. పట్టణ ప్రణాళికా పథకాలకు, పూణే రింగ్ రోడ్‌తోపాటు పూణే మెట్రో (లైన్ 3)కు నిర్వాహణకు బాధ్యత వహిస్తుంది.[7][8]

చరిత్ర మార్చు

పూణే, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన 9వ నగరం. రాష్ట్ర రాజధాని ముంబై తరువాత మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరం. 17వ శతాబ్దం నుండి 18 వ శతాబ్దం వరకు మరాఠా సామ్రాజ్య విస్తరణతో ఈ పూణే నగర చరిత్ర దగ్గరి సంబంధం కలిగి ఉంది. 18వ శతాబ్దంలో, పూణే భారత ఉపఖండంలో ఒక రాజకీయ కేంద్రంగా మారింది.[9]

1818లో పీష్వా పాలన పతనం తరువాత, బ్రిటిష్ పాలకులు ఈ నగరాన్ని తమ ప్రధాన సైనిక స్థావరాలలో ఒకటిగా మార్చుకున్నారు. స్వాతంత్య్రానంతరం నగరంలో ఉన్నత విద్యారంగంలో మరింత వృద్ధి కనిపించింది. 1961నాటి పాన్‌షెట్ వరద ఫలితంగా నది ఒడ్డున భారీగా గృహనిర్మాణం జరిగడంతో కొత్త శివారు ప్రాంతాల వృద్ధికి దారితీసింది. 1990లలో ఈ నగరం ఒక ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా అవతరించింది.

అధికార పరిధి మార్చు

పూణే జిల్లాలోని 3 తాలూకాలతో విస్తరించి పూణే మెట్రోపాలిటన్ ప్రాంతం ఉంది. ఇందులో పూణే నగరం, పింప్రి చిన్చ్వాడ్ తాలూకాలు, హవేలి తాలూకా దేహు రోడ్ కంటోన్మెంట్ ఉన్నాయి.

ఈ ప్రాంతంలోని స్థానిక సంస్థలు:

నగరపాలక సంస్థలు మార్చు

  • పూణే నగరపాలక సంస్థ
  • పింప్రి చిన్చ్వాడ్ నగరపాలక సంస్థ

కంటోన్మెంట్ బోర్డులు మార్చు

  • పూణే కంటోన్మెంట్ బోర్డు
  • ఖడ్కి కంటోన్మెంట్ బోర్డు
  • దేహు రోడ్ కంటోన్మెంట్ బోర్డు

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Pune Metropolitan Region Development Authority - PMRDA". www.pmrda.gov.in. Retrieved 2020-10-06. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "pmrda.gov.in" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Govt. of Maharashtra Notification: Extending boundaries of Pune Metropolitan Region" (PDF). Official website of the Government of Maharashtra. 10 February 2016. Retrieved 2020-10-06.
  3. 3.0 3.1 3.2 "Expansion plans: PMRDA wants 800 villages within limits". Times of India. Pune. 30 May 2015. Retrieved 2020-10-06.
  4. "Pune Metropolitan Region Development Authority - PMRDA". www.pmrda.gov.in. Archived from the original on 2018-05-06. Retrieved 2020-10-06.
  5. "Govt. of Maharashtra Notification: Extending boundaries of Pune Metropolitan Region" (PDF). Official website of the Government of Maharashtra. 10 February 2016. Retrieved 2020-10-06.
  6. "'PMRDA area notified, DP to be announced in a year'". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-20. Retrieved 2020-10-06.
  7. "At Rs 2,591 crore, PMRDA's 2018-19 budget 200% more than last year - Times of India". The Times of India. Retrieved 2020-10-06.
  8. "PMRDA budget 2018-19: Metro line gets Rs 888 crore, Rs 1,235 crore for ring road". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-26. Retrieved 2020-10-06.
  9. "Shaniwarwada was centre of Indian politics: Ninad Bedekar". Daily News and Analysis. 29 November 2011. Retrieved 2020-10-06.