పూర్ణిమా మానె 2012 ఫిబ్రవరి 12 నుండి ప్రస్తుతం వరకు అధ్యక్షులు, సి.యి.ఒగా పాథ్‌ఫైండర్ ఇంటర్నేషనల్ అనె సంస్థకు సేవలందిస్తున్నారు.[1]

డా.
పూర్ణిమా మానె
Purnima Mane.jpg
జననంపూర్ణిమా మానె
జాతీయతభారతీయులు
విద్యాసంస్థలుటాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషన్ సైన్సెస్
వృత్తిసామాజిక కార్యకర్త
సంస్థపాథ్‌ఫైండర్ ఇంటర్నేషనల్

జీవిత విశేషాలుసవరించు

ఈమె సామాజిక శాస్త్రవేత్త. ఆరోగ్య అంశాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేసిన ఈమెకు మహిళల ఆరోగ్యంపై విశేషానుభవం ఉంది. సెక్సువల్, రీ ప్రాడక్టివ్ హెల్త్ హక్కుల మీద పనిచేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (ముంబై) లో "విమెన్ అండ్ ఎయిడ్స్" అంశం మీద పి.హెచ్.డి చేసారు. అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్ గా చాలా కాలం పనిచేశారు.

1994 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిడ్స్ పై చేపట్టిన గ్లోబల్ ప్రోగ్రాంలో పాలుపంచుకున్నారు. ఈ విధంగా డాక్టర్ పుర్ణిమ కెరీర్ బోధనారంగం నుంచి మలుపు తిరిగింది. హెచ్.ఐ.వి పై విశేష కృషి చేశారు. 1996 లో యు.ఎస్. ఎయిడ్స్ లో చేరి బిహేవియరల్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ జండర్ ఎయిడ్స్ పై పనిచేశారు. 1999 నుంచి 2003 వరకు న్యూయార్క్ లోని పాపులేషన్ కౌన్సిల్ లో అంతర్జాతీయ కార్యక్రమాలకు ఉపాధ్యక్షురాలిగా, డైరక్టర్ గా సేవలందించారు[2]. ఆ తర్వాత ఎయిడ్స్, టి.బి, మలేరియా లపై పోరాడేందుకు గ్లోబల్ ఫండ్ లో పనిచేశారు. దానికి ఆసియా డైరక్టర్ గా వ్యవహరించారు.

డాక్టర్ పూర్ణిమ 2004 లో యు.యస్ ఎయిడ్స్ డైరక్టరుగా నియమితులయ్యారు. జండర్, హెచ్.ఐ.వి లలో అంఅర్జాతీయ నిపుణురాలిగా ఖ్యాతి గడించారు. హెచ్.ఐ.వి ప్రివెన్షన్ పాలసీ రూపకల్పనకు సారథ్యం వహించారు. ఆరోగ్య సంబంధించిన పుస్తకాలు అనేకం రాశారు. మరెన్నో పుస్తకాలను ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.కల్చరల్, హెల్త్, సెక్సువాలిటీ అంశాల మీద పత్రికకు వ్యవస్థాపక సంపాదకురాలుగా వ్యవహరిచ్మారు.

ఆమె సెక్సువాలితీ, రీప్రొడక్షన్ హెల్త్ హక్కుల మీద గ్రామీణ, పట్టణ మహిళలలో అవగాహన, స్పృహ కొంతమేర పెంపొందుతున్నాయి గాని, మరింత విస్తృతంగా జరగవలసిన అవసరం ఉందని చెబుతారు. 2007 లో ఐ.రా.స లోని జనాభా నిధి సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ మహిళగా పూర్ణిమ అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు.

హైదరాబాద్ లోని హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో 2007, అక్టోబరు 29-31 వరకు మూడు రోజుల పాటు జరిగిన నాల్గవ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ రీప్రొడక్షన్ సెక్సువల్ హెల్త్ అండ్ రైట్స్ సదస్సులో పాల్గొని మహిళలు తమ సెక్సువల్ రీప్రొడక్షన్ హక్కులనే కాక, ఆరోగ్యంగా జివించే హక్కును పరిరక్షించుకొవాలని సందేశం యిచ్చారు.

ఇతర లింకులుసవరించు

ఇటీవలి చర్చా కార్యక్రమాలుసవరించు

మూలాలుసవరించు

  1. Pathfinder Welcomes New President and CEO, Purnima Mane, and Launches 'Meet the President' Online Series
  2. "Mumbai-born Purnima Mane Population Council VP". Archived from the original on 2012-10-25. Retrieved 2014-03-08.