పూర్ణిమ రావు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్.

పూర్ణిమ రావు (ఆంగ్లం: Purnima Rau) (జననం 1967 జనవరి 30) తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్. ఆమె భారతదేశం తరపున మహిళల టెస్ట్ క్రికెట్ (1993-1995 మధ్యకాలంలో 5 మ్యాచ్‌లు), అంతర్జాతీయ వన్డే క్రికెట్ (1993-2000 మధ్యకాలంలో 33 మ్యాచ్‌లు) ఆడింది.[1]

పూర్ణిమ రావు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పూర్ణిమ రావు
పుట్టిన తేదీ (1967-01-30) 1967 జనవరి 30 (వయసు 57)
సికింద్రాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 44)1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1999 జూలై 15 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 40)1993 జూలై 20 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 20 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల టెస్ట్ క్రికెట్ మహిళల అంతర్జాతీయ వన్డే
మ్యాచ్‌లు 5 33
చేసిన పరుగులు 123 516
బ్యాటింగు సగటు 15.37 21.50
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 33 67 *
వేసిన బంతులు 1,164 1,557
వికెట్లు 15 50
బౌలింగు సగటు 21.26 16.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/24 4/26
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 8/0
మూలం: Cricinfo, 27 అక్టోబరు 2021

జననం మార్చు

పూర్ణిమ 1967, జనవరి 30న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించింది.[2]

కెరీర్ మార్చు

పూర్ణిమ భారత దేశవాళీ మహిళల క్రికెట్‌లో ఎయిర్ ఇండియా మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. వాటితోపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా 3 టెస్ట్ మ్యాచ్‌లు, 8 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు ఆడింది. 1993, జూలై 20లో నాటింగ్‌హామ్‌లో జరిగిన ఇండియా ఉమెన్ - వెస్టిండీస్ ఉమెన్ అంతర్జాతీయ వన్డేతో పూర్ణిమ తన క్రికెట్ ఆటను ప్రారంభించింది.[3] పరిమిత ఓవర్ల ఆటలో మొదటి 15 ఓవర్లలో ఫీల్డ్ పరిమితులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించిన భారత మహిళా క్రికెట్‌లో మొదటి క్రీడాకారిణిగా పూర్ణిమ గుర్తింపు పొందింది.[3] 1996లో స్కిప్పర్ రావు టూరింగ్ ఆంధ్రప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టు సముద్ర లేడీస్ సిసిపై 114 పరుగులతో విజయాన్ని సాధించడంలో సహాయపడింది.

కోచ్ గా మార్చు

అంతర్జాతీయ వన్డే ఇన్నింగ్స్‌లో చాలావరకు ఆల్ రౌండర్గా మిడిల్ ఆర్డర్‌లో ఆడింది, కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసింది. కొంతకాలం హైదరాబాద్‌లోని మహిళా క్రికెటర్లకు కోచ్‌గా ఉంది. తరువాత భారత మహిళల క్రికెట్ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేసింది.[4] 2017 ఏప్రిల్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతల నుండి పూర్ణిమను తప్పించింది.

మూలాలు మార్చు

  1. "Players need to respect the coach, says Purnima Rau". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-15. Archived from the original on 2021-09-10. Retrieved 2021-10-27.
  2. "Purnima Rau profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-10-27.
  3. 3.0 3.1 "Purnima Rau". Cricinfo. Retrieved 2018-12-15.
  4. Adivi, Sashidhar (2019-10-22). "Growing the fruits of her labour". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2019-12-23. Retrieved 2021-10-27.

బయటి లింకులు మార్చు