పూర్ణకుంభం

(పూర్ణ కుంభం నుండి దారిమార్పు చెందింది)

పూర్ణ కుంభం (Poorna Kumbham) (నిండు కుండ) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశము అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన 'టెంకాయ' (కొబ్బరికాయ) ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.

Poorna kumbbam.jpg

పూర్ణ కుంభ తయారీసవరించు

దీని కొరకు సాంప్రదాయికంగా ఇత్తడి కుండను ఉపయోగిస్తారు, ఆది అందుబాటు కానప్పుడు లేదా మట్టి, లేక రాగి లేక కుండలు కూడా ఉపయోగిస్తారు. ఈ కుండను కలశం లేదా కుంభం అనికూడా అంటారు. కొన్నిసార్లు ఈ కుంభాన్ని బియ్యంతో నింపుతారు, తెల్లని లేదా ఎర్రని దారాన్ని ఈ కుండ మెడకు లేదా మొత్తం కుండకు కడతారు. మామిడాకులతో ఈ కుండ ముఖం వద్ద వృత్తాకారంలో అలంకరిస్త్రారు. కొన్నిసార్లు టెంకాయను తెల్లటి లేదా పసుపు బట్టతో కప్పుతారు. ఈ విధంగా పూర్ణకుంభ తయారవుతుంది. దీనిని సాంప్రదాయికంగా పవిత్రమైనదిగా భావిస్తారు, మంత్రోచ్ఛారణలతో తయారుచేస్తారు. దీనిని శుభసూచకంగా భావించి శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు పెండ్లి, గృహప్రవేశం, రోజువారీ ప్రార్థనలు మొదలగునవి. దీనిని ముఖద్వారాలవద్ద 'స్వాగత సూచకంగా' ఉంచుతారు.

ఈ పూర్ణకుంభం, ఆంధ్ర ప్రదేశ్ అధికారిక గుర్తు.

 
పూర్ణకుంబం\తిరుపతిలో శిలా పూర్ణ కుంబం

పూర్ణకుంభం చరిత్రసవరించు


ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు