పూసాయి ఎల్లమ్మ జాతర

పూసాయి ఎల్లమ్మ జాతర తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం లోని పూసాయి గ్రామంలో కొలువైన ఎల్లమ్మ ఆలయం అతి పురాతనమైంది. ఇచ్చట ప్రతి సంవత్సరం పుష్య మాసం నుండి మాఘ మాసం వరకు నెల రోజుల పాటు జాతర జరుగుతుంది[1].

పూసాయి ఎల్లమ్మ జాతర-జైనథ్ , ఆదిలాబాదు జిల్లా
ఎల్లమ్మ దేవాలయం పుసాయి,జైనాథ్
ఎల్లమ్మ దేవాలయం పుసాయి,జైనాథ్
పూసాయి ఎల్లమ్మ జాతర-జైనథ్ , ఆదిలాబాదు జిల్లా is located in Telangana
పూసాయి ఎల్లమ్మ జాతర-జైనథ్ , ఆదిలాబాదు జిల్లా
పూసాయి ఎల్లమ్మ జాతర-జైనథ్ , ఆదిలాబాదు జిల్లా
తెలంగాణ పూసాయి ఎల్లమ్మ దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :19°06′N 78°21′E / 19.10°N 78.35°E / 19.10; 78.35
పేరు
ఇతర పేర్లు:శ్రీరేణుక ఎల్లమ్మ
ప్రధాన పేరు :పూసాయి ఎల్లమ్మ జాతర
దేవనాగరి :श्री रेणुका येल्लम्मा देवस्थान पूसाइ ,जैनाथ तहसील, आदिलाबाद जिला, तेलंगाना।
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్ జిల్లా
ప్రదేశం:జైనథ్ ,మండలం , పూసాయి గ్రామం
ఆలయ వివరాలు
ప్రధాన దేవత:రేణుక ఎల్లమ్మ తల్లి
ముఖ్య_ఉత్సవాలు:పుష్యమాసంలో
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారతదేశం హిందూదేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:ప్రాచీన దేవాలయం
సృష్టికర్త:గ్రామస్థులు
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, పుసాయి.

విశేషం

మార్చు

ఈ జాతరలో వచ్చే భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో స్నానం ఆచరించి ఎల్లమ్మ తల్లి దర్శనం చేయడం వలన చర్మ వ్యాధులు నయమవుతాయి భక్తుల విశ్వాసం.

పూసాయి ఎల్లమ్మ జాతర జైనథ్ మండలంలోని పూసాయి గ్రామంలో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య నుంచి మాఘ అమావాస్య వరకు నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. జాతర ప్రారంభం మొదటి ఆదివారం రోజున పూసాయి గ్రామస్థుల ఆధ్వర్యంలో మహిళల భక్తులు ఇంటి వాకిలి శుభ్రము చేసి తల స్నానం చేసి సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి బోనాన్ని మట్టి కుండల్లు అలంకరించి ఆ కుండలను తల పై ఎత్తుకొని డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీల మధ్య శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి భోనాలు సమర్పించడంతో జాతర ప్రారంభమవుతుంది.

ఎలా చేరుకోవచ్చు

మార్చు

ఈ ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చే భక్తులు బస్సులో ఆదిలాబాదు నుండి నేరుగా జైనథ్ మండలంలోని పూసాయి గ్రామానికి బస్సులో కానీ ఇతర ప్రైవేటు వాహనాల్లో కూడా వెళ్ళవచ్చు. మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు బోరజ్ చేక్ పోస్ట్ మీదుగ ఆదిలాబాద్ వేళ్ళే మార్గం మధ్యలో పూసాయి చెక్ ఫొష్టు వద్ద దిగి అచటి నుండి కాలినడకన లేదా ఆటోలో ప్రయాణి చేరుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. samajikasarathi (2022-01-03). "పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే | Archive". samajikasarathi (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-29.