పృథ్వీ రాజ్ ఒక దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించాడు. 1990, 2000 దశకాల్లో తమిళ టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించాడు. 1997లో వచ్చిన పెళ్ళి సినిమాకు ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు.

పృథ్వీ రాజ్
జననం (1966-07-18) 1966 జూలై 18 (వయసు 57)[1]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1969-ప్రస్తుతం
జీవిత భాగస్వామిబీనా
పిల్లలుఆహెద్

కెరీర్ సవరించు

పృథ్వీ 1979 లో నాన్ వళవయ్యప్పన్ అనే తమిళ సినిమాలో బబ్లూ అనే పేరుతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. తరువాత 1990, 2000 దశకాల్లో తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలు, అప్పుడప్పుడూ ప్రతినాయకుడిగా కనిపించాడు.

సినిమా అవకాశాలు తక్కువైనప్పుడు ఒక సంవత్సరం పాటు జోడీ నంబర్ వన్ అనే డ్యాన్స్ రియాలిటీ షో, రెండో సీజన్ లో పాల్గొన్నాడు. షో జరుగుతున్నప్పుడే దానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న శింబు తో వివాదానికి దిగాడు.[2] 2010 నుంచి ఎక్కువగా టీవీ మీదనే తన దృష్టి కేంద్రీకరిస్తున్నాడు.

వ్యక్తిగత జీవితం సవరించు

పృథ్వీ భార్య పేరు బీనా. వారికి ఆహెద్ అనే కుమారుడున్నాడు. అతను ఆటిజం వ్యాధితో బాధపడుతున్నాడు. 2005 లో పృథ్వీరాజ్ బెంగుళూరు ఎయిర్ పోర్టులో తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేశారంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పై బహిరంగంగా ఫిర్యాదు చేశాడు.[3]

నటించిన సినిమాలు సవరించు

మూలాలు సవరించు

  1. "తమిళ సహాయ నటుడు పృథ్వీ రాజ్". nettv4u.com. Retrieved 20 September 2016.
  2. "Simbu's fight with Babloo on TV fixed?". timesofindia.indiatimes.com. టైమ్స గ్రూప్. Retrieved 20 September 2016.
  3. శేఖర్, జి.సి. "Is autism a threat at airport?". hindustantimes.com. HT Media. Retrieved 20 September 2016.