పెంగ్విన్ (సినిమా)

పెంగ్విన్ 2020లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ఫ్యాష‌న్ స్టూడియోస్‌ బ్యానర్‌పై కార్తీక్ సుబ్బ‌రాజ్, కార్తికేయ‌న్ సంతానం, సుధ‌న్ సుంద‌రం, జ‌య‌రాం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఈశ్వ‌ర్ కార్తీక్‌ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 19 జూన్ 2020న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది.

పెంగ్విన్
Penguin film poster.jpg
దర్శకత్వంఈశ్వ‌ర్ కార్తీక్‌
రచనఈశ్వ‌ర్ కార్తీక్‌
నిర్మాత
  • కార్తీక్ సుబ్బ‌రాజ్
  • కార్తికేయ‌న్ సంతానం
  • సుధ‌న్ సుంద‌రం
  • జ‌య‌రాం
నటవర్గంకీర్తి సురేష్
ఛాయాగ్రహణంకార్తీక్ ప‌ళ‌ని
కూర్పుఅనిల్ క్రిష్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థలు
స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌
ప్యాషన్ స్టూడియోస్‌
పంపిణీదారులుఅమెజాన్ ప్రైమ్‌
విడుదల తేదీలు
19 జూన్ 2020
నిడివి
132 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషలుతమిళ్
తెలుగు

కథసవరించు

రిథమ్( కీర్తి సురేష్ ) రఘు ( లింగ) లకు అజయ్‌(మాస్టర్‌ అద్వైత్‌) అనే ఒక కొడుకు ఉంటాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన అజయ్‌ కిడ్నాప్‌నకు గురవుతాడు. తమ కొడుకు ఏమై ఉంటాడని వెతకడంప్రారంభిస్తారు. తన కొడుకు అజయ్‌ కనిపించకుండా పోవడానికి రిథమ్ నే కారణం అని చెప్పి రిథ‌మ్ నుంచి విడాకులు తీసుకుంటాడు. అయిన్ప‌టికీ రిథమ్ తన కొడుకు అజయ్‌ గురించిన అన్వేషణను ఆపదు. అదే సమయంలో రిథమ్ కు గౌతమ్‌ (రంగరాజ్‌) పరిచయమై ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ, రిథమ్‌‌ నిత్యం కొడుకు అజయ్‌ గురించే ఆలోచిస్తుంటుంది. ఓరోజు స‌డ‌న్‌గా రిథ‌మ్‌కు అజ‌య్ క‌నిపిస్తాడు. ఇన్నిరోజులు అజ‌య్ ఏమైపోయాడు? అజయ్‌తో పాటు అపహరణకు గురైన మరో ఆరుగురు పిల్లలు ఏమయ్యారు? అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు, సినిమాలోని పాత్ర పేరుసవరించు

  • కీర్తి సురేష్ - రిథమ్‌
  • లింగా - రఘు
  • మాస్ట‌ర్ అద్వైత్‌ - రఘు, రిథమ్‌ కొడుకు అజ‌య్‌
  • రంగరాజ్‌ - గౌతమ్‌
  • ఆదిదేవ్‌
  • మదంప‌ట్టి రంగ‌రాజ్,
  • నిత్య
  • హరిణి

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌
  • నిర్మాతలు: కార్తీక్‌ సుబ్బరాజ్‌, కార్తికేయన్‌ సంతానం, సుధాన్‌ సుందరమ్‌, జయరామ్‌
  • రచన, దర్శకత్వం: ఈశ్వర్‌ కార్తీక్‌
  • సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
  • సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ పళని
  • ఎడిటింగ్‌: అనిల్‌ క్రిష్‌

మూలాలుసవరించు

  1. "PENGUIN [Telugu]". British Board of Film Classification. Archived from the original on 25 June 2020. Retrieved 25 June 2020.
  2. BBC News తెలుగు (19 June 2020). "పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  3. Eenadu (19 June 2020). "రివ్యూ: పెంగ్విన్‌". www.eenadu.net. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.