పెట్రోల్
పెట్రోలు ఒక శిలాజ ఇంధనం. దీనినే గేసొలీన్ (Gasoline, / ɡæsəli ː n /) అని కూడా అంటారు. కామన్వెల్త్ దేశాలలో "పెట్రోల్" అనే పదం ఎక్కువ ఉపయోగంలో ఉంటే ఉత్తర అమెరికాలో "గేసోలీన్" అనే మాట ఎక్కువ వాడుకలో ఉంది.
పెట్రో అంటే శిల, ఓలియం అంటే తైలం (oil) కనుక పెట్రోలియం అంటే శిలతైలం లేదా రాతినూనె. ఇది పెట్రోలు, కిరసనాయిలు వంటి అనేక ఉదకర్బనాలు (hydrocarbons) కి ముడి పదార్థం కనుక దీనిని ముడి చమురు అని కూడా పిలుస్తారు. వాహనాలలో ఇంధనంగా వాడుకలో ఉన్న పెట్రోలు అనేక రకాల ఉదకర్బనాల సమ్మేళనం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోపల వృక్షాలు, జంతుకళేబరాలు మొదలైనవి కొన్ని ప్రత్యేక పరిస్థితులు (అనగా.అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతలు, వగైరా) వ్ల్ల ఎన్నో రసాయన ప్రక్రియలకి లోనయి పెట్రోలియం అనే పదార్ధము తయారవుతుంది. ఈ పెట్రొలియం నుండి తయారయినదే ఈ పెట్రోలు .
కార్బన్ డై ఆక్సైడ్, నీటితో పెట్రోలు తయారీ
మార్చుకార్బన్ డై ఆక్సైడ్ (CO2) నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. ఈ పద్ధతితో పర్యావరణంలో పేరుకూంటూన్న CO2 పాలు తగ్గుతుండని ఆశ పడుతున్నారు.
పర్యావరణ భద్రత
మార్చుఅత్యధికంగా గేసొలీన్ వాడడం పర్యావరణానికి మంచిది కాదు. పెట్రోలులో ఉన్న అనేకమైన ఉదకర్బనాలు (హైడ్రోకార్బన్స్) ప్రమాదకరమైన పదార్థాలుగా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, యునైటెడ్ స్టేట్స్ వారిచే నియంత్రించబడతాయి.