పెదగంట్యాడ
పెదగంట్యాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలానికి చెందిన మండలకేంద్రం.ఇది విశాఖపట్నంలో ఒక ప్రధాన శివారు ప్రాంతం, 2005 లోమహా విశాఖ నగరం పాలకసంస్థలో విలీనం అయ్యింది. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.[1]
భౌగోళికం
మార్చుపెదగంట్యాడ, విశాఖపట్నం విమానాశ్రయం నుండి 11 కి.మీ., విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 17 కి.మీ. దూరంలో ఉంది. ఇది విశాఖపట్నం నగరానికి దక్షిణాన దిశలో ఉంది. పశ్చిమాన గజువాక, దక్షిణాన పరవాడ, ఉత్తరాన ములగాడ, నైరుతి వైపు అనకాపల్లి, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు
మార్చుపెడగంట్యాడ ప్రధాన రహదార్లు అన్ని ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. సమీప మండలాలు, విశాఖపట్నం నగరానికి అనుసంధానించే ప్రధాన జిల్లా రహదారులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి బస్సులు పెదగంట్యాడ నుండి విశాఖపట్నంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించబడి ఉన్నాయి. సమీపంలోని గాజువాక బస్ స్టేషన్ నుండి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు బస్సు సేవలను నడుపుతుంది.
పెదగంట్యాడ నుండి ఈ దిగువ వివరింపబడిన ప్రాంతాలకు ఆర్.టి.సి. బస్సులు త్రిప్పబడుతున్నాయి
మార్గం సంఖ్య | ప్రారంభ స్థానం | ముగింపు స్థానం | ఏ ఏ ప్రాంతాల ద్వారా |
---|---|---|---|
38 డి | నాడపూరు డైరీ కాలనీ | ఆర్.టి.సి. కాంప్లెక్స్ | పెదగంట్యాడ, న్యూ గాజువాక,ఓల్డ్ గాజువాక, బి.హెచ్. పి.వి,ఎయిర్ ఫోర్ట్, ఎన్ఎడి జంక్షన్,బిర్లా జంక్షన్, గురుద్వార్ |
38 హెచ్ | గంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ | ఆర్.టి.సి. కాంప్లెక్స్ | పెదగంట్యాడ, న్యూ గాజువాక,ఓల్డ్ గాజువాక, బి.హెచ్. పి.వి,ఎయిర్ ఫోర్ట్, ఎన్ఎడి జంక్షన్,బిర్లా జంక్షన్, గురుద్వార్ |
400 హెచ్ | గంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ | మద్దిలపాలెం | పెదగంట్యాడ, న్యూ గాజువాక, మల్కాపురం,యస్సీ ఇండియా, రైల్వే స్ఠేషన్, ఆర్.టి.సి. కాంప్లెక్స్
ఓల్డ్ గాజువాక, బి.హెచ్. పి.వి,ఎయిర్ ఫోర్ట్, ఎన్ఎడి జంక్షన్,బిర్లా జంక్షన్, గురుద్వార్ |
63 | గంగవరం ఫోర్ట్ | రామకృష్ణా బీచ్ | పెదగంట్యాడ, న్యూ గాజువాక, మల్కాపురం,యస్సీ ఇండియా, కాన్వెంట్, టౌన్ కొత్తరోడ్,జగదాంబ సెంటర్ |
210 | గంట్యాడ హౌసింగ్ బోర్డు కాలనీ | రవీంద్రనగర్ | పెదగంట్యాడ, న్యూ గాజువాక, మల్కాపురం,యస్సీ ఇండియా, కాన్వెంట్, టౌన్ కొత్తరోడ్, జగదాంబ సెంటర్ రామకృష్ణా బీచ్, సిరిపురం, పెద వాల్తేర్,అప్పు నగర్, హనుమంతువాక |
65 యఫ్ | గంగవరం ఫోర్ట్ | ఫిషింగ్ హార్బర్ | పెదగంట్యాడ, న్యూ గాజువాక,మల్కాపురం,యస్సీ ఇండియా, కాన్వెంట్, టౌన్ కొత్తరోడ్, జగదాంబ సెంటర్, కలెక్టరేట్ |
మూలాలు
మార్చు- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. 2015-03-19. Archived from the original on 2015-03-19. Retrieved 2020-06-30.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)