పెనుగొండ లక్ష్మీనారాయణ

పెనుగొండ లక్ష్మీనారాయణ[1] అభ్యుదయకవి. ప్రముఖ న్యాయవాది. శ్రామిక పక్షపాతి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి[2][3], ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేస్తున్నాడు.[4] 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యాడు.[5][6][7][8]

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1954, అక్టోబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా,[9] నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు[10]. పెనుగొండ లింగమ్మ, గోవిందరెడ్డి ఇతని తల్లి దండ్రులు. బి.ఎ., బి.ఎల్ చదివాడు. న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఇతని భార్య పేరు ఉప్పుటూరి గీత. ఈమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రచన వ్యాసంగం

మార్చు

రచయితగా :

  1. విదిత (సాహిత్యవ్యాసాల సంపుటి)
  2. అనేక (సాహిత్యవ్యాసాల సంపుటి)
  3. రేపటిలోకి (కవిత్వం)
  4. దీపిక[11]
  5. గుంటూరు సీమ సాహిత్య చరిత్ర[12]

సంపాదకుడిగా :

  1. బల్గేరియా కవితా సంకలనం
  2. అరాజకీయం కవితా సంకలనం
  3. గుంటూరు కథలు
  4. కథాస్రవంతి (నాలుగు భాగాలు)

కథ నిలయం ఏర్పాటు

మార్చు

కేంద్ర సాహిత్వ అకాడమీ 1997 సంవత్సరంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యశాలలో ‘తెలుగులో కథా సంకలనాలు-స్థూల పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించాడు. ఈ పరిశోధన ప్రముఖ కథ రచయిత కాళీపట్నం రామారావును కదిలించింది. దాని ఆధారంగానే శ్రీకాకుళం జిల్లాలో కథ నిలయాన్ని ఏర్పాటు చేశాడు.[13]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2024-12-19). "పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు". www.ntnews.com. Retrieved 2024-12-19.
  2. "రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా పెనుగొండ లక్ష్మీనారాయణ | Telugu Writer Penugonda Lakshminarayana Elected As National President Of AIPWA - Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-19.
  3. "సాంఘిక పరివర్తనకు రచనలతో ప్రయత్నం | - | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-19.
  4. "పెనుగొండ కృషి స్ఫూర్తిదాయకం | - | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-19.
  5. ABN (2024-12-19). "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండకు". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-19.
  6. Telugu, TV9 (2024-12-18). "Andhra Pradesh: తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ". TV9 Telugu. Retrieved 2024-12-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "Award: పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు". Sakshi Education. Retrieved 2024-12-19.
  8. ABN (2024-12-18). "Guntur: అరుదైన అవార్డు దక్కించుకున్న తెలుగు కవి ఎవరంటే." Andhrajyothy Telugu News. Retrieved 2024-12-20.
  9. telugu, NT News (2024-12-18). "Central Award | గుంటూరు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". www.ntnews.com. Retrieved 2024-12-19.
  10. కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి (2015-07-16). "సాహిత్యాన్ని ఉద్యమస్ఫూర్తిగా పెనుస్తూన్న "పెనుగొండ" (కదిలించే కలాలు)". నేటి నిజం. బైసా దేవదాసు. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 July 2015.
  11. "Penugonda Lakshminarayana: పరిశోధకులకు కర'దీపిక'". EENADU. Retrieved 2024-12-19.
  12. "శాస్త్రీయ దృక్పథంతో సాహిత్య చరిత్ర రచన - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-12-16. Retrieved 2024-12-19.
  13. ABN (2024-12-19). "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండకు". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-19.
  14. "Famous Writer – పెనుగొండకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-12-18. Retrieved 2024-12-19.
  15. "పెనుగొండ.. మట్టి నుంచి ఎదిగిన మాణిక్యం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Congratulate Penugonda Lakshminarayana For Kendra Sahitya Akademi Award | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-19.
  16. "Guntur | రచయిత పెనుకొండకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-12-18. Archived from the original on 2024-12-18. Retrieved 2024-12-19.