కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి అభ్యుదయ కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు. అభ్యుదయ హృదయంగా, సమసమాజమే ధ్యేయంగా, మార్క్సిజమే మార్గంగా, నీతి, నిజాయితీ, నిర్భీతే జీవితంగా, కవిత్వమే ఊపిరిగా జీవిస్తున్న సాహితీమూర్తి ఆయన.

జీవిత విశేషాలు

మార్చు

కొండ్రెడ్డి 1944 డిసెంబర్ 12ప్రకాశం జిల్లా బుద్ధిరెడ్డిపల్లిలో కోటమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు జన్మించారు.కొండ్రెడ్డి ఎన్నో పుస్తకాలు రాశారు. అందులో 'మట్టితడి బంధాల్లో' 'అంకుర స్పర్శ', 'దుక్కిచూపు', 'ఆకాశమంత చూపు' లాంటి కవితా సంపుటాలతోపాటు 'సంస్పర్శ', 'ఆలోకనం' లాంటి సాహితీవిమర్శలు, సమీక్షలు, 'చిగిరింతలు', నానీలు, 'విలక్షణనేత్రం' లాంటి పద్య కావ్యాలు రాశారు. సమర్థుడైన సృజనకారుడు ఏప్రక్రియలోనైనా రాణించగలడని ఆయన చెప్పడమేగాక నిరూపించాడు.

అవార్డులు

మార్చు
  • 2007లో విష్ణుబొట్ల ఫౌండేషన్ అవార్డు,
  • 2008లో 'ఆటా' అవార్డు,
  • అవంత్స సోమసుందర్ లిటరరీ అవార్డు,
  • రాజరాజేశ్వరి అవార్డు,
  • రమ్యసాహితీ సమితి తదితర సాహితీ సంస్థల అవార్డులెన్నో అందుకున్నారు.
  • రంజని కుందుర్తి అవార్డు
  • 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'సాహిత్య విమర్శ' లో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.[1]

పరిశోధనలు

మార్చు

ఈ కవి కావ్యాలపై మద్రాస్, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసి అనేక మంది ఎంఫిల్, పిహెచ్ డి పట్టాలు కూడా పొందారు. విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 70 ఏళ్ల వయసులోనూ నిరంతర సాహితీ అధ్యయనం, అక్షర సేద్యం చేస్తున్నారు.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు