పెన్సిల్ షార్పనర్

పెన్సిల్ ని చెక్కుకునే సాధనము

పెన్సిల్ షార్పనర్ లేదా షార్పనర్ అనేది పెన్సిల్ కొసను జువ్వినట్లుగా సోగుగా చెక్కుతూ దాని యొక్క వ్రాసే ముక్కను వ్రాయుటకు అనువుగా పదునుపెట్టే పరికరం. పెన్సిల్ షార్పనర్లు మానవీయంగా లేదా ఎలక్ట్రిక్ మోటారు చేత నిర్వహించబడుతున్నాయి.

సేంద్రీయప్లాస్టిక్ చే తయారుచేయబడిన షార్పనర్
మెకానికల్ పెన్సిల్ షార్పనర్ వీడియో, గేరింగ్, హెలికల్ షార్పెనింగ్ బ్లేడ్‌లను చూపుతోంది

చరిత్ర

మార్చు
 
పెన్సిల్ షార్పనర్

పెన్సిల్ షార్పనర్లు అభివృద్ధి చెందకముందు పెన్సిల్లను కత్తితో పదేపదే సన్నగా సోగుగా జువ్వి పదును చేసేవారు. అయితే త్రిప్పగలిగే కాలర్ తో స్థిర-బ్లేడ్ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బెర్నార్డ్ లస్సిమోన్నీ 1828లో పెన్సిల్ షార్పనర్ నకు మొట్టమొదటి పేటెంటు (ఫ్రెంచ్ పేటెంట్ #2444) కోసం దరఖాస్తు చేశాడు, కానీ దాని గుర్తించదగిన ఆధునిక రూపంలో పెన్సిల్ షార్పనర్ తోటి ఫ్రెంచీయుడు థియరీ డెస్ ఈస్టివాక్స్ చే ఆవిష్కరించబడిన 1847 వరకు జరగలేదు.[1] మొదటి అమెరికన్ పెన్సిల్ షార్పనర్ 1855లో వాల్టర్.కే ఫోస్టర్ చే పేటెంట్ చేయబడింది.[2] కార్యాలయాల కోసం ఎలక్ట్రిక్ పెన్సిల్ షార్పనర్లు కనీసం 1917 నుంచి ఉపయోగించబడుతున్నాయి. పెన్సిల్ షార్పనర్లతో పెన్సిళ్లను చెక్కడం సులభమవడంతో అందరూ ఈ పరికరాన్ని ఉపయోగించసాగారు.

మూలాలు

మార్చు
  1. "20 Things You Didn't Know About... Pencils", Discover magazine, May 2007, archived from the original on 2009-04-21, retrieved 2009-04-30
  2. "Handheld Pencil Sharpeners". Archived from the original on 18 జూలై 2011. Retrieved 9 July 2011.

వెలుపలి లంకెలు

మార్చు