పెన్సిల్
పెన్సిల్ రాయడానికి, చిత్రలేఖనంలో భాగం అయిన స్కెచ్లు వేయటానికి ఉపయోగించే ఒక సాధనం. ఇది గ్రాఫైట్, చెక్క నుంచి తయారు చేయబడుతుంది.
పుట్టుక
మార్చుపెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్.[1] ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు కానీ "సాధారణంగా" పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.
చిత్రలేఖనం లో
మార్చుపెన్సిల్ పలురకాలుగా లభ్యం అవుతాయి. కరకుగా గీతలు గీసే పెన్సిళ్ళు కొన్ని అయితే, మృదువుగా గీసేవి మరికొన్ని. పెన్సిళ్ళలో కరకుదనాన్ని H అక్షరం, మృదుత్వాన్ని B అక్షరం సూచిస్తాయి.[2] ఉదా:4H పెన్సిల్ 2H పెన్సిల్ కంటే కరకుగా గీస్తుంది. 4B పెన్సిల్ 2B పెన్సిల్ కంటే మృదువుగా గీస్తుంది. మధ్యస్తంగా ఉండే HB పెన్సిల్ పై ఒత్తిడిని బట్టి, ఒత్తిడి ఎక్కువ ఉంటే మృదువుగా, తక్కువ ఉంటే కరకుగా గీస్తుంది.[3] అత్యంత కరుకైన పెన్సిల్ 6H అయితే అత్యంత మృదువైన పెన్సిల్ 6B.[4] 0.3 మి.మీ, 0.5 మి.మీ వ్యాసం ఉన్న మెకానికల్ పెన్సిళ్ళు సన్నని గీతలను వేయటానికి ఉపయోగిస్తారు.[5] పెన్సిళ్ళతో బాటు బాల్ పాయింట్ పెన్ లు, మార్కర్లు, చార్కోల్ కూడా స్కెచింగ్ లో వినియోగిస్తారు. [6] [7]
భారత్ లో పెన్సిల్ కంపెనీలు
మార్చు- నటరాజ
- కేమెల్
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-09. Retrieved 2009-07-02.
- ↑ Porter 1977, p. 61.
- ↑ Alois Fabry 1958, p. 12-13.
- ↑ Gurney & Kinkade 1958, p. 29.
- ↑ Gurney & Kinkade 1958, p. 30.
- ↑ Crawshaw 1983, p. 22.
- ↑ Crawshaw 1983, p. 24.
- Fabry, Alois (1958). Sketching Basics. Mud Puddle Books.
- Crawshaw, Alwyn (1983). Learn to Paint Sketch. Collins.
- Gurney, James; Kinkade, Thomas (1988). The Artist's Guide to Sketching. Watson Guptill Publications.