చిన్నగా ఉంటుందిగానీ... పెన్‌ డ్రైవ్‌తో ఉపయోగాలెన్నో... ఆఫీసు ఫైళ్లయినా, ఇష్టమైన సినిమాలు, సంగీతమైనా అటుఇటూ మోసుకెళ్లేందుకు దీనికి మించిన సాధనం లేదు. మరి... అనుకోకుండా మీ పెన్‌ డ్రైవ్ మొరాయిస్తే... వైరస్ కారణంగా సమాచారం మొత్తం మాయమైనట్లు కనిపిస్తే... చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ... తప్పించుకునేందుకు చిట్కాలివిగో...

SanDisk Cruzer Micro, a brand of USB flash drives

‘‘మీ పెన్‌ డ్రైవ్‌కు రైట్ ప్రొటెక్షన్ ఉంది... దాన్ని తొలగించండి.. లేదా వేరే డిస్క్ ఉపయోగించండి’’ పెన్‌డ్రైవ్‌లు ఉపయోగించేవారికి అడపాదడపా కనిపించే సందేశమిది. అంతేకాదు... కొన్నిసార్లు మీ పెన్‌ డ్రైవ్‌లోని ఫోల్డర్లల్నీ మాయమైపోయి... కేవలం షార్ట్‌కట్‌లు మాత్రమే కనిపిస్తూంటాయి. ఈ చికాకులన్నీ వైరస్ ప్రతాపమే. వాటికి పరిష్కారమేమిటో చూద్దాం...

షార్ట్‌కట్‌లు కనిపిస్తూంటే... ముందుగా వైరస్‌ను తొలగించుకోవాలి. ఇందుకోసం మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉన్న పీసీకి పెన్‌డ్రైవ్‌ను అనుసంధానించండి. స్కాన్ చేసి అన్నిరకాల వైరస్‌లు తొలగించండి. ఆ తరువాత కమాండ్ ప్రాంప్ట్‌ను తెరవండి. స్టార్ట్ మెనూలోని రన్ ఆప్షన్‌లో ఇకఈ అని టైప్ చేస్తే తెరుచుకునే కమాండ్ ప్రాంప్ట్‌లో ATTRIB -H -R -S /S /D G:\*.* అని టైప్ చేయండి. (మీ పెన్‌డ్రైవ్ ‘జీ‘ డ్రైవ్ అనుకుని ఈ కమాండ్ రాశాం. కాకపోతే డ్రైవ్ పేరు ఏదైతే అది టైప్ చేయాలి). ఒకసారి ఈ కమాండ్‌ను రన్ చేయండి... మీ ఫ్లాష్‌డ్రైవ్‌లో పోయాయనుకున్న ఫైళ్లన్నీ ప్రత్యక్షమవుతాయి.

రైట్ ప్రొటెక్షన్ సంగతి... కొన్ని పెన్‌డ్రైవ్‌లకు రైట్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి... ఇది సరిగా ఉందా? లేదా? అన్నది ముందుగా చెక్ చేసుకోండి. లాక్ తెరిచి ఉన్నా ఫైల్స్ సేవ్ కాకుండా Cannot copy files and folders, drive is write protected...

Cannot format the drive, drive is write protected

The disk is write protected

Remove write protection or use another disk

Media is write protected

వంటి సందేశాలు కనిపిస్తూంటే మీ పీసీలోని స్టార్ట్‌మెనూలోని రన్‌ను ఓపెన్ చేయండి. అందులో regedit అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. దీంతో రిజిస్ట్రీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత HKEY_LOCAL_MACHINE\SYSTEM\CurrentControlSet\Control\StorageDevicePolicies పాథ్‌లోకి వెళ్లి add. ba్ట బ్యాచ్‌ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ స్టోరేజ్ డివైజ్ పాలసీస్ కీ అన్నది లేకపోతే మీరే ఒకటి సృష్టించుకోవాలి. బ్యాచ్‌ఫైల్ డౌన్‌లోడ్ అయిన తరువాత దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అది రిజిస్ట్రీలోకి చేరుతుంది. విండోలో కుడిపైపు ఉన్న ‘రైట్ ప్రొటెక్ట్’కీని క్లిక్ చేసి అందులో వాల్యూ డేటా బాక్స్‌లో ‘0’ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. రిజిస్ట్రీ నుంచి బయటకొచ్చి కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి. పెన్‌డ్రైవ్‌లోకి ఎంచక్కా సమాచారం ఎక్కేస్తుంది.