పెరంబూరు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పెరంబూరు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లోని మహానగరమైన ఉత్తరచెన్నై లోని ఒక ప్రముఖ ప్రదేశం. అన్ని అవసరాలని తీర్చగలిగిన అన్ని వసతులు కలిగి ఖరీదైన ప్రాంతం. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి కల సరి అయిన కారణం తెలియనప్పటికీ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద హుజూర్ తోటల చుట్టూ వెదురు అడవులను పేచబడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో సింప్సన్ ప్రైవేట్ లిమిటెడ్ గృహాలు ఉన్నాయి. తమిళ భాషలో పెరంబు అంటే వెదురు అలాగే ఊరు అంటే నగరం. చెన్నై సెంట్రల్ నుండి ఈ ప్రదేశం 4 కిలోమీటర్లు దూరంలో ఉంది. పెరంబూరు వాణిజ్య నివాస గృహాల మిశ్రితమైన ప్రాంతం. పెరంబూరులో మాధవరం రహదారి అత్యంత చురుకైనవాణిజ్య కేంద్రం. ఇది నగల దుకాణాలకు, ఔషధ దుకాణాలకు, నిత్యావసర దుకాణాలకు కేంద్రం. సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) ఈ ప్రాంతంలో కలదు.
?Perambur Chennai • Tamil Nadu • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13°06′26″N 80°14′40″E / 13.10727°N 80.24448°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | Chennai జిల్లా |
లోక్‌సభ నియోజకవర్గం | Chennai North |
శాసనసభ నియోజకవర్గం | Perambur |
కోడులు • పిన్‌కోడ్ • వాహనం |
• 600011 • TN-05 |
రైల్వే
మార్చుపెరంబూరు మూడు రైల్వే స్టేషన్లతో సేవలందిస్తున్నది. అవి పెరంబూరు, పెరంబూరు కేరేజ్ వర్క్స్, పెరంబూరు లోకో వర్క్స్. 1850లో ఇక్కడ రైల్వే శాఖాపరమైన స్థాపనలు అభివృద్ధి చేసే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని నివాసగృహాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలలో పెరంబూరు ఒక్కటి. చెన్నై నగరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ప్రాంతాలలో పెరంబూరు మొదటి దశలోనిది. తమిళ నాడులో పెరంబూరు ఆంగ్లో ఇండియన్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో ఒకటి. అలాగే దక్షిణ ఇండియాలో కూడా అత్యధికమైన ఆంగ్లో ఇండియన్లు ఇక్కడ నివస్తున్నారు. పెరంబూరు చుట్టుపక్కల ప్రదేశాలలో ఐ సి ఎఫ్ నిర్మాణం సమయంలో పలు ఒప్పందాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ నివాస గృహ సముదాయాలు నిర్మించడం ఆంగ్లో ఇండియన్లు ఇక్కడ అధికంగా నివసించడానికి కారణం.
చెన్నైలోని ప్రధాన రైల్వే కేంద్రాలలో పెరంబూరు ఒకటి ఇందుకు ఇక్కడ ఐ సి ఎఫ్ ఉండడం ఒక్కటే కారణం కాదు ఇక్కడ అనేక ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ళు అగడం కూడా ఒక కారణమే. చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మూర్, తాంబరం, మాంబళమ్ తరువాత చెన్నై మహానగరంలో అధికంగా ప్రయాణీకులు ప్రయాణించే రైల్వేస్టేషన్‍గా పెరంబూరు 5వ స్థానంలో ఉంది.
ఇరుగు పొరుగు ప్రదేశాలు
మార్చుఉత్తర చెన్నైమహానగరానికి పెరంబూరు ఒక ప్రధాన కేంద్రం. పెరంబూరుకు సమీపప్రాంతాలు కొండుంగైయూరు (4.5 కిలోమీటర్లు), సెంబియమ్ (2 కిలోమీటర్లు), పెరియార్ నగర్ (3 కిలోమీటర్లు), టి వి కె నగర్ (3 కిలోమీటర్లు), కొళత్తూరు (4 కిలోమీటర్లు), మూలాంకడై (3 కిలోమీటర్లు), మాధవరం (6 కిలోమీటర్లు), వ్యాసర్ పాడి (2 కిలోమీటర్లు), డౌటన్ లేక పురసైవాక్కమ్ (3 కిలోమీటర్లు), పొన్నియమ్మన్‌మేడు (5 కిలోమీటర్లు), వేప్పేరి (3.5 కిలోమీటర్లు).
ఫ్లై ఓవర్
మార్చుపెరంబూరు వ్యాసర్‌పాడిలను కలిపే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇరుకుగా ఉండి, కిందుగా ఉన్న కారణంగా వర్షాకాలంలో వరదల కారణంగా నగరవాసుల ప్రయాణానికి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉండేది. 1999లో ద్రావిడ మున్నేట్ర కళగమ్ (డి ఎమ్ కె) ప్రభుత్వం తొమ్మిది ఇతర ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌లతో పెరంబూరు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంణ్ కూడా చేపట్టింది. కాని ఒక స్తంభము భూమిలోకి ఒరిగిన కారణంగా నిర్మాణ వ్యయం 21 కోట్ల రూపాయల (210 మిలియన్లు) నుండి నుండి 34 కోట్ల (340 మిలియన్లు) రూపాయాలకు చేరింది. అంతేకాక 2001 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ( డి ఎమ్ కె భాగస్వామ్య పార్టీ అయిన కమ్యూనిష్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్ ) ) తరఫున అభ్యర్థి ఈ నియోజక వర్గంలో ప్టీ చేసిన కారణంగా బ్రిడ్జ్ పనులలో జాప్యం చోటుచేసుకుంది. తరువాతి 5 సంవత్సరాల సమయం పెరంబూరు వంతెన రాజకీయ వివాదాలకు కేంద్రం అయింది. 2006లో తిరిగి డి ఎమ్ కె ప్రభుత్వం అధికారం చేపట్టాక వంతెన పనులు తిరిగి ప్రారంభించబడ్డాయి. అయినా ఈ సమయము నిర్మాణవ్యయం మరింత అధికం అయింది. ఈ వంతెన పెరంబూరు, కొళత్తూరు, టి వి కె నగర్, పెరియార్ నగర్, అయనావరమ్, మాధవరం వాసుల ప్రయాణ వసతులను మెరుగు పరచింది. వ్యత్యాసమైన నిర్మాణసరళిలో నిర్మించబడిన ఈ వంతెనను అప్పటి ముఖ్యమంత్రి ఎమ్ కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి ము క స్టాలిన్ 2010 మార్చి 28 తేదీన ఆరంభించబడింది. ఈ వంతెన పెరంబూరు, పరిసర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న వాహన దిగ్భంద అసౌకర్యం తొలగించింది. ఈ వంతెన భూమి నుండి 13 మీటర్ల ఎత్తు 1.3 కిలోమీటర్ల నిడివి కలిగి ఉంది. గిండీ లోని కత్తిపార వంతెన తరువాత పొండవైన నణ్తెనగా పెరంబూరు వంతెనకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వంతెన మూడు అంతస్తులను కలిగి ఉంది. అడుగున రోడ్డు మార్గం మధ్యలో రైలు మార్గం పైన తిరిగి రోడ్డు మార్గం.
పాలనా నిర్వహణ
మార్చుపెరంబూరు కొళత్తూరు, తిరు వి కా నగర్ నియోజక వర్గాల మధ్యలో ఉంది. ఇవి కూడా ఉత్తర చెన్నైమహా నగరంలో భాగమే. లోక్‌సభా ఎన్నికలలో పెరంబూరు ఉత్తర చెన్నై విభాగంలో ఉంటుంది. పెరంబూరు చెన్నై నగ కార్పొరేషన్‌లో 51వ వార్డు 52బ వార్డు, 53బ వార్డు విభాగాలుగా పరిగణించబడుతుంది.
దేవాలయాలు
మార్చు- దేవాలయాలు :- అయ్యపన్ ఆలయం, తుకత్తమ్మన్ తిరుకోయిల్, వినయకుమార్ కోయిల్, లక్ష్మి అమ్మన్ కోయిల్, లార్డ్ అయ్యప్పన్ కోయిల్, పళని ఆండవర్ కోయిల్, కలసదామన్ కోయిల్.
- చర్చి :- అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ ష్రైన్ (రోమన్ కాఠలిక్ చర్చ్) (100 సంవత్సరాల పురాతనమైనది), సెయింట్ థెర్సా చర్చ్ (రోమన్ కాథలిక్ చర్చ్), సెయింట్ జోసెఫ్ చర్చ్ (సైరో మలబార్), సెయింట్ జార్జ్ చర్చ్ (అర్ధోడాక్స్),
పాఠశాలలు
మార్చుబేగమ్ లతీఫున్నిసా ఇస్లామిక్ నర్సరీ ప్రైమరీ స్కూల్,