పెరికిముగ్గుల

(పెరికముగ్గుల నుండి దారిమార్పు చెందింది)

పెరికిముగ్గుల : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి.సి.ఏ గ్రూపులో 32వ కులం. వీరిని పరదేశీ లని కూడా అంటారు. ఎరుకల బుడగజంగాలుతో వివాహ సంబంధాలున్నాయి. మూఢనమ్మకాలు ఎక్కువ .పెదకాకాని మండలం వెనిగండ్ల చుట్టుపక్కల ఈ కులస్తులు ఉన్నారు. నేరస్తులనే నింద పడిన వారు తాము నేరం చేయలేదని నిరూపించుకోవటానికి ఎర్రగా కాల్చిన పలుగును పట్టుకోవాలని కులపెద్దలు తీర్పునిస్తారు. కులపెద్దలతీర్పుకోసం అయ్యే కొత్త పలుగు, పిడకలు, సారాయి బోజనాల ఖర్చు నిందితుడే భరించాలి. పాసీ కులస్తులతో ఈకులానికి అనేక విషయాలలో సారూప్యత ఉంది.