పైగా సమాధులు
పైగా సమాధులు లేదా మఖ్బారా షామ్స్ అల్-ఉమరా అన్నవి నిజాం రాజులకు తీవ్ర విధేయులుగా ఉంటూ వారి వద్ద రాజ్యతంత్ర నిపుణులుగా, సేనా నాయకులుగా పనిచేసిన పైగా వంశానికి చెందిన సమాధులు.[1]
మొజాయిక్ పలకలు పరిచి, శిల్పనైపుణ్యానికి ప్రసిద్ధిచెందిన ఈ అపురూప నిర్మాణాలు హైదరాబాద్ రాజ్యం కాలంలో నిర్మించిన ప్రసిద్ధ కట్టడాల్లోనివి. పైగాల సమాధులు హైదరాబాద్ నగరంలో చార్మినార్ కు ఆగ్నేయంగా 4 కిలోమీటర్ల దూరంలోని పిసల్ బండ ప్రాంతంలో ఒవైసీ ఆసుపత్రి పక్క నుంచి సంతోష్ నగర్ వెళ్ళే చిన్న దారిలో నెలకొన్నాయి. సున్నం, మోర్టార్లతో నిర్మించా అందంగా పాలరాయి అమర్చి చెక్కి తయారుచేశారు. ఈ సమాధులు 200 సంవత్సరాల పూర్వం నాటివి, పలు తరాలకు చెందిన పైగా ప్రభువంశీకులను ఇక్కడ సమాధి చేశారు.[2]
మొట్టమొదట పైగా సమాధులు విసిరివేసినట్టు, పట్టించుకోని ప్రదేశంలా కనిపించినా అటువంటి స్థితిలోనూ అంత అందంగా కనిపిస్తున్న ఆ కళ గురించి క్రమంగా తెలుస్తుంది. అద్భుతమైన శిల్ప నైపుణ్యం, పూల డిజైన్లలో విశిష్టత, మొజాయిక్ పలకలు చేర్చిన పద్ధతి ఈ కట్టడాలకు అందం తీసుకువస్తోంది. సమాధులు, వాటి గోడలు సునిశితంగా చెక్కి, పాలరాతి ముక్కలతో అలంకరించారు.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ (6 November 2017). "వారసత్వ సంపదకు పూర్వవైభవం". Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 21 April 2018.