పైనావు (కేరళ)
పైనావు, భారతదేశం, కేరళ రాష్ట్రం లోని ఇడుక్కి జిల్లా ఇడుక్కి బ్లాక్‌లోని ఒక చిన్న గ్రామం/కుగ్రామం. ఇది వాజాతోపు పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇది సెంట్రల్ కేరళ విభాగానికి చెందింది. ఇడుక్కి నుండి 3 కిమీ, రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుండి 177 కి.మీ.దూరంలో ఉంది.ఇది ఇడుక్కి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.పైనావు ఇడుక్కి జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. పెద్ద వాణిజ్య కేంద్రం. ఇది ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం లోపల సముద్రమట్టానికి 3,900 అడుగుల ఎత్తులో ఉంది. సివిల్ స్టేషన్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ఇడుక్కి,ఇంకా ఇది అనేక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు నిలయం. పైనావు పిన్ కోడ్ 685603. పోస్టల్ ప్రధాన కార్యాలయం ఇడుక్కి పైనావు.[1]
Painavu | |
---|---|
Town | |
Coordinates: 9°50′52″N 76°56′32″E / 9.84778°N 76.94222°E | |
Country | India |
రాష్ట్రం | Kerala |
జిల్లా | Idukki |
జనాభా (2011) | |
• Total | 14,430 |
Languages | |
• Official | Malayalam, English |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 685603 |
Vehicle registration | KL-06 |
సమీప గ్రామాలు
మార్చుమరియాపురం (8 కిమీ), వాటికుడి (13 కిమీ), వెల్లియమట్టం (16 కిమీ) పైనావుకు సమీపంలోని గ్రామాలు.
సమీప బ్లాకులు
మార్చుపైనావు చుట్టూ పశ్చిమాన ఎలెందేశం బ్లాక్, ఉత్తరం వైపు ఆదిమాలి బ్లాక్, తూర్పు వైపు కట్టప్పనా బ్లాక్, తూర్పు వైపు నెడుంకండోమ్ బ్లాక్ ఉన్నాయి.
సమీప పట్టణాలు
మార్చుఎరట్టుపేట, తోడుపుజా, పాలై, మువట్టుపుజా పట్టణాలు పైనావుకు సమీపంలో ఉన్నాయి.
ఆసక్తికర ప్రదేశాలు
మార్చుఈ ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన ప్రదేశానికి ప్రసిద్ధి చెందింది.పట్టణంలో, పట్టణానికి సమీపంలో అనేక ముఖ్య ప్రదేశాలు ఉన్నాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, జిల్లా పంచాయితీ , కేంద్రీయ విద్యాలయ, మోడల్ పాలిటెక్నిక్ కళాశాల, వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.పైనావు నుండి 7 కి.మీ. ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా చెరుతోని ఆనకట్ట,ఇడుక్కి ఆనకట్ట, ఉన్నాయి. కులమావులకు వెళ్లే వారికి ఈ ప్రదేశం ఒక స్టాప్‌ఓవర్. ఇక్కడి నుండి చెరుతోని ఆనకట్ట, కులమావు మధ్య పడవలో ప్రయాణించవచ్చు. శీతాకాలంలో, వర్షాకాలంలో, ఏనుగులు రోడ్లపై కనిపిస్తాయి. పైనావు సహజమైన అడవులు, పచ్చని కొండలతో చుట్టబడి ఉంది. పైనావులోని అడవులు, తోటలు, ఇతర చిన్న పట్టణాలకు ట్రెక్కింగ్ చేస్తారు.
వాతావరణం
మార్చు- మే -అక్టోబరు: వర్షం 12-25 డిగ్రీలు
- నవంబరు -జనవరి: తేలికపాటి 5-20 డిగ్రీలు
- ఫిబ్రవరి -ఏప్రిల్: వేడి 15-30 డిగ్రీలు
చిత్రమాలిక
మార్చు-
పైనావు గ్రామ దృశ్యచిత్రం
-
పైనావు జంక్షన్, ఇడుక్కి
-
మోడల్ పాలిటెక్నిక్ కళాశాల, పైనావు
-
పైనావు గ్రామ వీక్షణ చిత్రం
-
పైనావు సరస్సు వీక్షణ దృశ్యం
మూలాలు
మార్చు- ↑ "Painavu Village". www.onefivenine.com. Retrieved 2023-05-26.