పొంగులేటి సుధాకర్ రెడ్డి

పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు పనిచేశాడు. పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు.[2][3]

పొంగులేటి సుధాకర్ రెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననంనారాయణపురం గ్రామం, కల్లూరు మండలం,ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిగీతారెడ్డి
సంతానం2
నివాసంఇంటి నెం: 1-2-234/13/49/2, అరవింద్ నగర్, దోమలగూడ, హైదరాబాద్

పొంగులేటి సుధాకర్ రెడ్డి నారాయణ పురం గ్రామం, కల్లూరు మండలం, తెలంగాణ రాష్ట్రం. అయన తండ్రి లక్ష్మరెడ్డి, తల్లి నాగమ్మ.

విద్యాభాస్యం

మార్చు

పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లోని బి.వి కాలేజీ నుండి 1978-81లో బి.కాం పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1981-83లో ఎం.ఏ పట్టా పొందాడు.

రాజకీయ జీవితం

మార్చు

పొంగులేటి సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాడు.

పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనమండలిలో రెండు దఫాలుగా ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఆయన శాసనసభ్యుల కోటా నుండి శాసనమండలికి ఎన్నికయ్యాడు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఆయన పార్టీలో పీసీసీ కార్యవర్గ, సమన్వయ కమిటీ సభ్యత్వ లాంటి పలు పదవులను నిర్వహించాడు. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరాడు.[4][5] ఆయన ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర కోర్ క‌మిటి సభ్యుడు.

ఆయనను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[6]

మూలాలు

మార్చు
  1. "Archive News". The Hindu. Archived from the original on 10 నవంబరు 2012. Retrieved 6 April 2021.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-05. Retrieved 2021-04-06.
  3. "Rosaiah Condemns Jagan's Channel Attacking Sonia". Outlook India. Archived from the original on 2012-07-14. Retrieved 2021-04-06.
  4. The Hindu (1 April 2019). "Ponguleti Sudhakar Reddy quits Congress to join BJP". The Hindu. Archived from the original on 6 ఏప్రిల్ 2021. Retrieved 6 April 2021.
  5. Telangana Today, Home » Hyderabad (31 March 2019). "Ponguleti Sudhakar Reddy joins BJP". Telangana Today. Archived from the original on 6 ఏప్రిల్ 2021. Retrieved 6 April 2021.
  6. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.