మీజిల్స్ (పొంగు) వ్యాక్సిన్ అనేది ఒక టీకా, ఇది పొంగును నివారించటంలో ప్రభావవంతమైంది.[1] ఒక మోతాదు పొందిన తరువాత తొమ్మిది నెలలు గలవారిలో 85% మంది పిల్లలు, పన్నెండు నెలలకు పైగా వయస్సు గలవారిలో 95% మంది పిల్లలు రోగనిరోధక శక్తిని పొందుతారు.[2] ఒక మోతాదును పొందిన తరువాత రోగనిరోధక శక్తిని పెంచుకోని వారందరూ దాదాపు రెండవ మోతాదు తరువాత పెంచుకుంటారు. జనాభాలో టీకా రేట్లు 93% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పొంగు వ్యాప్తి సాధారణంగా జరగదు; అయినప్పటికీ, టీకా రేట్లు తగ్గితే ఇది మళ్ళీ రావచ్చు; టీకా ప్రభావం చాలా సంవత్సరాలు ఉంటుంది. ఇది కాలక్రమేణా తక్కువ ప్రభావవంతంగా మారుతుందా అనేది అస్పష్టంగా ఉంది. వ్యాధి బహిర్గతం అయిన రెండు రోజులలో టీకాను ఇచ్చినట్లయితే వ్యాధిని కూడా టీకా నిరోధించవచ్చు.[1]

పొంగు టీకా వేస్తున్న ఆరోగ్య కార్యకర్త

సాధారణంగా హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ ఉన్నవారితో సహా టీకా అందరికీ సురక్షితమైంది. దుష్ప్రభావాలు సాధారణంగా తేలికపాటిగా ఉండి, స్వల్పకాలం ఉంటాయి. ఇంజక్షన్ చేసిన చోట నొప్పి ఉండవచ్చు లేదా తేలికపాటి జ్వరం రావచ్చు. లక్ష మందిలో ఒకరికి అనాఫిలాక్సిస్ (తీవ్రమైన ఎలర్జీ) వచ్చినట్లుగా నమోదు చేయబడింది. గిలియన్-బారే సిండ్రోమ్, ఆటిజం (పగటికలలు కనే స్వభావం), శోధతో కూడిన ప్రేగు వ్యాధి రేట్లు పెరిగినట్లు కనిపించడం లేదు.[1]  

ఈ టీకా ఒకటిగా లభిస్తుంది, రుబెల్లా టీకా, గవదబిళ్ళ టీకా, వరిసెల్లా టీకా (ఎమ్ ఎమ్ ఆర్ టీకా, ఎమ్ ఎమ్ ఆర్ వి టీకా)తో సహా ఇతర టీకాలతో కలిపి లభిస్తుంది. ఈ టీకా అన్ని సూత్రీకరణలతో సమానంగా పని చేస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా ఉన్న ప్రపంచంలోని ప్రాంతాలలోని తొమ్మిది నెలల వయస్సు వారికి ఇవ్వమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. వ్యాధి చాలా అసాధారణంగా ఉన్న ప్రాంతాలలో పన్నెండు నెలల వయస్సులో ఇవ్వడం అనేది సహేతుకమైనది. ఇది సజీవమైన టీకా. ఇది ఎండిన పొడి నుండి తయారవుతుంది, చర్మం కింద లేదా కండరానికి ఇవ్వడానికి ముందు దీన్ని కలపాలి. టీకా ప్రభావవంతమైంది అనే ధృవీకరణ రక్త పరీక్షల ద్వారా నిర్ధారించబడగలదు.[1]

2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా 85% మంది పిల్లలు ఈ టీకాను పొందారు.[3] 2008లో కనీసం 192 దేశాలు రెండు మోతాదులను ఇచ్చాయి.[1] ఇది మొట్టమొదటగా 1963 లో ప్రవేశపెట్టబడింది.[2] మీజిల్స్-మంప్స్-రుబెల్లా (ఎంఎంఆర్) టీకా కలయిక మొదట 1971 లో అందుబాటులోకి వచ్చింది.[4] 2005 లో చికెన్‌పాక్స్ టీకాను ఈ మూడింటికి కలుపుతూ ఎమ్ ఎమ్ ఆర్ వి టీకాను ఇస్తున్నారు.[5] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమయ్యే చాలా అతి ముఖ్యమైన మందు.[6] ఈ టీకా ఎక్కువ ఖరీదైంది కాదు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Measles vaccines: WHO position paper" (PDF). Weekly epidemiological record. 84 (35): 349–60. 28 August 2009. PMID 19714924.
  2. 2.0 2.1 Control, Centers for Disease; Prevention (2014). CDC health information for international travel 2014 the yellow book. p. 250. ISBN 9780199948505.
  3. "Measles Fact sheet N°286". who.int. November 2014. Retrieved 4 February 2015.
  4. "Vaccine Timeline". Retrieved 10 February 2015.
  5. Mitchell, Deborah (2013). The essential guide to children's vaccines. New York: St. Martin's Press. p. 127. ISBN 9781466827509.
  6. "WHO Model List of EssentialMedicines" (PDF). World Health Organization. October 2013. Retrieved 22 April 2014.