పొటాషియం బైకార్బోనేట్

(పొటాషియం బైకార్బోనేటు నుండి దారిమార్పు చెందింది)

పొటాషియం బై కార్బోనేట్ ఒక రసాయన సంయోగ పదార్థం.దీనిని పొటాషియం హైడ్రోజన్ కార్బోనేట్ (potassium hydrogen carbonate) లేదా పొటాషియం ఆసిడ్ కార్బోనేట్ (potassium acid carbonate) అనికూడా పిలుస్తారు.ఈ సమ్మేళనపదార్థం యొక్క రసాయన ఫార్ములా KHCO3.

పొటాషియం బైకార్బోనేట్
Potassium bicarbonate
పేర్లు
IUPAC నామము
potassium hydrogen carbonate
ఇతర పేర్లు
potassium acid carbonate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [298-14-6]
పబ్ కెమ్ 516893
యూరోపియన్ కమిషన్ సంఖ్య 206-059-0
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:81862
ATC code A12BA04
SMILES [K+].[O-]C(=O)O
  • InChI=1/CH2O3.K/c2-1(3)4;/h(H2,2,3,4);/q;+1/p-1

ధర్మములు
KHCO3
మోలార్ ద్రవ్యరాశి 100.115 g/mol
స్వరూపం white crystals
వాసన odorless
సాంద్రత 2.17 g/cm3
ద్రవీభవన స్థానం 292 °C (558 °F; 565 K) (decomposes)
33.7 g/100 mL (20 °C)
60 g/100 mL (60 °C)
ద్రావణీయత practically insoluble in alcohol
ఆమ్లత్వం (pKa) 10.329[1]

6.351 (carbonic acid)[1]

ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-963.2 kJ/mol
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము MSDS
R-పదబంధాలు R36 R37 R38
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
> 2000 mg/kg (rat, oral)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium bicarbonate
Ammonium bicarbonate
సంబంధిత సమ్మేళనాలు
Potassium bisulfate
Potassium hydrogen phosphate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు

మార్చు

పొటాషియం బైకార్బోనేట్ రంగు లేనటువంటి, వాసన లేనటువంటి సంయోగ పదార్థం. కొద్దిగా క్షారగుణం కలిగిన లవణ పదార్థం. భౌతికంగా పొటాషియం బై కార్బోనేట్ స్పటికారంలో లేదా మృదువైన తెల్లని గుళికల రూపంలో ఉండును.పొటాషియం బై కార్బోనేట్ యొక్క అణుభారం 100.117 గ్రాములు/మోల్.ఈ సమ్మేళన పదార్థ యొక్క సాంద్రత 2.17గ్రాములు/సెం.మీ3.ద్రవీభవనస్థానం 229 C, ఈ ఉష్ణోగ్రతవద్ద పొటాషియం బై కార్బోనేట్ వియోగం చెందును.నీటిలో కరుగుతుంది. 20°Cనీటి ఉష్ణోగ్రతవద్ద,100 మి.లీలలో 33.7గ్రాములు,60°Cవద్ద 60 గ్రాముల పొటాషియం బైకార్బోనేట్ కరుగును.ఆల్కహాల్ లో కరుగదు.

ఉనికి

మార్చు

అతిఅరుదుగా స్వాభావికంగా పొటాషియం బై కార్బోనేట్ లభిస్తుంది.పొటాషియం బైకార్బోనేట్ ఖనిజాన్నికాల్సినైట్ (kalicinite) అందురు.

రసాయనిక చర్యలు

మార్చు

100°Cనుండి 120 °C వద్ద పొటాషియం బైకార్బోనేట్ వియోగం చెందటం వలన పొటాషియం కార్బోనేట్, కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడును.

2 KHCO3 → K2CO3 + CO2 + H2O

పైరసాయన చర్యలో ఏర్పడిన చర్యాజనితాలైన పొటాషియం కార్బోనేట్, కార్బన్ డై ఆక్సైడ్, నీరు మద్య చర్య జరిగిన తిరిగి పొటాషియం బైకార్బోనేట్ ఉత్పత్తి అగును.

K2CO3 + CO2 + H2O → 2 KHCO3

ఉపయోగాలు

మార్చు

బేకింగులో ఆహార పదార్థాలు పొంగుటకు/ఉబ్బుటకు (leavening) కు అవసరమైన కార్బన్ డై ఆక్సైడ్ అందించు వనరుగా ఉపయోగిస్తారు. అగ్నిమాపక పరికారాలలో నిప్పును ఆర్పు పొడిరసాయన పౌడరుగా ఉపయోగిస్తారు.దీనిని BCరకానికి చెందిన అగ్నిమాపక పరికరాలలో వాడెదరు., ప్రయోగశాలలో రిఏజంట్ గా ఉపయోగిస్తారు.మేడికేసనులో బఫ్ఫరింగ్ కారకంగా ఉపయోగిస్తారు.

వైన్ తయారీలో పొటాషియం బైకార్బోనేట్‌ను అడిటివ్‌గా ఉపయోగిస్తారు.అలాగేఆహార పదార్థాలలో క్షారముగా, pHని నియంత్రణిగా ఉపయోగిస్తారు. క్లబ్ సోడాఅతి సాధారణంగా వాడు దినుసు పొటాషియం బై కార్బోనేట్. ఫంగస్‌వినాశినిగా పొటాషియం బైకార్బోనేట్‌ను ఉపయోగిస్తారు.సీసాలలో నిల్వ చేసిన నీటికి రుచికి పొటాషియం బైకార్బోనేట్‌ను కలుపుతారు.కొందరు ఆఫ్రికనులు దేశీయ లవణంగా పొటాషియం బై కార్బోనేట్‌ను వాడెదరు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Goldberg, Robert N.; Kishore, Nand; Lennen, Rebecca M. (2003). "Thermodynamic quantities for the ionization reactions of buffers in water". In David R. Lide (ed.). CRC handbook of chemistry and physics (84th ed.). Boca Raton, FL: CRC Press. pp. 7–13. ISBN 978-0-8493-0595-5. Retrieved 6 March 2011.