పొటాషియం బ్రోమైడ్

(పొటాషియం బ్రోమైడు నుండి దారిమార్పు చెందింది)

పొటాషియం బ్రోమైడ్ అనునది ఒక రసాయన సమ్మేళనం.ఇదిఒక అకర్బన రసాయన సమ్మేళం.

Potassium bromide
Potassium bromide
Potassium bromide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7758-02-3]
పబ్ కెమ్ 24446
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య TS7650000
SMILES [K+].[Br-]
ధర్మములు
KBr
మోలార్ ద్రవ్యరాశి 119.002 g/mol
స్వరూపం white solid
వాసన odorless
సాంద్రత 2.74 g/cm3
ద్రవీభవన స్థానం 734 °C (1,353 °F; 1,007 K)
బాష్పీభవన స్థానం 1,435 °C (2,615 °F; 1,708 K)
53.5 g/100 mL (0 °C)
67.8 g/100 mL (25 °C)
102 g/100 mL (100 °C)
ద్రావణీయత very slightly soluble in diethyl ether
ద్రావణీయత in glycerol 21.7 g/100 mL
ద్రావణీయత in ethanol 4.76 g/100 mL (80 °C)
వక్రీభవన గుణకం (nD) 1.559
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Sodium chloride
కోఆర్డినేషన్ జ్యామితి
octahedral
ద్విధృవ చలనం
10.41 D (gas)
ప్రమాదాలు
R-పదబంధాలు R20, R21, R22, R36, R37, R38
S-పదబంధాలు మూస:S22, S26, S36
Lethal dose or concentration (LD, LC):
3070 mg/kg (oral, rat)[1]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Lithium bromide
Sodium bromide
Rubidium bromide
Caesium bromide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

ఇది ఒక ఘన లవణ పదార్థం.ప్రామాణిక పరిస్థితులలో తెల్లని స్పటిక రూపంలో ఉండును. దీని యొక్క రసాయనిక సంకేతము KBr.పొటాషియం బ్రోమైడ్ యొక్క అణుబారం119.0023గ్రాం/మోల్[2] దీని యొక్కసాంద్రత 2.74గ్రాములు/సెం.మీ3.వక్రిభవన సూచిక 1.559.ఇది వాసన,రంగు లేని సమ్మేళనపదార్ధం[2].ద్రవీభవన ఉష్ణోగ్రత734°C.భాష్పి భవన/మరుగు ఉష్ణోగ్రత 1,435°C[3].నీటిలో సులభంగా కరుగు లక్షణాన్నికలిగి యున్నది.25°Cవద్ద నీటిలో ద్రావణియత 67.8గ్రాములు/100 మీ.లీ.కు.100°C వద్ద 102గ్రాములు/ 100మి.లీటర్లలలోకరుగును. సజల ద్రవంగా ఉన్నప్పుడు తియ్యటి రుచికల్గి ఉండును. ద్రవం యొక్క గాఢత పెరిగిన చేదు రుచి వచ్చును.ద్రవంలో పొటాషియం బ్రోమైడ్ గాఢత మరింత పెరిగిన ఉప్పు రుచిని కలిగి ఉండును.గాఢత పెరిగేకొలది పొటాషియం బ్రోమైడ్ యొక్క రుచిలో తేడాలు రావటానికి కారణం, ద్రావణం లోని పొటాషియం అయానుల గాఢత కుడా పెరగటం వలన.

రసాయనిక ధర్మాలు

మార్చు

పొటాషియం బ్రోమైడు ఒక క్లిష్టమైన స్వాభావమున్న అయానిక్ లవణం. సజలద్రవాలలో,pH7 వద్ద పొటాషియం బ్రోమైడ్ పూర్తిగా వియోగం చెందుతుంది.ఈ విధమైన వియోగం బ్రోమైడ్ అయానుల లభ్యతకు ములవనరుగా పనిచేయును.ముఖ్యంగా ఈ రసాయన వియోగం వలన పోటోగ్రాఫిక్ ఫిల్ములలో ఉపయోగించు సిల్వరు బ్రోమైడ్ ఉత్పత్తికి కీలకమైనది.

KBr(aq) + AgNO3(aq) → AgBr(s) + KNO3(aq)

తయారు చెయ్యుట

మార్చు

సాధారణ సంప్రదాయ పద్ధతి అయినచో,పొటాషియం కార్బోనేట్‌ను ఫెర్రస్ బ్రోమైడ్‌తోరసాయనిక చర్య కావించడం వలన పొటాషియం బ్రోమైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు.ఈ రసాయన చర్యలో ఉపయోగించు ఫెర్రస్ బ్రోమైడు ను ,నీటిలో ఉంచిన వ్యర్థఇనుముకు అధిక మొత్తంలో బ్రోమైడుతో శోషింపచెయ్యడం ద్వారా ఉత్పత్తి చెయ్యుదురు.

4 K2CO3 + Fe3Br8 → 8 KBr + Fe3O4 + 4 CO2

ఉపయోగాలు

మార్చు

పొటాషియం బ్రోమైడ్ ను విసృతం గా మూర్చ రోగ నివారణ(anticonvulsant)చికిత్సలో వాడెదరు.అలాగే కలతను,నొప్పిని పోగొట్టేడు మందుగా, నిద్రపట్టేతట్లు చెయ్యు మందులలో ఉపయోగిస్తారు.పశువైద్యంలో కుక్కలమూర్చ రోగ నివారణలో పొటాషియం బ్రోమైడ్ ను ఉపయోగిస్తారు[4] .పొటాషియం బ్రోమైడ్‌ జీర్ణవ్యవస్థ యొక్క జీవపొరల పై మీద ప్రభావం చూపించడం వలన తలతిప్పడం,వాంతులు రావటం వంటి లక్షణాలు ఏర్పడును.

ఇవికూడ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://chem.sis.nlm.nih.gov/chemidplus/rn/7758-02-3
  2. 2.0 2.1 "POTASSIUM BROMIDE". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-06-22.
  3. "Potassium Bromide". espimetals.com. Retrieved 2015-06-22.
  4. "POTASSIUM BROMIDE". canine-epilepsy-guardian-angels.com. Retrieved 2015-06-22.