పొట్టిపల్లె, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం,నెల్లూరు మండలానికి చెందిన గ్రామం.[1]. ఇది కొండాపురం మండలంలో మండల ప్రధాన కేంద్రమయిన కొండాపురం నుంచి సుమారు 12 మైళ్ళ (18 కి.మీ) దూరంలో ఉన్న మారుమూల గ్రామం. ఇది నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు గ్రామం ఊరికి ఆనుకుని ఉండే మన్నేరు దాటగనే ప్రకాశం జిల్లా లోని రేణిమడుగు గ్రామం వుంటుంది. ఈ మన్నేరు రాళ్ళపాడు ఆనకట్టకు ప్రధాన జల వనరు.

పొట్టిపల్లె గ్రామం రెండు భాగాలుగా వుంటుంది. పాత ఊరు మన్నేరు వాగును ఆనుకుని ఉంటుంది. కొద్ది దూరంలో కొంచెం ఎత్తులో రెండో భాగం "గడ్డమీది ఊరు" ఉంటుంది. పాత ఊరిలో రామాలయం ఉంది. ఆలయం లోని పంచలోహ విగ్రహాలు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ పేరెన్నిక గన్నవి. గడ్డమీద మరొక పెద్ద రామాలయ నిర్మాణం జరిగింది.


  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.