పొన్నుసామి వేణుగోపాల్
పొన్నుసామి వేణుగోపాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు తిరువళ్లూరు నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
పొన్నుస్వామి వేణుగోపాల్ | |||
పదవీ కాలం 2009 - 2019 | |||
నియోజకవర్గం | తిరువళ్లూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] మప్పేడు, తిరువళ్లూరు, తమిళనాడు, భారతదేశం | 1952 ఏప్రిల్ 28||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఏఐఏడీఎంకే | ||
తల్లిదండ్రులు | పొన్నుస్వామి, కమల | ||
జీవిత భాగస్వామి | జయలక్ష్మి | ||
సంతానం | 03 | ||
పూర్వ విద్యార్థి | స్టాన్లీ మెడికల్ కాలేజీ, చెన్నై | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, & డాక్టర్ |
రాజకీయ జీవితం
మార్చుపొన్నుసామి వేణుగోపాల్ 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తిరువళ్లూరు నియోజకవర్గం నుండి ఏఐఏడీఎంకే అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి డిఎంకె అభ్యర్థి గాయత్రి.ఎస్‌పై 31,673 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో ఏఐఏడీఎంకే అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వీసీకే పార్టీ అభ్యర్థి డి. రవి కుమార్ పై 323430 ఓట్లు భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]
పొన్నుసామి వేణుగోపాల్ 2019లో ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కె. జయకుమార్ చేతిలో 356955 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
పార్లమెంట్‌లో నిర్వహించిన పదవులు
మార్చు# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
01 | 2009 | - | సభ్యుడు, 15వ లోక్‌సభ |
02 | 31-ఆగస్ట్-2009 | - | నీటి వనరుల కమిటీ సభ్యుడు |
03 | 31-ఆగస్ట్-2009 | - | మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ |
04 | 31-ఆగస్ట్-2009 | - | పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆహార నిర్వహణపై కమిటీ సభ్యుడు |
05 | 13 జూన్ 2014 | వ్యాపార సలహా కమిటీ సభ్యుడు | |
06 | 14 ఆగస్ట్ 2014 | 30 ఏప్రిల్ 2015 | షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు |
07 | 2014 | గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ - చైర్‌పర్సన్ | |
08 | 2014 | ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు | |
09 | 2014 | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు | |
10 | 29 జనవరి 2015 | సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు | |
11 | 11 మే 2016 | సెక్యూరిటీ ఇంటరెస్ట్ అమలు & రుణాల రికవరీ చట్టాలు, ఇతర నిబంధనల (సవరణ) బిల్లు కమిటీ సభ్యుడు | |
12 | 2016 | జాయింట్ కమిటీ సభ్యుడు | |
13 | 23 సెప్టెంబర్ 2016 | సబ్-కమిటీ-VII సభ్యుడు | |
14 | 2016 | 2017 | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు |
మూలాలు
మార్చు- ↑ "Biography". Lok Sabha Website.
- ↑ Eenadu (12 April 2024). "మెజారిటీ వీరులు.. చేదు అనుభవాలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.