పోఖారా
పోఖారా
పోఖారా
पोखरा | |
---|---|
దేశం | Nepal |
Development Region | Western |
Zone | Gandaki Zone |
District | Kaski District |
Incorporated | 1962 |
విస్తీర్ణం | |
• Total | 55.22 కి.మీ2 (21.32 చ. మై) |
• Water | 4.4 కి.మీ2 (1.7 చ. మై) |
Highest elevation | 1,740 మీ (5,710 అ.) |
Lowest elevation | 827 మీ (2,713 అ.) |
జనాభా (2013) | |
• Total | 3,00,000 |
• జనసాంద్రత | 5,000/కి.మీ2 (10,000/చ. మై.) |
• Ethnicities | Khas (Brahmin Chhetri Thakuri & Dalits) Gurung Magar Newar Thakali |
• Religions | Hinduism Buddhism |
Time zone | GMT +5:45 |
Postal Code | 33700 (WRPD), 33702, 33704, 33706, 33708, 33713 |
ప్రాంతపు కోడ్ | +61 |
నేపాల్ వెళ్లినవారికి ఎప్పుడెప్పుడు వెళ్లి చూ ద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్న పూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది పోఖారా. ఇక్కడి మత్స్యపుత్స పర్వతం చూడ టం ఒక వింతైన అనుభవం. చేపతోక రూ పం లో ఆ శిఖరాలు కనిపిస్తాయి.
సూర్యోదయం
మార్చుకువ ఝామునే లేచి సూర్యోదయ కిరణాల వెలు గులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకిం చడం జీవితంలో మరువలేని అను భవం. సూర్యుని తొలికిరణాలకు వెలుగులు ప్రారంభించి, సమయంతో పెరిగే సూర్య కిరణాలకు తగిన రీతిలో వెలుగులను విరజిమ్మే ఆ శిఖరాలను దర్శించి అన్నపూర్ణ మాతకు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ ప్రదేశంలోని మిగిలిన ఆకర్షణలవైపు కళ్లు తిప్పగలం.
పడవ విహరం
మార్చుసమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవల్లో విహరించవచ్చు. ఎవరికివారు నడుపుకుంటూ వెళ్లేందుకు వీలున్న పడవలున్నాయి. పర్వతాల మధ్య ఉన్న ఆ సరస్సులో ప్రశాంత జలాలమీద నెమ్మదిగా సాగే పడవ ప్రయాణం ఎంతో బావుంటుంది.
దేవీజలపాతం
మార్చుప్రపంచ శాంతి కోరుతూ... ప్రపంచశాంతి కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచులో ఉంటుంది. అక్కడ నిలబడి పడమరగా తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లుగా ఉండదు. ఈ అందమైన ప్రకృతిని పగలంతా కాంచినా తనివితీరని సూర్యుడు దిగాలుగా వెళ్లలేక వెళుతున్నాడా అనిపిస్తుంది. నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి దిగుతుంటే పర్వత ఛాయలు లోయలంతా కప్పుతాయి. అంతవరకు ఒక వెలుగు వెలిగిన ఆ ప్రాంతమంతా హఠాత్తుగా మేఘాలు కమ్మినట్టయి చీకటిగా అవుతుంది. పక్షులు అరుపులు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ మార్పును చూస్తూ పర్యాటకులు మౌనంలోకి వెళతారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. గుప్తేశ్వర గుహ పోఖరాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. అది గుప్తేశ్వర మహాదేవుని నిలయం. దాదాపు 140 మీటర్ల పొడవున్న గుహ అది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆ గుహగుండా ప్రయాణం చేసి ఆవలకు చేరుకునేసరికి సరిగా ఎదురుగా పాలరంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. అది దేవీజలపాతం.