పోతన కీ బోర్డు
పోతన తెలుగు కీ బోర్డు తిరుమల కృష్ణ దేశికాచార్యులు రూపొందించాడు. ఇన్స్ క్రిప్ట్ లాంటి వాటిలో మంచి లక్షణాలు (ఒకే కీల సమూహానికి ఒకే అక్షరము), ఐట్రాన్స్ లేక ఆర్ టి యస్ లో మంచి లక్షణాలు ( గుణింతాలకొరకు హల్లుల తర్వాత అచ్చులు వాడటం), ఇంగ్లీషు కీల ఉచ్ఛారణకి దగ్గరగా తెలుగు అక్షరాలు జతచేయబడి సులభంగా రెండు భాషలలో టైపు చేసుకోవటం నేర్చుకోవటానికి, వాడటానికి వీలుగా వుంటుంది. ఇది 1993 లో ప్రారంభించిన, యాజమాన్యహక్కులు గల కీమెన్ సాఫ్ట్వేర్ పై ఆధారపడింది. తరువాత సాఫ్ట్వేర్ 2000 పైగా భాషల తోడ్పాటుతో విండోస్, మేక్, లినక్స్ నిర్వహణ వ్యవస్థలకొరకు స్వేచ్ఛానకలుహక్కులతో అందుబాటులోవుంది.[1]
పోతన కీ బోర్డు | |
---|---|
అభివృద్ధిచేసినవారు | తిరుమల కృష్ణ దేశికాచారి |
మొదటి విడుదల | 2001-03-02 |
సరికొత్త విడుదల | 2.1 / 2020-04-08 |
నిర్వహణ వ్యవస్థ | విండోస్ ఎక్స్.పి., విండోస్ 2000, విండోస్ 95,98,ఎమ్.ఈ, లినక్స్ |
రకము | కీ బోర్డు |
లైసెన్సు | జీ.పి.ఎల్ |
వెబ్‌సైట్ | https://keyman.com/keyboards/pothana |
తెలుగులో విండోస్ 2000, విండోస్ ఎక్స్.పి. (XP), విండోస్ 95,98, ME లో, లినక్స్ అప్లికేషన్లలో ఈ సాఫ్ట్‌వేర్ ను వాడవచ్చు. ఇది తెలుగు టైపు రైటరు కు దగ్గరగా ఉంటుంది. దీనిని మొదటిసారి విండోస్ వాడేవారికి పోతన ఫాంటు, వేమన ఫాంటులతో జతచేసి విడుదల చేసారు
మొదలు పెట్టడము
మార్చువిండోసు
విండోస్ ఉన్న కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ ను దించి వ్యవస్థాపితం చేస్తే చాలు. తరువాత వర్డ్, వర్డ్పాడ్ లాంటి అప్లికేషన్ లలో పోతన2000 అనే ఫాంట్ సెలక్టు చేసుకుని, తెలుగులో టైపు చెయ్యవచ్చు. మామూలుగా, విండోస్ లో తెలుగు భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత కీమాన్ కీబోర్డు బార్ లో తెలుగుని ఎంచుకోవాలి
లినక్సు
దీని ఫైళ్లు m17n-contrib పాకేజిలో వున్నాయి అవసరమైతే scim-bridge, scim-m17n, m17n-contrib పాకేజీలు తెచ్చుకోవాలి. పాకేజిలు వ్యవస్థాపితం చేసి scim setup లో తెలుగు భాషని దానిలో పోతనను ఎంచుకోవాలి.
కీ బోర్డు నమూనా, నేర్చుకోవడం
మార్చుమరిన్ని వివరాలు File:కీమెన్_కన్ఫిగరేషన్_మాన్యువల్.pdf లో చూడండి.