పోతన (ఫాంటు)
(పోతన ఫాంటు నుండి దారిమార్పు చెందింది)
పోతన (లేదా పోతన2000 లేదా Pothana2000) అన్నది తెలుగు యూనికోడ్ ఫాంటు. తిరుమల కృష్ణ దేశికాచార్యులు ఈ ఫాంటుని సృష్టించాడు. 2000 కు ముందే అమెరికా దేశంలో పోతన వాడబడుతున్నా 2001 లో యూనికోడ్ రూపంలో విడుదలైంది. (పోతన పేపరు -ఆంగ్లంలో) ఇది విండోస్ 2000లో మొట్టమొదటగా పనిచేసింది. దీనితో జతగా వేమన కూడా విడుదలైంది. [1] తరువాత కాలంలో ఇది జిపిఎల్ లో విడుదలై, ఫెడోరా ప్రాజెక్టు ద్వారా నిర్వహించబడుతుంది [2] దీనిలో 630 గ్లిఫ్స్ ఉన్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "పోతన ఫాంటు డౌను లోడు". Tirumala Krishna Desikacharyulu. Archived from the original on 2004-10-11. Retrieved 2007-07-03.
- ↑ "Pothana 2000 fonts". Fedoraproject. Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-29.