పోస్టాఫీసు, భారతీయ తపాలా వ్యవస్థలో అతి ముఖ్యమైన విభాగం.ఇది ప్రజలు ఉత్తర ప్రత్యత్తరాలు జరుపుకొనుటకు అవసరమైన తపాల స్టాంపులు, పార్శిల్సు పంపే ప్రదేశం.[1] ప్రజలకు సంబంధించిన కొన్ని సర్వీసులు వీటి ద్వారానే జరుగుతాయి.

ఆమదాలవలస పోస్టు ఆఫీసు

పోస్టాఫీసులలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి.వీటి ప్రజలకు అవసరమైన కొన్ని రకాల పనులు జరుగుతాయి. వాటిలో లేఖలు, లేదా ఉత్తరాలు గమ్యస్థానానికి చేర్చి అందచేయుట, ఆర్థిక లావాదేవీలు, డబ్బు పంపే సేవలు, జీవిత బీమా మొదలైన సేవలు, కాలనుగుణంగా కొన్ని కొత్త తరహా సేవలు అందిస్తాయి.బ్యాంకింగ్ సేవల్లో పొదుపు ఖాతా ద్వారా డబ్బును దాచుకోవచ్చు. వివిధ రకాల పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు.

భీమా రంగం కింద పోస్టల్ జీవిత బీమా గ్రామీణ పోస్టల్ జీవిత బీమాను అందిస్తుంది. వివిధ రకాల సేవలను పోస్ట్ విభాగం అందిస్తుంది. డబ్బు చెల్లింపు, పెన్షన్ చెల్లింపులు, ఎలక్ట్రిక్ బిల్లు సేకరణ, టెలిఫోన్ బిల్లు సేకరణ మొదలగు సేవలు తపాలా కార్యాలయం అందిస్తుంది.[2]

రిజిస్త్రేషన్‌ స్టాంపు పేపర్లు మార్చు

పోస్టాఫీసులలో రిజ్రిస్టేషన్‌ స్టాంపు పేపర్లను విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.స్టాంపు పేపర్లు ఇప్పుడు రిజ్రిస్టార్ల కార్యాలయంలో లభ్యమవుతున్నాయి. కొందరు లైసెన్సుదారులు బయట స్టాంపు పేపర్లు విక్రయిస్తున్నారు. స్టాంపు పేపర్ల విక్రయదారులలో బినామీలు కూడా ఉంటున్నట్లు సమాచారం. కొందరు స్టాంపు పేపర్ల అసలు ధర కంటే ఎక్కువగా తీసుకుని వినియోగదారుల మోసగిస్తున్నారు.వీరిపై మాత్రం ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. గతంలో కొంతమంది ఆరోపణలు వచ్చినా యధావిధిగా వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటువంటి వ్యాపారానికి తెరదించడానికి పోస్టాఫీసుల్లో స్టాంపు పేపర్లను విక్రయించాలని సంకల్పించారు. పోస్టాఫీసులలో స్టాంపుపేపరు ధర ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేసే అవకాశం లేదు.

సరుకు రవాణా మార్చు

షిప్పింగ్ మెయిల్ మార్చు

పోస్టల్ సర్వీస్ దేశీయ, విదేశీ సంస్థలకు మెయిల్ రవాణా చేస్తుంది. మెయిలింగ్ సేవలకు ఉదాహరణలు "ఎక్స్‌ప్రెస్ మెయిల్," "ప్రియారిటీ మెయిల్" "ఫస్ట్ క్లాస్ మెయిల్." సాధారణ ఎన్వలప్‌లు, పెద్ద ప్యాకేజీలను పంపవచ్చు. డెలివరీని నిర్ధారించడానికి ఈ మెయిల్ భీమా, రిజిస్టర్డ్ మెయిల్ పంపవచ్చు.[3]

ఇప్పటి వరకు లాజిస్టిక్‌ పోస్ట్‌ ద్వారా తక్కువ బరువు గల సరుకును మాత్రమే రవాణా చేసే వారు. ఇప్పుడు 500 కిలోల నుంచి ఆపై బరువున్న సరుకును కూడా పోస్టల్‌ వ్యాన్‌ ద్వారా పూర్తి గ్యారంటీ విధానంలో రవాణా చేస్తున్నారు.ట్రాన్స్‌పోర్టు కంపెనీలు సరుకు రవాణాకు తీసుకునే రేటు కంటే పోస్టల్‌ వ్యాన్‌ ద్వారా రేటు తక్కువ.

మూలాలు మార్చు

  1. "POST OFFICE | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Retrieved 2020-12-22.
  2. https://www.indiacode.nic.in/bitstream/123456789/2329/1/A1898-06.pdf
  3. "Function of the Post Office". Bizfluent (in ఇంగ్లీష్). Retrieved 2020-12-22.

వెలుపలి లంకెలు మార్చు