ఆమదాలవలస

ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మండల పట్టణం

ఆమదాలవలస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పట్టణం.ఇది ఆముదాలవలస మండలానికి ప్రధాన కేంద్రం. ఆముదాలవలస ఆముదాలవలస మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[3] ఇదే పేరుతో పురపాలక సంఘం హోదా కలిగి ఉంది. శాసనసభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను ఈ వూరిలోనే ఉంది. ఇది శ్రీకాకుళం నకు 8 కి.మీ. దూరంలో ఉంది.

ఆమదాలవలస
—  పట్టణం  —
ఆమదాలవలస is located in Andhra Pradesh
ఆమదాలవలస
ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°25′00″N 83°54′00″E / 18.4167°N 83.9000°E / 18.4167; 83.9000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 19.65 km² (7.6 sq mi)
జనాభా (2011)[2]
 - మొత్తం 39,799
పిన్ కోడ్ 532185
ఎస్.టి.డి కోడ్

మండలంలోని పట్టణాలుసవరించు

  • ఆమదాలవలస (NP)

ఆమదాలవలస మున్సిపాలిటీ వివరాలు:సవరించు

శ్రీకాకుళం జిల్లాలోని 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి.ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో ఆముదం అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం. ఆముదాలవలస అనేది శ్రీకాకుళం జిల్లా ఒక పట్టణం.ఇది పురపాలక సంఘం హోదా కలిగి ఉంది.ఆముదాలవలసలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి సంగమేశ్వర ఆలయం లేదా సంగమయ్య కొండ, వయోడక్టు,

సంగమయ్య కొండసవరించు

ప్రస్తుతం సంగమయ్య కొండ ఆముదాలవలస పట్టణమునకు 8 కి.మీ. దూరంలో హీరామండలము పోవు మార్గములో జి.కొల్లి వలస గ్రామమునకు దాపున ఉంది.ఈ కొండ పవిత్రమైన శైవక్షేత్రముగా నేటికీ పరిగణింపబడుతున్నది.ఈ కొండకు సుమారు 800 మెట్లు ఉన్నాయి. అది సాక్షాత్తూ శ్రీ సంగమేశ్వర స్వామి నిలయంగా పవిత్ర శైవ క్షేత్రంగా చుట్టు పక్కల గ్రామాలకే కాక, జిల్లాలోని పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.మెట్లుదాటి పైకి చేరిన వెంటనే మనకు గుహముఖము (శిఖరము) కనబడుతుంది.ముఖద్వారం వద్ద నంది విగ్రహం ఉంది. పక్కనే రెండి జైన విగ్రహాలు ఉన్నాయి.వీటికి సింహం లాంఛనముగా ఉన్నందు వలన వీటిని మహావీరుని ప్రతిమలుగా గుర్తించగలరు. సంగమేశ్వరాలయం నిజానికి ఆలయముకాదు.ఇది ఒక గుహ.గుహముఖద్వారం శిఖరంగా మలిచి, ముఖమండపం కట్టి శివలింగాన్ని, నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.జైన మతం ఉత్తర సర్కారు జిల్లాలలో సా.శ.12వ శతాబ్దములో వేంగీ చాళుక్యుల కాలంలో తూర్పుగాంగుల కాలమున వుచ్ఛస్థితిలో ఉన్నట్లు చారిత్రక శాశనాలు తెలుపుచున్నవి. మూడవ విష్ణువర్ధనుడి కాలంలో జైన గురువగు సిద్ధాంతదేవుడు విజయనగరం పట్టణానికి దాపున ఉన్న రామతీర్ధంను సందర్సించినట్లు అక్కడ లభించిన శాసనముల ద్వారా తెలియుచున్నది.ఈయన దేశీ గణమునకు చెందినవాడని, విజయదిత్యునకు జిన గురువని కూడా ఈశాసనం పేర్కొనుచున్నది. అందువలన ఈ గుహ కూడా అదేకాలమునందు నిర్మించబడి ఉండవచ్చును. కానీ 16వ శతాబ్దమునాటికి జైన మతము పై పూర్తిగా ఈ ప్రాంతములో వ్యతిరేక భావనలు వీచినందు వలన, శైవము జిన మతము ధ్వంసానికి కొంత కారణమైనందువలన, ఈ ప్రాంతములో అదే సమయములో సంగమయ్య కొండ శివాలయముగా మార్చబడి ఉండవచ్చును. బహుసా 13,14వ శతాబ్దముల కాలమునాటికే మార్చబడి ఉండవచ్చును అని చారిత్రుకుల అభిప్రాయము.

ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గంసవరించు

2014 పురపాలక సంఘ ఎన్నికలుసవరించు

  • మొత్తం ఓటర్లు: 29085
  • పోలయిన ఓట్లు : 24025
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 ఆముదాలవలస తెలుగుదేశం 8270 8
2014 ఆముదాలవలస కాంగ్రెస్ 3541 3
2014 ఆముదాలవలస వై.కా.పార్టీ 10620 10

మూలాలుసవరించు

  1. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 22 నవంబర్ 2015. Retrieved 18 May 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Census of India: Search Details". www.censusindia.gov.in. Retrieved 24 December 2015.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-15.

వెలుపలి లంకెలుసవరించు

మూసలు, వర్గాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమదాలవలస&oldid=3522220" నుండి వెలికితీశారు