ప్యాట్రిక్ మోడియానో

ఫ్రెంచ్ రచయిత


పేట్రిక్ మోడియానో ఒక ఫ్రెంచి నవలా రచయిత. 2014 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతిని గెలుచుకున్నాడు[1].నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రాన్స్ నవలా రచయిత ఆయన. ఆక్రమణలో ఉన్న జీవితాలని ఆయన అక్షరబధ్ధం చేశారు.

పేట్రిక్ మోడియానో (Patrick Modiano)
పుట్టిన తేదీ, స్థలంజీన్ పేట్రిక్ మోడియానో
(1945-07-30) 1945 జూలై 30 (వయసు 79)/జూలై 30, 1945
బొలాంజ్ బిలియన్ కోర్ట్, ఫ్రాన్స్
వృత్తినవలా రచయిత
భాషఫ్రెంచి
జాతీయతఫ్రాన్స్
రచనా రంగంనవలలు
ప్రభావంమార్సెల్ ప్రోస్ట్
పురస్కారాలుGrand Prix du roman de l'Académie française (1972)
Prix Goncourt (1978)
Prix mondial Cino Del Duca (2010)
Austrian State Prize for European Literature (2012)
నోబెల్ సాహిత్య బహుమతి (2014)
జీవిత భాగస్వామిDominique Zehrfuss
సంతానంజిన మోడియానో
మేరీ మోడియానో

జీవిత విశేషాలు

మార్చు

ఒక జ్యూయిష్ ఇటాలియన్ వ్యాపారవేత్తకి, బెల్జియమ్ నటికి పశ్చిమ ఫ్రాన్స్‌లోని సబర్బన్ ఏరియాలో 1945 జూలైలో జన్మించాడు పేట్రిక్ మోడియానో.ఆయన తండ్రి యూదు ఇటాలియన్. తల్లి బెల్జియానికి చెందిన నటి. పారిస్ నగరాన్ని హిట్లర్ నాజీ సేనలు ఆక్రమించుకున్న సందర్భంలో వారిద్దరూ కలుసుకున్నారు. తల్లిదండ్రుల తాలూకు ఈ జ్ఞాపకాలు, నాటి చారిత్రక పరిణామాలు మోడియానో మీద బలమయిన ముద్ర వేశాయి.సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం ఐరోపా‌లో ముగిసిన కొద్దికాలానికే పుట్టడం వలన మోడియానో సున్నితమైన బాల్యాన్ని కోల్పోయాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల దురాక్రమణ, సామాన్య ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమంగా బంధించడం, అమానవీయంగా దొరికినవారిని చంపడం లాంటి ఎన్నో విషయాలను వింటూ ప్రారంభమైంది మోడియానో జీవితం. నోబెల్ అవార్డు ప్రకటించిన కొద్ది సమయానికే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకో హోలన్‌డే ఆలవోకగా మోడియానో గురించి మాట్లాడుతూ He tries to understand how events lead individuals to loss or to find themselves ప్రశంసించారు.

రచనలు

మార్చు

ఆధునిక ప్రపంచం మనిషిని కోల్పోయిన చిరునామా. మరిచిపోయిన గమ్యం గురించి, ఎవరూ పిలవని నిరీక్షణ గురించి, ఎవరూ పలకరించని ఒంటరితనం గురించి, ఎవరూ ఓదార్చని దుఃఖం గురించి, ఎవ్వరూ కన్నీరవ్వని మరణం గురించి తల్లడిల్లుతున్న ‘కాలాన్ని’ పట్టుకున్న అతి కొద్దిమంది రచయితలలో పేట్రిక్ మోడియానో మొదటివాడు. సమకాలీన ఫ్రెంచ్ సాహిత్యం మొత్తం వ్యక్తిగత, అంతర్గత స్వీయ గీతాలనే గానం చేస్తోందని, ఇది ప్రపంచ వేదికపై దీటైన పోటీని ఇవ్వలేదని అనుకుంటున్న కాలంలో మోడియానో 1968లో మొదటిసారిగా, ఫ్రెంచ్ ఆధునిక సాహిత్య ముఖపత్రాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాడు. తన మొదటి నవలతోనే, ఆధునిక మానవుడి అంతర్గత సంఘర్షణని పట్టుకొని, ‘అతను’ కోల్పోతున్న ‘అతనిని’ గురించి హెచ్చరించాడు. కొత్త సాంకేతికతను నైపుణ్యంగా చేసుకొని, సుమారు 24 నవలలతో, బాలసాహిత్య రచనలతో, సినిమా కథలతో 46 సంవత్సరాలుగా ఫ్రెంచ్ వేదికగా చేసుకొని ప్రపంచాన్ని పలకరిస్తున్నాడు.

నాజీల చేతుల్లో మారణకాండకు గురయిన యూదుల మనోభావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, గుర్తిపును కోల్పోవటం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. 1968 లో వెలువడిన "లా ప్లేస్ ది ఎలిటోయిలే" నవల్ యూరోప్ దేశాల్లో సంచలనం సృష్టించింది. ఆయన నవల "మిస్సింగ్ పర్సన్" 1978 లో ప్రతిష్ఠాత్మక "ప్రిక్స్ గోన్ కోర్ట్" అవార్డుకు ఎంపికయింది. మోడియానో ఫ్రెంచి భాషలో 40 కి పైగా రచనలు చేశారు. వాటిలో కొన్ని ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. రింగ్ ఆఫ్ రోడ్స్: ఎ నోవల్, విల్లా ట్రిస్టీ, ఎ ట్రేస్ ఆఫ్ మెలైన్, హనీమూన్ వంటివి ఆ కోవలోనివి. ఆయన చిన్న పిల్లల పుస్తకాలు కూడా రాశారు. సినిమాలకు స్క్రిప్ట్ ని కూడా అందించారు. 2000 లో కేన్స్ సినీ ఉత్సవాల జ్యూరీలో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 ఆస్ట్రేలియా స్టేట్ ప్రైజ్ ని గెలుచుకున్నారు.

రచించిన నవలలు

మార్చు
  • (1968) La Place de l'étoile
  • (1969) La Ronde de nuit; English translation: Night Rounds (New York: Alfred A. Knopf, 1971)
  • (1972) Les Boulevards de ceinture; English translation: Ring Roads (London: Gollancz, 1974)
  • (1974) Lacombe, Lucien; screenplay co-written with Louis Malle; English translation: Lacombe, Lucien: The Complete Scenario of the Film (New York: Viking, 1975)
  • (1975) Villa triste
  • (1977) Livret de famille
  • (1978) Rue des Boutiques obscures; English translation: Missing Person (London: Jonathan Cape, 1980)
  • (1981) Une jeunesse
  • (1981) Memory Lane (drawings by Pierre Le-Tan)
  • (1982) De si braves garçons
  • (1984) Quartier Perdu; English translation: A Trace of Malice (Henley-on-Thames: Aidan Ellis, 1988)
  • (1986) Dimanches d'août
  • (1988) Catherine Certitude (illustrated by Sempé); English translation: Catherine Certitude (Boston: David R. Godine, 2000)
  • (1988) Remise de peine
  • (1989) Vestiaire de l'enfance
  • (1990) Voyage de noces; English translation: Honeymoon (London: Harvill / HarperCollins, 1992)
  • (1991) Fleurs de ruine
  • (1992) Un cirque passe
  • (1993) Chien de printemps
  • (1995) Du plus loin de l'oubli; English translation: Out of the Dark (Lincoln: Bison Books / University of Nebraska Press, 1998)
  • (1997) Dora Bruder; English translations: Dora Bruder (Berkeley: University of California Press, 1999), The Search Warrant (London: Random House / Boston: Harvill Press, 2000)
  • (1999) Des inconnues
  • (2001) La Petite Bijou
  • (2003) Accident nocturne
  • (2004) Un pedigree
  • (2007) Dans le café de la jeunesse perdue
  • (2010) L'Horizon
  • (2012) L'Herbe de nuit
  • (2014) Pour que tu ne te perdes pas dans le quartier

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు