ప్రకాశ భారతీయోగి

ప్రకాశ భారతీ యోగి సా.శ1381 కాలం నాటి వాడు. ఇతని అన్నీ రచనలు అలభ్యాలు. అయితే కొన్ని శాసన పద్యాలు దొరికాయి. జయంతి రామయ్య పంతులు వీటి పైన పరిశోధనలు చేసారు. ప్రకాశ భారతి యోగి అనవేమారెడ్డి ఆస్థాన కవి. క్రీ, శ. 1364- 1386 మధ్య కాలం నాటి కవి.

దేవాలయ వాస్తు

మార్చు

ఈయన లిఖించిన రెండు శాసన పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇవి కావ్యం చేసినది ఈయనే అయినా గండరించినది మాత్రం పెద్దనాచార్యుడు. ఈ పద్యాల వలన దేవాలయాలలో ఎన్ని కట్టడాలు ఉన్నావో తెలుసుకోవడం సాధ్యం అవుతున్నవి. ఈ పద్యాల లోని కట్టడాలు ఇలా ఉన్నవి;

  1. నంది దీపావళి
  2. నాట్య మండపం
  3. కళ్యాణ మండపం
  4. హోమ మండపం
  5. సనివార మండపం
  6. గయార్క మండపం
  7. తిరుచుట్టు మాలియా
  8. దివ్య లింగంబుల గుళ్ళు
  9. వజ్రంపు రాకోట
  10. గోపురాలు
  11. పాతాల గేహాలు
  12. సోపానాలు
  13. భాండాగారాలు
  14. వివిధ ధాన్యాలయాలు
  15. వంట ఇండ్లు
  16. చతుర్ద్వారా కవాటములు
  17. పది వార దేవతా భవనములు

ఈయన రాసిన ఈ రెండు శాసన పద్యాలు తప్ప ఇతరాములేవి తెలియరాలేదు. ప్రకాశ భారతి యోగి చెప్పిన ఈ శాసన పద్యాల వలన తెలియవచ్చిన ఆలయ విశేషాలు చూద్దాం; దేవాలయాలలో మంటపాలు నిర్మిస్తారు. గర్భ గుడిలో మూల విరాట్టులుంటారు. మంతపాలలో నిర్ణీత సమయాలలో ఉత్సవాల నిమిత్తం దేవతా విగ్రహాలను నిలుపుతారు. ప్రకాశ భారతీ యోగి అయిదు ప్రత్యెక మంటపాల గురించి విపులీకరించాడు.

  1. గయార్క మంటపం: ఇది రథాకారంలో ఉంటుంది. రథ సప్తమి నాడు స్వామీ వారిని సేవ చేయడానికి ఆలయంలో నిర్మించే ప్రత్యేక మంటపం ఇది. దీనిని సామాన్యంగా ఆర్క మంటపం అంటారు. సూర్యునికి సంబంధించిన కట్టడ విశేషం.
  2. కళ్యాణ మంటపం: దేవుని కల్యానోత్సవాల కోసం నిర్మించిన ప్రత్యేకమైన మంటపం.
  3. నాట్య మంటపం: దైవ సన్నిధిలో జరిగే వివిధ కార్యక్రమాలు అంటే నృత్యం, గానం, నాటకాల వంటివి జరిపే మంటపం. ఇది అన్నిటి కన్నా విభిన్నమైన కట్టడం.
  4. శనివార మంటపం: శనివార మహోత్సవాలు ప్రత్యేకమైనవి. వాటి కోసం ప్రత్యేకంగా నిర్మితమైనవి.
  5. హోమ మంటపం: దేవాలయాలలో యాగాది క్రతువులు చేయడానికి నిర్మించిన మంటప విశేషాలు.

మూలాలు

మార్చు

సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆరుద్ర, తెలుగు అకాడెమి, 2008 ప్రచురణ, పుట 634

ఇతర లింకులు

మార్చు