ప్రకృతి మిశ్రా
ప్రకృతి మిశ్రా భారతీయ నటి. ఆమె ప్రధానంగా ఒడియా సినిమాలు, హిందీ టెలివిజన్ ధారావాహికలలో నటించినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె హలో ఆర్సీ(2018)కి జాతీయ చలనచిత్ర అవార్డు (ప్రత్యేక ప్రస్తావన) అందుకుంది.[1] ఆమె ఇటీవల జై కన్హయ్య లాల్ కియోన్ స్టార్ భారత్‌లో దేవానీగా, బిట్టి బిజినెస్ వాలియన్ అండ్ టీవీలో బిట్టిగా నటించడమేకాకుండా ఎంటీవీ ఏస్ ఆఫ్ స్పేస్ 2 రియాలిటీ షోలో 5వ రన్నరప్‌గా నిలిచింది.
ప్రకృతి | |
---|---|
జననం | భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం |
విద్య | బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ (BA) |
విద్యాసంస్థ | భవన్స్ కళాశాల, ముంబై |
వృత్తి | నటి, మోడల్, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2000 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బిట్టి బిజినెస్ వాలియన్ |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఒడియా సంగీత దర్శకుడు మన్మత్ మిశ్రా, న్యూస్ రీడర్ కృష్ణప్రియ మిశ్రా దంపతులకు ప్రకృతి మిశ్రా రెండవ సంతానం. భువనేశ్వర్‌లోని వెంకటేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె రమా దేవి ఉమెన్స్ కాలేజీలో కామర్స్ లో ఇంటర్మీడియట్ చదివింది. తరువాత, ఆమె పశ్చిమ ముంబైలోని భవన్స్ కళాశాల నుండి బి.ఎ. పట్టా పుచ్చుకుంది.
ఆమె గురు గంగాధర్ ప్రధాన్ వద్ద ఒడిస్సీ నృత్యం నేర్చుకుంది.[2]
కెరీర్
మార్చుతన ఐదేళ్ల వయసులో సబతా మా, సునా పంఖురి చిత్రాలతో బాలనటిగా ఆమె నటనను ప్రారంభించింది. ఈటీవీ ఒడియా తులసిలో స్మ్రుతి పాత్రలో నటించిన తర్వాత ఆమె ప్రజాదరణ పొందింది. 2006లో, ఆమె సషుఘర చలిజిబికి ఉత్తమ బాలనటిగా ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
ఆమె ఒడిశా సినిమాలో బాబూషన్‌తో కలిసి తుకూల్ చిత్రంతో ప్రధాన నటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె 10కి పైగా ఒడియా చలనచిత్రాలలో నటించింది.[3] 2018 లో, ఆమె పార్థ సారథి రే సరసన హలో ఆర్సీలో నటించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది.
2014లో, ఆమె జీటీవీ ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్‌లో పాల్గొన్నది. 2018లో ఆమె భారతీయ టీవీ సిరీస్ లాల్ ఇష్క్ లో మధుర పాత్రను కూడా పోషించింది.
&టీవీలో ప్రసారమైన హిందీ సీరియల్ బిట్టి బిజినెస్ వల్లీలో ఆమె పాత్రకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.[4]
2019లో, ఆమె ఎంటీవీ ఇండియా ఏస్ ఆఫ్ స్పేస్ 2లో పాల్గొంది, ఫైనలిస్ట్‌గా ఎదిగింది.
అవార్డులు
మార్చుYear | Award | Category | Film | Result | Ref |
---|---|---|---|---|---|
2006 | ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డు | బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ | సాసు ఘరా చలి జిబీ | విజేత | |
2018 | జాతీయ చలనచిత్ర అవార్డు | స్పెషల్ మెన్సన్ | హలో ఆర్సీ | విజేత | [5] |
2019 | ఒడిషా మ్యూజిక్ అవార్డ్స్ | ఒడియా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ | విజేత | [6] |
మూలాలు
మార్చు- ↑ "Ollywood Actress Prakruti Mishra Receives National Film Award for 'Hello Arsi'". Latest Odisha News, Breaking News Today | Top Updates on Corona - OTV News (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-05-03. Retrieved 2021-02-01.
- ↑ "A Lesson in Acceptance". The New Indian Express. 16 December 2013. Archived from the original on 2013-12-24. Retrieved 2013-12-21.
- ↑ "A Lesson in Acceptance". The New Indian Express. 16 December 2013. Archived from the original on 2013-12-24. Retrieved 2013-12-21.
- ↑ "'There is nothing that girls can't do': Prakruti Mishra - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-23.
- ↑ "Odia film Hello Arsi wins big at 65th National Film Awards - Times of India". The Times of India. Sandip Bal. Retrieved 20 September 2018.
- ↑ "@prakrutimishra on Instagram: "Won the Odia Sensation of the Year at Odisha Music Awards 2019."". Instagram (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2021.