ప్రజా శక్తి (సినిమా)

(ప్రజా శక్తి నుండి దారిమార్పు చెందింది)

ప్రజాశక్తి 1983 మార్చి 18న విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను మాదాల రంగారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. మాదాల రంగారావు, కె.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ప్రజా శక్తి
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం మాదాల రంగారావు
తారాగణం మాదాల రంగారావు,
కె.విజయ
నిర్మాణ సంస్థ నవతరం పిక్చర్స్
భాష తెలుగు

ఇతివృత్తం నిరుపేద రైతు కూలీలకు సంబంధించినది. దేవుడు మామయ్య ఆ ఊరికి పెత్తందారీ. ఆ ఊరి దేవాలయం ధర్మకర్త. ఆ ఆలయానికున్న వెయ్యి ఎకరాల పొలాన్ని ఏళ్ళ తరబడిగా అనుభవిస్తుంటాడు. రైతు కూలీలను అజ్ఞానాంధకారంలో బంధించి వారి శ్రమను దోచుకుంటూంటాడు. ఆ ఊళ్ళో చదువుకున్న ఒకే ఒక యువకుడిని (మాదాల రంగారావు) పిచ్చివాడుగా ముద్రవేసి తన పబ్బం గడుపుకుంటాడు. ఐతే ఆ యువకుడికి ప్రజావైద్య శాలను తెరచిన ఒక డాక్టరు, ఆ ఊరికి బదిలీపై వచ్చిన గ్రామసేవిక తోడై రైతు కూలీల కళ్ళు తెరిపించడం.. అన్యాయాలకు, అక్రమాలకు భరతం పట్టించడం తక్కిన కథా సారాంశం.

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. అంబ రావే జగదంబ రావే అంబ రావే - ఎస్.పి. బాలు
  2. దేవుడంట దేవుడంట దేవుడంటరో వాడున్న - ఎస్.పి. బాలు
  3. పిలిచింది నేలతల్లి చల్లని కన్నతల్లి - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
  4. ప్రజాశక్తి ప్రజాశక్తి ప్రజాశక్తి కదిలింది దగాపడిన - ఎస్.పి. బాలు బృందం
  5. మారిపోతుందోయి కాలం మారిపోతుంది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
  6. మాలన్న మాదిగన్న కుమ్మరన్న కమ్మరన్న - ఎస్.పి. బాలు

మూలాలు

మార్చు
  1. "Praja Shakthi (1983)". Indiancine.ma. Retrieved 2021-05-31.