ప్రధాన మెనూను తెరువు

ప్రణవ్ ధనవాడే ముంబైకి చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అతడు తన అత్యద్భుత ఇన్నింగ్స్‌తో ప్రణవ్‌ ధనవాడే ప్రపంచ క్రికెట్‌లో అన్ని విభాగాల్లో ఉన్న బ్యాటింగ్‌ రికార్డులన్నింటినీ తిరగరాశాడు. 1899లో ఆర్థర్‌ కొలిన్స్‌ చేసిన 628 పరుగులే క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. ప్రణవ్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌తో 116 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.[1] [2] [3]

ప్రణవ్ ధనవాడే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ప్రణవ్ ధనవాడే
జననం ముంబై, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడి-చేతి
పాత్ర భ్యాట్స్‌మన్
సంబంధాలు ప్రశాంత్ ధనవాడే (తండ్రి)
Source: [{{{source}}}], {{{date}}} {{{year}}}

జీవిత విశేషాలుసవరించు

ఆయన తండ్రి ప్రశాంత్ ముంబాయి వీధుల్లో ఆటోరిక్షా నడుపుతాడు[4]. రోజువారి వచ్చే ఆదాయంతోనే కుటుంబం సాగుతోంది. ఫ్రణవ్‌కు క్రికెట్‌పై ఆసక్తి ఉండటంతో కష్టమైనా కుటుంబసభ్యులు ప్రోత్సహించారు. [5]

ప్రపంచ రికార్డుసవరించు

ప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. అతను 395 నిమిషాలు ఆడాడు. అతని పరుగుల్లో 129 ఫోర్లు, 59 సిక్స్‌లు ఉన్నాయి. ఇంటర్ స్కూల్ అండర్ 16 మ్యాచ్ సందర్భంగా ఇతను రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా 1000 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ను ఎక్కడా చేయలేదు. ప్రణవ్ ధనవడే చేశాడు. ప్రణవ్ ధనవాడే రన్ రేట్ 312.38గా ఉంది.

ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధన్ వాడే మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేశాడు. ముంబై క్రికెట్ సంఘం ఇంటర్ స్కూల్ టోర్నీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో కేసీ గాంధీ స్కూల్ పోటీ పడుతోంది. ప్రణవ్ కేసీ గాంధీ స్కూల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు[6]. మంగళవారం లంచ్ సమయానికి ప్రణవ్ 921 పరుగులతో క్రీజులో ఉన్నాడు. లంచ్ సమయానికి ప్రణవ్ టీమ్ 1337 పరుగులు సాధించింది. మధ్యలో కొత్త బ్యాట్ తీసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం కేవలం 199 బంతుల్లో ధన్ వాడే 652 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

1899 లో ఏఈజే కొలిన్స్ 628 పరుగుల పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ప్రణవ్ 116 సంవత్సరాల తర్వాత బద్దలు కొట్టాడు[4][6]. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.[7]

జట్టు స్కోర్ లో కూడా ప్రపంచ రికార్డ్సవరించు

ప్రణవ్ దెబ్బతో తన స్కూల్ జట్టు స్కోర్ కూడా 1,465 పరుగులతో ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 1926లో జరిగిన యన్.యస్.డబ్ల్యూ vs విక్టోరియా మధ్య మ్యాచ్‌లో 1,107 పరుగుల రికార్డ్‌ను అధిగమించింది. దీంతో 90 ఏండ్ల జట్టు స్కోర్ ప్రపంచ రికార్డ్ కూడా బ్రద్ధలైనట్లయ్యింది.[8]

మూలాలుసవరించు

  1. 1009 రన్స్ ప్రణవ్ స్పందన, గతంలో వీరి పేరిట రికార్డ్‌లు
  2. 15-year-old Mumbai cricketer Pranav Dhanawade scores a record 1009, TNN | Jan 5, 2016, 01.22 PM IST, The Times of India|The Economic Times
  3. "Bhandari Cup, KC Gandhi English School v Arya Gurukul (CBSE) at Mumbai, Jan 4–5, 2016 – Scorecard". Cricinfo. 5 January 2016. Retrieved 5 January 2016. Cite web requires |website= (help)
  4. 4.0 4.1 "Pranav Dhanawade, Indian schoolboy, scores record 1,009 runs in one innings". The Guardian. 5 January 2016. Retrieved 5 January 2016.
  5. ప్రణవ్‌ ధనాధన్‌, ప్రజాశక్తి, January 5, 2016
  6. 6.0 6.1 "15-year-old Mumbai cricketer Pranav Dhanawade scores a record 1009". Times of India. 5 January 2016. Retrieved 5 January 2016.
  7. ఒకే ఇన్నింగ్స్ లో 1000 రన్స్.. 13:44 - January 5, 2016, 10Tv news
  8. ప్రపంచ క్రికెట్ మొనగాడు @1000 january 5th, 2016 at 8:15 am ,24x7telugu.com

ఇతర లింకులుసవరించు