ప్రణిత తాలూక్దార్

ప్రణీతా తాలూక్దార్ భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ఉపాధ్యాయురాలు, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె సోర్భోగ్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా అస్సాం శాసనసభ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికైనది.

ప్రణిత తాలూక్దార్
అస్సాం శాసనసభ
In office
1967–1978
అంతకు ముందు వారుఅక్షయ్ కుమార్ దాస్
తరువాత వారుహేమెన్ దాస్
నియోజకవర్గంసోర్భోగ్
వ్యక్తిగత వివరాలు
జననం1935[1]
మరణం20 ఏప్రిల్ 2019 (వయస్సు 83-84)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

జీవిత చరిత్ర

మార్చు

తాలూక్దార్ 1935లో జన్మించింది. ఆమె భర్త ఘనేశ్యామ్ తాలుక్దార్ అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఆమె బార్నగర్ కళాశాలను స్థాపించింది. [1]

తాలూక్దార్ సొరాలీ హయ్యర్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, బార్నగర్ కళాశాల, బార్పేట సొరాలీ కళాశాలకు అధ్యాపకురాలు. [1]

తాలూక్దార్ 1967 లో సోర్భోగ్ నుండి అస్సాం శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనది. [2] ఆమె 1972 లో సోర్భోగ్ నుండి తిరిగి ఎన్నికైనది. [3]

అవార్డులు

మార్చు

తాలూక్దార్ కూడా మహిళల కోసం పనిచేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా ఉన్నది. [1] మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషికి 2013లో స్త్రీ శక్తి పురస్కారం అందుకుంది. [4] [5] [6]

తాలుక్దార్ 20 ఏప్రిల్ 2019న మరణించింది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "সৰভোগৰ প্রাক্তন বিধায়িকা প্ৰণীতা তালুকদাৰৰ দেহাৱসান". NE Now (in అస్సామీస్). 21 April 2019. Retrieved 31 October 2019.
  2. "Assam Legislative Assembly - MLA 1967-72". Assam Legislative Assembly. Retrieved 31 October 2019.
  3. "Assam Legislative Assembly - MLA 1972-78". Assam Legislative Assembly. Retrieved 31 October 2019.
  4. "Pranab Mukherjee bestows Rani Laxmi Bai award on Delhi gangrape victim". The Indian Express. 8 March 2013. Retrieved 31 October 2019.
  5. "Rani Lakshmibai award for Delhi braveheart". The Hindu. 8 March 2013. Retrieved 31 October 2019.
  6. "President gives Stree Shakti awards on International Women's Day". News18. 9 March 2013. Retrieved 31 October 2019.