ప్రతాపరుద్రీయం
ప్రతాపరుద్రీయం అనేది ఓరుగల్లు ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక, యధార్థ సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్పతెలుగు నాటకం. దీనిని వేదం వేంకటరాయశాస్త్రి వ్రాశాడు. దీని సంగ్రహ రూపాన్ని ప్రతాపరుద్రీయ నాటకము (రంగప్రతి) గా వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు వారు 1992 సంవత్సరంలో ముద్రించారు.
పాత్రలు
మార్చు- ప్రతాపరుద్రుడు
- యుగంధరుడు
- జనార్ధనుడు
- చెకుముకిశాస్త్రి
- విశ్వాసరావు
- బేతాళరావు
- పేరయ్య
- పెద్దసెట్టి
- ఢిల్లీ సుల్తాను
- వలీఖాను
- ఖుస్రూఖాను
- ముస్తఫాఖాను
- ఫిరోజ్‌ఖాను
- ధర్మసింగు - యుగంధరుని దౌవారికుడు
సంక్షిప్త కథ
మార్చు1297 లో కాకతీయ ప్రభువు, ప్రతాపరుద్రుని మంత్రి యుగంధరుడు. ఇతడు మహామేధావి, గొప్ప రాజభక్తి కలవాడు. ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్, సేనాధిపతి వలీఖాన్. అతడు ఒకనాడు ఓరుగల్లు వచ్చి, తమ సుల్తానుకు కాబూల్ సుల్తానుకు మధ్య యుద్ధం జరగబోతోందనీ, దానికి ప్రతాపరుద్రుని సహాయం అర్థించడానికి వచ్చామనీ చెబుతాడు. కాని అతడు ప్రతాపరుద్రున్ని ఎలాగైనా కుట్రతో నిర్భంధించి, ఢిల్లీకి పట్టుకుపోవాలనే పన్నాగంతో వస్తాడు. అప్పుడు మంత్రులు, రాజు నగరంలో లేడని, ఒక వారంలో వస్తాడని చెబుతారు. ఇంతలో వలీఖాన్ తన రహస్య అనుచరులతో, వేటకు వెళ్ళిన ప్రతాపరుద్రుని బంధించి, ఢిల్లీ సుల్తాన్ వద్దకు తీసుకొనిపోతాడు. విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకొన్న మంత్రి యుగంధరుడు, పేరిగాడనే వానికి మారువేషం వేయించి, ప్రతాపరుద్రుని స్థానంలో, ఢిల్లీ సుల్తాన్ రాజదర్బారులో ప్రవేశపెట్టి, వలీఖాన్ ఆట కట్టించి, ఢిల్లీ సుల్తాన్ ద్వారా అతనికి శిక్ష వేయించి, నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. అలా తన అచంచలమైన రాజభక్తిని చాటుకొంటాడు మంత్రి యుగంధరుడు.
మూలాలు
మార్చు- ఆకాశవాణి, రేడియో నాటిక "ప్రతాపరుద్రీయం"
- సంగ్రహ ప్రతాపరుద్రీయ నాటకము (రంగప్రతి), వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్, మదరాసు, 1992.