ప్రతాప్ చంద్ర సారంగి

[1]

ప్రతాప్ చంద్ర సారంగి
ప్రతాప్ చంద్ర సారంగి

ప్రతాప్ చంద్ర సారంగి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
ముందు రబీంద్ర కుమార్ జేన
నియోజకవర్గం బాలాసోర్

వ్యక్తిగత వివరాలు

జననం 1955
ఒరిస్సా నీలగిర్
రాజకీయ పార్టీ బీజేపీ
నివాసం నీలగిర్
మతం హిందు

జననం మార్చు

ప్రతాప్ చంద్ర సారంగి.1955 జనవరి 4 ఒడిషాలోని బాలాసోర్ జిల్లా గోపీనాథ్ పూర్ లో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

ఒడిశా మోదీ అని పిలుచుకునే ప్రతాప్ చంద్ర సారంగి ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు.కుర్తాపైజామాలో గుబురు గడ్డంతో ఓ చిన్న ఇంట్లో ఉంటాడు. సైకిల్ పైనే ఎక్కువగా తిరుగుతూ, బోరింగ్ పంప్ దగ్గర స్నానం చేస్తూ, సామాన్యుడిలా కనిపిస్తారు.పేదలకు,అనాథ పిల్లలకు సేవ చేస్తూ ఉంటాడు.చిన్నప్పటినుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.ఆయన పెళ్లి చేసుకోలేదు. మొదట్లో పశ్చిమ బెంగాల్ లోని రామకృష్ణ మఠం లో సన్యాసిగా చేరాలనుకున్నారు. కానీ ఒంటరైన తన తల్లిని చూసుకోవడం కోసం తల్లి దగ్గరే ఉంటూ సామాజిక కార్యక్రమాల వైపు దృష్టిమళ్లించారు. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ప్రతాప్ చంద్ర సారంగి అందరూ ఒడిశా మోడీ అని పిలుస్తుంటారు.[2][3]

విద్యార్హత మార్చు

ఉత్కళ యూనివర్శిటీ పరిధిలోని బాలాసోర్‌లోనే డిగ్రీ వరకూ చదివాడు.

రాజకీయ జీవితం మార్చు

ప్రతాప్ చంద్ర సారంగి సామాజిక కార్యకర్త అయిన సారంగి బీజేపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  • 2004 నుంచి 2009 వరకు నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు [4]
  • 2014 ఎన్నికల్లో బాలాసోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.[5]
  • 2019 ఎన్నికల్లో మళ్లీ బాలాసోర్ నుంచి పోటీ చేసి బిజు జనతా దళ్‌ అభ్యర్థి రబీంద్ర కుమార్‌ జేనపై 12,956 ఓట్ల తేడాతో గెలుపొందారు.[6]
  • 2019 లో,సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి అయ్యారు.[7]

మూలాలు మార్చు

  1. "Shri Pratap Chandra Sarangi Profile". Naveen Patnaik, Chief Minister of Odisha website. Archived from the original on 2012-11-18. Retrieved 2014-05-25.
  2. "'People are fed up with the BJD' - Hot seat: Pratap Chandra Sarangi; BJP leader". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-09-13. Retrieved 2020-04-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-13. Retrieved 2020-04-05.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-18. Retrieved 2019-07-02.
  5. "Balasore Lok Sabha election results 2019 Odisha: BJP's Pratap Sarangi defeats BJD's Rabindra Jena".
  6. "'No clash between Modi wave and my image': Pratap Sarangi". The Times of India. May 23, 2019. Retrieved 2019-05-23.
  7. "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 31 May 2019