ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ

ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Alternative Photography సాంప్రదాయ పద్ధతికి వ్యతిరేకంగా, లాభాపేక్షలేని ఒక రకమైన ఫోటోగ్రఫీ. ప్రస్తుతం ఉన్న ప్రక్రియలను (అనలాగ్ ఫోటోగ్రఫీ లో జిలెటిన్ సిల్వర్ ప్రక్రియ, డిజిటల్ ఫోటోగ్రఫీ లో ఉన్న వర్ణద్రవ్య ముద్రణా ప్రక్రియ) కాకుండా, చారిత్రక ప్రక్రియలను (100 సంవత్సరాల క్రితం అప్పటి తరం ఫోటోగ్రఫర్లు అవలంబించిన పద్ధతులను) అవలంబించటమే ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ.

ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ పద్ధతులుసవరించు

సయనోటైప్సవరించు

నలుపు, బూడిద రంగులను సయాన్ (నీలం) రంగులో ముద్రించే ఒక రకమైన ఛాయాచిత్రకళ. ప్రాథమికంగా బ్లూ ప్రింట్ లను ముద్రించటానికి కనుగొనబడింది. ఫోటోగ్రాం లను సృష్టించిన అన్నా అట్కిన్స్ వలన తర్వాత ఈ పద్ధతి ఫోటోగ్రఫీలో కూడా అవలంబించబడింది.

ద్విబహిర్గతంసవరించు

ఒకే ఫ్రేం లో ఒక ఛాయాచిత్రం కన్నా ఎక్కువ ఛాయాచిత్రాలను తీసినట్లయితే దానిని ద్విబహిర్గతం అంటారు. రెండు ఛాయాచిత్రాల కంటే ఎక్కువ తీయటం బహుళ బహిర్గంతం అంటారు.

ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫిసవరించు

సాధారణ కాంతిని నిరోధించి కేవలం ఇన్ఫ్రా రెడ్ కాంతిని మాత్రం కెమెరా లోపలికి పంపే ఒక ఫిల్టరును కెమెరాకు అమర్చి తీసే ఫోటోలను ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫి అంటారు.

సూదిబెజ్జం కెమెరాసవరించు

కటకం వాడకుండా, కేవలం ఒక సూదిబెజ్జం ద్వారా ఒక చీకటి పెట్టెలోకి కాంతిని ప్రవేశింపజేసి ఫోటోలను సృష్టిస్తారు. ఈ చీకటి పెట్టెయే సూదిబెజ్జం కెమెరా.

రెడ్ స్కేల్సవరించు

కలర్ ఫిలిం ను లోడ్ చేయవలసిన దిశలో కాకుండా వ్యతిరేక దిశలో కెమెరాలో లోడ్ చేయటం వలన కాంతి ప్రసరించే క్రమం నీలి-ఫిల్టరు-ఆకుపచ్చ-ఎరుపు పొరల క్రమం కాకుండా, వ్యతిరేకంగా ఎరుపు-ఆకుపచ్చ-ఫిల్టరు-నీలి దిశ లో ప్రసరించటం వలన ఛాయాచిత్రంలో ఎరుపు పాళ్ళు పెరిగాయి. మొదట ఇది పొరబాటున జరిగింది. కానీ ఆసక్తికరమైన ఫలితాలు రావటం వలన తర్వాతి కాలంలో ఫోటోగ్రఫర్లు కావాలని వ్యతిరేక దిశలో లోడ్ చేయటం ప్రారంభించారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు