పొట్లపహాడ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎భూమి వినియోగం: AWB తో జిల్లా లింకు సవరణ
పంక్తి 157:
=== ప్రధాన పంటలు ===
[[వరి]]
 
=== '''ఆధ్యాత్మిక క్షేత్రాలు''' ===
 
=== అచలాశ్రమం : ===
 
==== మన గ్రామంలో కొంతమంది ఆధ్యాత్మిక భావనతో శ్రీ సంకోజు రామచంద్రచార్యులు, షేక్ మస్తాన్ గురువులు 1977 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మన గ్రామం నుండి నారాయణ యశోదమ్మ, నూకల అప్పారెడ్డి, గుత్తికొండ దామోదర్రెడ్డి, గుత్తికొండ నర్సమ్మ, నారాయణ పుల్లారెడ్డి, గుత్తికొండ అమృతారెడ్డి, గుత్తికొండ సుశీలమ్మ, యగ్గడి చిన సత్యమయ్య, బంగారు లక్ష్మినర్సమ్మ, కట్ల గురువులు, కట్ల ఎల్లమ్మ తదితరులు కలిసి ఆశ్రమంలో శివరామ దీక్షితులు స్వామి వారికి ప్రతి రోజు ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శివరాత్రి రోజునప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ====
 
=== '''రామాలయం పునర్ నిర్మాణం:''' ===
'''మన గ్రామంలో రామాలయం పూర్వం నూకల అప్పారెడ్డి ఇంటి పక్కగల బేరం రాంరెడ్డి ఇంటి దగ్గర ఉండేది. తర్వాత కాలంలో దానిన ఎడవెల్లి లచ్చిరెడ్డి ఇంటి దగ్గరకు మార్చారు. కొత్త రామాలయాన్ని మన గ్రామ ప్రవాసులు, దాతలు, గ్రామ రైతుల సహకారంతో 2007 సంవత్సరంలో నారాయణ జానకిరాంరెడ్డి, నారాయణ భద్రారెడ్డి పాత ఇంటి అడుగు స్థలంలో నిర్మించారు. నూతన రామాలయ నిర్మాణానికి ఎడవెల్లి నిర్మల రవిందర్రెడ్డి, పోరెడ్డి హైమ చంద్రశేఖర్ రెడ్డి, వంగాల కవిత సురేందర్రెడ్డి, వంగాల జ్యోతి రవీందర్ రెడ్డి, మారుపాకల జ్యోతి రఘుమారెడ్డి, గ్రామంలోని ప్రతిరైతు ప్రతి కుటుంబం గడగడపకు విరాళాలు స్వీకరించారు. ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన నూతన రామాలయ నిర్మాణానికి రిటైర్డ్ టీచర్ నారాయణ సత్యనారాయణరెడ్డిగుత్తికొండ బిక్షంరెడ్డి ముందుండి తోడ్పాడునందించారు. అదే సంవత్సరం మన పూర్వీకులు చాలా కాలం క్రితం వేయించిన పాత బొడ్రాయిని తిరిగి వడ్ల పుల్లయ్య ఇంటి దగ్గర నూతన బొడ్రాయి ప్రతిష్ఠ కూడాజరిగింది. 2007 సంవత్సరంలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయం, ధ్వజస్థంభ ఆరోహణం, బొడ్రాయి కార్యక్రమాలు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుపుకొని గ్రామస్థులందరు తమ ఐక్యతను, భక్తిని చాటుకున్నారు. 2019 సంవత్సరంలో రామాలయానికి అందమైన రంగులతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ టీచర్ ఎదుళ్ అంజిరెడ్డి సారు చినకూతురు మారుపాకల జ్యోతి రఘుమారెడ్డి దంపతులు, మరియు గ్రామస్థులు కలిసి సుమారు ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.'''
 
=== '''గాంధీ విగ్రహ ఏర్పాటు:''' ===
'''మన గ్రామం మొదటి నుండి శాంతియుతంగా, ప్రశాంతంగా అన్ని మతాలవారు కులాలవారు కలిసికట్టుగా ఐక్యంగా వుంటారు. అందరూ సమిష్ఠిగా గ్రామాభివృద్ధికి పాటుపడుతుంటారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని అహింసావాది, శాంతి స్వరూపుడు జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం ఉండాలని భావించి బాపుజీ సేవా సంఘం పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి యగ్గడి శ్రీనివాస్, మేకపోతుల సైదులు యల్.ఐ.సి., రామినేని ఆనంద్, అనుమోజు శ్రీనివాసచారి, యడవెల్లి సంజీవరెడ్డి, యడవెల్లి ప్రభాకర్ రెడ్డి, యడవెల్లి లక్ష్మారెడ్డి, మేకపోతుల లింగయ్య, మేకపోతులు శంకర్, యగ్గడి సంపత్, రామినేని కిరణ్, రామినేని అరవింద్, దాచేపల్లి నాగయ్య, అప్పటి సర్పంచ్ మేకపోతుల పిచ్చయ్య,మేకపోతుల సీతారాములు, సుదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గ్రామస్థుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకోనైనది'''.
 
=== గంగమ్మ గుడి: ===
'''మన గ్రామానికి చెందిన యాదవ కులస్థులు తమ ఆరాధ్యదైవం గంగమ్మ దేవతకు గుడి నిర్మించారు. దీనిని 2019 జూన్ నెలలో గ్రామలోని సర్పంచ్, యం.పి.టి.సి. ఉద్యోగులు, గ్రామ పెద్దలు, యాదవ కులస్థుల ఆర్ధిక సహకారంతో ప్రతిష్ఠ చేశారు. జూన్ 18, 19, 20, 2019లో గంగమ్మ గుడి ప్రారంభ వేడుకలు ఎంతో కనులపండువగా గ్రామస్థులందరూ జరుపుకున్నారు.'''
 
=== '''మసీద్ :''' ===
'''మన గ్రామం ఏర్పడిన నాటినుంచి ముస్లింలు ఎలాంటి అరమరికలు లేకుండా గ్రామస్థులతో సామరస్యంగా మెలుగుతారు. అన్ని హిందు పండుగల్లో తమవంతు సహకారాన్ని అందిస్తూ వుంటారు.వీరంతా తమ ప్రార్థనలు ఇంట్లోనే చేసుకునేవారు. గ్రామ ముస్లింలంతా కలిసి తమ ఉమ్మడి ప్రార్థనలకోసం మసీదు నిర్మాణం చేసుకున్నారు ప్రతిరోజు అక్కడ నమాజ్ చేసుకుంటూ అల్లాని స్మరిస్తారు. రంజాన్, బక్రీద్, మొహర్రంలాంటి తమ పండుగ రోజుల్లో అందరూ కలిసి పవిత్రంగా జరుపుకుంటారు.'''
 
=== '''చర్చి:''' ===
'''మన గ్రామ ప్రజలు మొదటినుంచీ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తారు. ఎవరి మత భావనలు వారు కలిగివుంటారు. మన గ్రామంలో వున్న కొందరు క్రిస్టియన్లు తమ ప్రార్థనల కోసం చర్చిని నిర్మించుకున్నారు. ప్రతి ఆదివారం ప్రభువైన యేసు ప్రార్థనలు నిర్వహిస్తారు. వారి పండుగలైన క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలను'''
 
'''ఆనందోత్సాలతో జరుపుకుంటారు.'''
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొట్లపహాడ్" నుండి వెలికితీశారు