మౌలానా హస్రత్ మోహాని: కూర్పుల మధ్య తేడాలు

చి Hasrat_Mohani.gifను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Alan. కారణం: (Media without a license as of 18 August 2013 (+7 days) - Using [[commons:MediaWiki:VisualFileChange.js|V...
పంక్తి 2:
'''మోలానా హస్రత్ మోహాని''' ([[ఉర్దూ]]: '''مولانا حسرت موہانی''') (జననం [[1875]] - మరణం [[1951]]) ఒక శృంగారరసభరితమైన కవి. ఇతను [[ఉర్దూ]] భాషాకవి, జర్నలిస్టు, రాజకీయవేత్త, పార్లమెంటేరియన్ మరియు నిర్భయ స్వాతంత్రసమరయోధుడు. ఇతని అసలు పేరు సయ్యద్ ఫజలుల్ హసన్. ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ జిల్లాలోని 'మోహాన్' పట్టణంలో 1875లో జన్మించాడు.
 
ఇతడు ఒక చురుకైన విద్యార్థి, అన్ని పరీక్షలలో రాష్ట్రస్థాయిలో ఉన్నతుడు. తరువాత [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటి|అలీఘర్]] లో చదివాడు. ఇతడు [[మోలానా ముహమ్మద్ అలీ జౌహర్]], [[షౌకత్ అలీ జౌహర్]] ల మిత్రుడు. ఇతని రచనలు 'కులియాత్-ఎ-హస్రత్ మోహాని', 'షర్హ్-ఎ-కలామ్-ఎ-గాలిబ్', 'నుకాత్-ఎ-సుఖన్', 'ముషాహిదాత్-ఎ-జిందాన్' మొదలగునవి. [[గజల్]] గాయకుడు [[గులాం అలీ]] పాడిన '[[చుప్కే చుప్కే రాత్ దిన్|చుప్ కే చుప్ కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై]]' ఇతని రచనే.
 
ఇతడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిర్భయంగా పోరాడిన వీరుడు. ఆజాదియె-కామిల్ (సంపూర్ణ స్వరాజ్యం) కావాలంటూ 1921 లో డిమాండ్ చేసిన మొదటివ్యక్తి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ను అధ్యక్షత వహించాడు. కమ్యూనిజంపట్ల అభిమానమున్నవాడునూ. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతని స్ఫురద్రూపాన్ని చూచి ఇతన్ని భారతరాజ్యాంగనిర్మాణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈకమిటీ సిఫారసులను చూసి నొచ్చుకొని నచ్చక సంతకం చేయలేదు. ఇతని సమకాలీన ఉర్దూ కవులు [[జోష్ మలీహాబాది]], [[నాసిర్ కాజ్మి]], [[జిగర్ మొరాదాబాది]] మరియు [[అస్గర్ గోండవి]].