"చతుష్షష్టి కళలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
*వివరణ సహిత 64 కళలు
1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది), 2. వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ), 3. నృత్యము (భావాభినయము), 4. అలేఖ్యము (చిత్రలేఖనము), 5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన), 6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు), 7. పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట), 8. దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట), 9. మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట), 10. శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట), 11. ఉదక వాద్యము (జలతరంగిణి), 12. ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట), 13. చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట), 14. మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట), 15. శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట), 16. నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు), 17. కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట), 18. గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసెడి నేర్పు ), 19. భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ), 20. ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట), 21. కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు), 22. హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట), 23. విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట), 24. పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట), 25. సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట), 26. సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట), 27. వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు), 28. ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట), 29. ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట), 30. దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట), 31. పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు), 32. నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ), 33. కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట), 34. పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట), 35. తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట), 36. తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు), 37. వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ), 38. రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట), 39. ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట), 40. మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట), 41. వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము), 42. మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట), 43. శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట), 44. ఉత్సాదన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములొత్తుట, తలయంటుట వీనియందు నేర్పు), 45. అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట), 46. మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట), 47. దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట), 48. పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట), 49. నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట), 50. యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు), 51. ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము), 52. సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట), 53. మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ), 54. కావ్యక్రియ (కావ్యములను రచించుట), 55. అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము), 56. క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము), 57. ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట), 58. ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు), 59. ద్యూతవిశేషములు (జూదమునందలి విశేషములను తెలిసికొని యుండుట), 60. ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు), 61. బాలక్రీడనకములు (పిల్లల ఆటలు), 62. వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము), 63. వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట), 64. వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము). [వా.కా.సూ. 1-3-16.]
 
*1. హావభావాది సంయుక్తమైన నృత్యము, 2. నానావిధ వాద్యముల నిర్మాణమందును, వాదనమందును నేర్పరితనము, 3. స్త్రీపురుషులకు వస్త్రాలంకార యోజనమును గావించుట, 4. దారుశిలాదులచే వివిధాకృతులను నిర్మించుట, 5. శయ్యాస్తరణ యోగము-పుష్పగ్రథనము, 6. ద్యూతాద్యనేక క్రీడలచే జనుల నానందింపజేయుట, 7. వివిధాసనములు తోడి రతిజ్ఞానము [ఈ యేడు కళలు గాంధర్వవేదమున చెప్పబడినట్టివి], 8. మకరందాసవము- మద్యము మున్నగువానిని సిద్ధము చేయునేర్పు, 9. బాణములంగములందు గాడినచో వానిని తీసి నరములందేర్పడు వ్రణములను వ్యథ లేకుండ బాగుచేయుటలో నేర్పు, 10. హింగ్వాధి రససంయోగముచే అన్నాదులను వండుట, 11. వృక్షములకు పుష్పము గలుగజేయుట, మొక్కలు వేయుట, వానిని పోషించుట-వీనియందలి నేర్పు, 12. పాషాణములు, ధాతువులు వీనిని భస్మముగావించు నేర్పు, 13. చెఱకుపానకముచే ననేక ప్రకారములుగ పంచదార మొదలగు వానిని చేయుట, 14. స్వర్ణాది ధాతువులను, ఓషధులను మిశ్రణము చేయునేర్పు, 15. మిశ్రితములగు ధాతువులను వేఱు చేయు నేర్పు, 16. ధాత్వాదుల యన్యోన్యసంయోగము కంటె పూర్వమందగు ధాత్వాది జ్ఞానము, 17. క్షారముల నితరములనుండి వేఱు చేయు నేర్పు [ఈ పదియు నాయుర్వేదమున చెప్పబడిన కళలు], 18. శస్త్రసంధానము, శస్త్ర విక్షేపము, ఆలీఢాది పదన్యాసము-వీని నెఱుగుట, 19. శరీరసంధులయందు పొడచుట, ఆకర్షించుట మొదలగువానిచేనగు మల్లయుద్ధము, 20. అభిలక్షిత దేశమున యంత్రాద్యస్త్రములను ప్రయోగించుట, 21. వాద్య సంకేతమున వ్యూహాది రచన, 22. గజాశ్వరథగతులతో యుద్ధమొనర్చుట [ఈ యైదు ధనుర్వేదమున చెప్పబడిన కళలు], 23. నానావిధములగు నాసన ముద్రాదులచే దేవతలను సంతోషపరచుట, 24. సారథ్యము-గజాశ్వాది గమన శిక్షణము, 25. మన్ను, కఱ్ఱ, ఱాయి, స్వర్ణాది ధాతువులు-వీనిచే కుండలు మొదలగు వానిని చేయుట [ఇవి వేర్వేఱ నాలుగు కళలు], 29. చిత్రాదులను లిఖించుట, 30. చెఱువు, బావి, మేడ, సమభూమి-వీనిని నిర్మించుట, 31. గడియారము మొదలగు యంత్రములను, వీణా మృదంగాది వాద్యములను చేయు నేర్పు, 32. సూక్ష్మ, మధ్యమ, గాఢములగు వర్ణ సంయోగములచే వస్త్రముల నద్దుట, 33. అగ్ని, జలము, వాయువు-వీని సంయోగ నిరోధాదుల చేయు క్రియ, 34. ఓడలు, రథములు మొదలగు యానములను చేయుట, 35. సూత్రములను, రజ్జువులను చేయుట, 36. వస్త్రములు నేయుట, 37. రత్నములకు రంధ్రములు వేయుట, వాని సదసద్‌జ్ఞానము, 38. స్వర్ణాదుల యథార్థ స్వరూపము నెఱుగుట, 39. కృత్రిమ స్వర్ణ రత్నాదులను చేయుజ్ఞానము, 40. స్వర్ణాదులచే నలంకారములను చేయుట-లేపాది సత్కారము, 41. చర్మములను మృదువుగా చేయు నేర్పు, 42. పశువుల శరీములనుండి చర్మమును తీయు నేర్పు, 43. పాలు పితుకుట మొదలుకొని నేయి కాచుట వఱకు గల వివిధ ప్రక్రియల నెఱుగుట, 44. అంగీలు (కంచుకములు) మొదలగు వానిని కుట్టుటయందు నేర్పు, 45. నీటిలో ఈదుట, 46. ఇంటియందు వాడుకొను పాత్రలను శుద్ధి చేయు నేర్పు, 47. వస్త్రములను శుభ్రపరచు నేర్పు, 48. క్షురకర్మ, 49. నువ్వులు మొదలగువానినుండి నూనె తీయుట, 50. దున్నుట మొదలగు వానిని గూర్చిన జ్ఞానము, 51. వృక్షాద్యారోహణ జ్ఞానము, 52. చిత్తానుకూలముగ పరిచర్య చేయునేర్పు, 53. గడ్డి, వెదుళ్ళు వీనిచే పాత్రములను చేయుట, 54. కాచపాత్రాదులను చేయు నేర్పు, 55. నీరు కట్టుట యందును, తీయుటయందును నేర్పు, 56. లోహాదులచే శస్త్రాస్త్రములను చేయు నేర్పు, 57. ఏనుగులు, గుఱ్ఱములు, ఎద్దులు, ఒంటెలు వీనిపై వేయు జీనును కుట్టు నేర్పు, 58. శిశువులను సంరక్షించు నేర్పు, 59. శిశువుల నెత్తికొని యాడించు నేర్పు, 60. అపరాధిని యథాపరాధముగ దండించు నేర్పు, 61. నానాదేశముల వర్ణములను చక్కగా వ్రాయు నేర్పు, 62. తాంబూలపు పట్టీలను కట్టు నేర్పు, 63. ఆదానము (ఆశుకారిత్వము), 64. ప్రతిదానము (చిరక్రియ). [శుక్రనీతిసారము 4-3-67]
 
* 1. ఇతిహాసాగమాదులు, 2. కావ్యాలంకార నాటకములు, 3. గాయకత్వము, 4. కవిత్వము, 5. కామశాస్త్రము, 6. ద్యూతము, 7. దేశభాషలు, 8. లిపిజ్ఞానము, 9. లిపికర్మ, 10. వాచనము, 11. సర్వపూర్వ వృత్తాంతములు, 12. స్వరశాస్త్రము, 13. శకునశాస్త్రము, 14. సాముద్రికము, 15. రత్నశాస్త్రము, 16. రథగతి కౌశలము, 17. అశ్వగతి కౌశలము, 18. మల్లశాస్త్రము, 19. సూదకర్మ, 20. వృక్షదోహదము, 21. గంధవాదము, 22. ధాతువాదము, 23. ఖన్యావాదము, 24. రసవాదము, 25. జాలవాదము, 26. అగ్నిసంస్తంభము, 27. ఖడ్గస్తంభము, 28. జలస్తంభము, 29. వాక్‌స్తంభము, 30. వయస్తృంభము, 31. వశ్యము, 32. ఆకర్షణము, 33. విద్వేషణము, 34. ఉచ్చాటనము, 35. మారణము, 36. కాలవంచనము, 37. జలప్లవన చాతుర్యము, 38. పాదుకాసిద్ధి, 39. మృత్సిద్ధి, 40. ఘటికాసిద్ధి, 41. ఐంద్రజాలికము, 42. అంజనము, 43. నరదృష్టివంచనము, 44. స్వరవంచనము, 45. మణిసిద్ధి, 46. మంత్రసిద్ధి, 47. ఔషధసిద్ధి, 48. చోరకర్మ, 49. ప్రేతక్రియ, 50. లోహక్రియ, 51. అశ్మక్రియ, 52. మృత్క్రియ, 53. దారుక్రియ, 54. వేణుక్రియ, 55. వర్మక్రియ, 56. అంజనక్రియ, 57. అదృశ్యకరణి, 58. దూరకరణి, 59. మృగయారతి, 60. వాణిజ్యము, 61. పాశుపాల్యము, 62. కృషి, 63. ఆహవకర్మ, 64. లావకుక్కుటమేషాదియుద్ధకారణకౌశలము [ఇవి చంపూరామాయణ వ్యాఖ్యయగు రామచంద్ర బుధేంద్రవిరచిత 'సాహిత్య మంజూషిక' యందు పేర్కొనబడినవి] [చంపూరామాయణము 6-1]
 
* 1. గీతము, 2. వాదిత్రము, 3. నృత్తము, 4. నాట్యము, 5. చిత్రము, 6. పుస్తక కర్మ, 7. పత్రచ్ఛేద్యము, 8. లిపిజ్ఞానము, 9. వచనకౌశలము, 10. వైలక్షణ్యము, 11. మాల్యవిధి, 12. గంధయుక్తి, 13. ఆస్వాద్యవిధానము, 14. అనురంజన జ్ఞానము, 15. రత్నపరీక్ష, 16. సీవనము, 17. ఉపకరణ క్రియ, 18. ఆజీవ జ్ఞానము, 19. తిర్యగ్యోని చికిత్స, 20. మాయాకృతము, 21. పాషండ సమయ జ్ఞానము, 22. క్రీడాకౌశలము, 23. సంవాహనము, 24. శరీర సంస్కార కౌశలము, 25. ఆయప్రాప్తి, 26. రక్షావిధానము, 27. రూపసంఖ్య, 28. క్రియామార్గము, 29. జీవగ్రహణము, 30. నయజ్ఞానము, 31. చిత్రవిధి, 32. గూఢరాశి, 33. తులానిధి, 34. క్షిప్రగ్రహణము, 35. అనుప్రాప్తి, 36. లేఖ, 37. స్మృత్యనుక్రమము, 38. లీలావ్యాపార మోహనము (ఫలవ్యామోహమని పాఠాంతరము), 39. గ్రహణాదానము, 40. ఉపస్థానవిధి, 41. యుద్ధము, 42. తతము, 43. గతము, 44. స్త్రీపురుషభాష గ్రహణము, 45. స్వరాగప్రకాశనము, 46. ప్రత్యంగదానము, 47. నఖవిచారము, 48. దంతవిచారము, 49. నీవీస్రంసనము, 50. గుహ్యస్పర్శన లోమ్యము, 51. పరమార్థ కౌశలము, 52. భూషణము, 53. సమానార్థత, 54. ప్రోత్సాహనము, 55. మృదుక్రోధ ప్రవర్తనము, 56. క్రుద్ధ ప్రసాదనము, 57. సుప్తాపర్తిత్యాగము, 58. పరమస్వాప విధి, 59. గుహ్యగ్రహణము, 60. సాశ్రుపాతనము, 61. రమణవీక్షణము, 62. స్వయంశపథక్రియ, 63. ప్రస్థితానుగమనము, 64. పునర్నిరీక్షణము [ఇవి భోజరాజుచే చెప్పబడినట్లుగ రఘువంశ వ్యాఖ్యయగు సంజీవనిలో చెప్పబడినది] [రఘువంశము (వ్యా.) 8-67]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
2,16,549

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015773" నుండి వెలికితీశారు