బ్రహ్మపుత్రా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
== బ్రహ్మపుత్రపై చైనా జలవిద్యుత్‌ ప్రాజెక్టు ==
బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో ఓ భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రను [[టిబెట్‌]] లో [[త్సాంగ్‌పో]] నదిగా పిలుస్తారు. అక్కడ నామ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన జలవిద్యుత్‌ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 26 టర్బైన్లతో పనిచేసే ఈ ఆనకట్ట గంటకు 40 మిలియను కిలోవాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. 2009 మార్చి 16న దీనికి శంకుస్థాపన జరగగా మార్చి 16న పనులు ప్రారంభమయ్యాయి. చైనాలోని ఐదు పెద్ద విద్యుత్తు కంపెనీలు ఓ వ్యాపారకూటమిగా ఏర్పడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటిస్థానంలో ఉన్న [[త్రీ గోర్జెస్‌ డ్యాం]] కంటే పెద్దదవుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్‌, బంగ్లాదేశ్‌లకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలో 40 శాతం జలవిద్యుత్తు అవసరాన్ని, 30 శాతం నీటి వనరుల అవసరాలని ఈ నది తీరుస్తోంది. బంగ్లాదేశ్‌లో అయితే మంచినీటికి, సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చుతూ దీంతో తమకు సంబంధం లేదని అది పూర్తిగా ప్రైవేటు సంస్థల వ్యవహారమని పేర్కొంది. మరోవైపు ఆనకట్ట ఇంజనీర్లు మాత్రం ఇది పూర్తయితే భారత్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు చౌకగా విద్యుత్‌ సరఫరా చేయవచ్చని, బంగ్లాదేశ్‌కు వరదముప్పు తప్పుతుందని అంటున్నారు. (ఈనాడు16.10.2009)
==కాలుష్యము==
బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెంది కాలుష్యానికి కారణమవుతున్న మొక్క జలకుంభీ. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) కొత్తరకమైన వానపామును అభివృద్ధి చేశారు. దీనిని వారు జై గోపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది సున్నా నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని జీవిస్తుం దని శాస్త్రవేత్తలు తెలిపారు. జలకుంభీ మొక్కలతో పాటు నీటిలోని నాచును ఇవి ఆహారంగా స్వీకరిస్తుందని ఐవీఆర్ఐ ప్రొఫెస ర్ రణవీర్ సింగ్ తెలిపారు. బ్రహ్మపుత్ర తీరంలో ఈ జలకుంభీ మొక్కల బెడదను తొలగించేందుకు ఇటీవలే గుహవటి ఐఐటీ తో ఐవీఆర్ఐ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, వానపాముల అప్పగింత జరుగుతుందన్నారు. కాగా, జలకుంభీని ఆహారంగా స్వీకరించి ఈ వానపాము వెలువరిచే సేంద్రీ య ఎరువును టీ తోటల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందట. అంతేకాదు చక్కెర మిల్లులలో వెలువడే రసాయనిక వ్యర్థాలను కూడా ఈ వానపాము ఆహారంగా స్వీకరిస్తుందన్నారు. <ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2014-02-04/science/47004289_1_river-brahmaputra-earthworm-assam-valley|publisher=timesofindia |date= February 4, 2014 - 07:35 IST|accessdate=February 05, 2014}}</ref>
 
== నదీ ప్రయాణ సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మపుత్రా_నది" నుండి వెలికితీశారు