కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Kunti Gandhari Dhrtarashtra.jpg|thumb|గాంధారీ ధృతరాష్టులను అరణ్యానికి తీసుకువెళుతున్న కుంతి]]
 
[[కుంతీదేవి]] [[మహాభారతం]] లో పాండవుల తల్లి. [[పాండురాజు]] భార్య. కుంతీదేచి చిన్నతనంలో [[దుర్వాసుడు]] ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే [[కర్ణుడు]]<ref>{{citeweb|url=http://padyalavaidyudu.blogspot.in/2012/12/kunthidevi.html|title=కుంతిదేవి |publisher|http://padyalavaidyudu.blogspot.in/|date=accessdate=6-2-2014}}</ref>.
== కుంతి అంటే ==
కుంతి యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము లేక, ఈమెను పెంచుకున్నాడు. అందుచేత ఈమె కుంతి అయింది.
పంక్తి 18:
== '''ఇప్పుడేం చెయ్యాలి''' ==
కుంతీభాస్వంతుల సమాగమ ఫలము కర్ణుడు. శిశువు కలిగాడు, వాని చెవులకు పుట్టుకతోనే రత్న కుండలాలున్నాయి, శరీరమంతా వజ్ర కవచమయము, రెండవ సూర్యుని లాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి. మతి పోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైన జన్మిస్తాడా? నాకు జన్మించాడు. ఇది భాగ్యమనుకోవలెనా? పెండ్లి కాని కన్యను నేను, వీడు నా కొడుకని చెప్పుకోలేను. ఏమి చేయాలి? అని లోలోపల కుమిలిపోయింది. లోకోపవాదం భయం ఆమెను దావాగ్నిలా చుట్టు ముట్టింది. ఆమె మనసులోఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుని భద్రపరచి, అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకుపోయి, ఆ పెట్టెను అశ్వనది ప్రవాహములో వదిలింది. తానేమీ చేస్తున్నదో తనకే తెలియలేదు, పెట్టె వంక చూస్తూ నిలబడింది.
 
==ఉల్లేఖనలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
 
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు