Palagiri
Palagiri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Chavakiran 09:03, 23 జనవరి 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీరు దిద్దుబాటు పూర్తి చేసిన తర్వాత సరిచూసుకోవడానికి గాని పేజీ భద్రపరచడానికి గాని స్క్రోల్ చేయడం గాని క్లిక్ చేయడం గాని లేకుండానే ఆ పనులు చేయవచ్చు. దిద్దుబాటు అయిపోగానే "టాబ్ కీ" నొక్కి సారాంశం పెట్టెకు చేరొచ్చు. ఆ తర్వాత Alt+shift+p నొక్కితే సరిచూసుకోవచ్చు మరియు Alt+shift+s (కర్సర్ సారాంశం పెట్టెలో ఉన్నప్పుడు Enter) నొక్కి భద్రపరచవచ్చు. మీరు చేసిన మార్పులు చూసుకోవడానికి Alt+shift+v నొక్కితే సరిపోతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
నూనెలు
మార్చుమీ దగ్గరున్న నూనెలకు సంబంధించిన సమాచారాన్ని ఏ రకమైన సందేహాలు లేకుండా నూనెలు పేజీలో చేర్చండి. తప్పులుంటాయని భయపడవద్దు. వాటి లోని దోషాలను నేను సవరిస్తాను. సాంకేతిక సందేహాల్ని మరెవరైనా తీరుస్తారు.Rajasekhar1961 05:54, 29 జనవరి 2011 (UTC)
రాజ శేఖరు గారికి, మీ అముల్యమయిన సలహలకు Thanks.
- నూనెలకు సంబంధించిన పేజీలలో వాటి యొక్క ఉపయోగాలను ఒక ప్రత్యేకమైన విభాగంలో వ్రాస్తే బాగుంటుంది.Rajasekhar1961 14:59, 17 ఆగష్టు 2011 (UTC)[1]
దిగువమెట్ట
మార్చు- దిగువమెట్ట స్టేషన్ ఏ సెక్షన్ లో ఏ ఏ స్టేషన్ల మధ్యన ఉన్నది తెలియజేస్తే బాగుంటుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించిన ఈ విషయాన్ని ఎక్కడనుండి సేకరించారు.Rajasekhar1961 13:04, 29 జనవరి 2011 (UTC)
దిగువమెట్ట అనే స్టెషను ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలంలో వున్నది.ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం కర్నూలు జిల్లాలో వున్నది.గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రయిల్ మార్గంలో గిద్దలూరు కు 10కి.మీ.ల దూరం లో దిగువమెట్ట వున్నదిదిగువమెట్ట వద్దవుండి నల్లమల్ల అడవి మొదలుఅయ్యి గాజులదిన్నె వద్ద అడవి ముగుస్తుంది.అడవి వేడల్పు 40-45 కి.మీ.వున్నది.వర్షకాలం లో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును.ఎత్తుఅయ్యినకొండలు,లోయలతో బస్సు ప్రయాణం చెయ్యునప్పుడు అందమయిన అనుబూతి కల్గుతుంది.క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో'ఆకులో ఆకునెఇ' అనే పాటను ఆయన రయిలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పెర్కొడం జరిగింది.ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమాలో ఉపయోగించారు.
Invite to WikiConference India 2011
మార్చుHi Palagiri,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
మీ గురించిన వివరాలు
మార్చుమీ సభ్యుని పేజీ మీకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలియజేయండి. దీని వలన మీరు ఏ విధంగా వికీపీడియా కు సహాయపడగలరో మాకు అర్ధమౌతుంది.Rajasekhar1961 05:48, 16 ఆగష్టు 2011 (UTC)
- మీ అనుభవంతో మంచి విషయాలు తెలియజేస్తున్నారు. మీకు కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు తెలియక అలాగే వ్రాస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే తెలియజేయండి. నూనె లభించే వివిధ మొక్కలను గురించి వాటి నుండి నూనెను తయారుచేయు విధానాల్ని రచించి చాలామందికి ఉపయోగపడండి. ఉదా: వేరుశెనగ నుండి వేరుశెనగ నూనె, నువ్వులు నుండి నువ్వుల నూనె, ఆవాలు నుండి ఆవనూనె, కొబ్బరి నుండి కొబ్బరినూనె మొదలైనవి. మీ రచనలు పూర్తయిన తర్వాత ఈ సమాచారాన్ని ప్రింట్ గా పొంది ఉపయోగించుకోవచ్చును.
మీ ఫోటోను ఒకదాన్ని మీ పేజీలో చేర్చండి. మీ రచనలకు ధన్యవాదాలు.Rajasekhar1961 10:31, 16 ఆగష్టు 2011 (UTC)
బొమ్మలు
మార్చువ్యాసాలకు సంబంధించిన బొమ్మలు చేరుస్తున్నారు. వీటికి లైసెన్స్ వివరాలు అవసరం. లేకపోతే అవి తొలగింపబడే అవకాశం ఉన్నది. ఈ బొమ్మల వివరాలు తెలియజేస్తే సరైన లైసెన్స్ టాగ్ నేను తెలియజేస్తాను.Rajasekhar1961 10:33, 24 ఆగష్టు 2011 (UTC)
- మీరు చేర్చిన ఈ బొమ్మలు ఎక్కడ లభించారు. మీరే స్వంతంగా తీశారా. ఏ పుస్తకం నుండయినా కాపీ చేశారా. ఇంటర్నెట్ లో లభించాయా తెలియజేయండి. లైసెన్స్ టాగ్ నేను చేరుస్తారు.Rajasekhar1961 11:46, 24 ఆగష్టు 2011 (UTC)
- నెట్ లోనుండి డౌన్ లోడ్ చేసినవి వికీలోకి చేర్చవద్దు. మీ వద్ద ఏవైనా బొమ్మలుంటే ప్రయత్నించండి.Rajasekhar1961 11:59, 24 ఆగష్టు 2011 (UTC)
ఇప్పనూనె
మార్చుచెట్టుగింజలనూనె వర్గాన్ని అవసరాన్ని బట్టి నేను ఏర్పాటుచేస్తాను. దాని గురించి మీరు వర్రీ కావద్దు. సమాచారాన్ని మాత్రం ఒక పద్ధతిలో రాయండి. ఇప్పచెట్టు వ్యాసం ఇప్పటికే ఉన్నది. ఇప్పనూనె కు చెందిన సమాచారాన్ని మాత్రమే ఈ వ్యాసంలో రాయండి. వీటన్నింటికి ప్రధాన వ్యాసం నూనె అందులో అన్నింటికి కలిపి తర్వాత కలిపి ఒక పద్ధతి ప్రకారం వర్గీకరణ పరంగా చేర్చవచ్చును. మోటారు ఆయిల్ కూడా ఒక రకమైన నూనే కదా.Rajasekhar1961 10:28, 26 ఆగష్టు 2011 (UTC)
- ఇప్పచెట్టు వ్యాసాన్ని విస్తరించండి. ఇంక ఆలస్యమెందుకు. బొమ్మల సంగతి తర్వాత చూద్దాం.Rajasekhar1961 10:39, 26 ఆగష్టు 2011 (UTC)
- నూనె వ్యాసాన్ని వంట నూనెలు వ్యాసాన్ని వేరుచేశారు. వంట నూనెలు అన్నింటికి కలిపి గింజల నుండి నూనెను తరారుచేయు విధానాన్ని ఈ పేజీలో చేర్చండి.Rajasekhar1961 06:01, 27 ఆగష్టు 2011 (UTC)
- మీ సందేహం అర్ధం అయింది. ఈ ఆంగ్ల వికీ వ్యాసం చూడండి. http://en.wikipedia.org/wiki/Vegetable_oil ఇందులో వంట నూనెలు కాకుండా ఇతర రకాల మొక్కల నుండి ఉత్పత్తి చేసే నూనెలు మరియు కొవ్వులను వెజిటబుల్ నూనెలు అని వర్గీకరించి అందులో చేర్చండి. వంట నూనెలు కూడా అందులో ఒక భాగంగా ఉంటాయి. కొన్ని జంతువుల నుండి లభించే కొవ్వులను జంతువుల కొవ్వులు అనే వ్యాసంలో చేర్చవచ్చును.Rajasekhar1961 07:07, 27 ఆగష్టు 2011 (UTC)
పరిచయం
మార్చునమస్తే Palagiri గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి! శశి 07:56, 4 సెప్టెంబర్ 2011 (UTC)
సాల్ నూనె
మార్చుసాల్ కు మరొక పేరు గుగ్గిలం కలప చెట్టు. సరేనా. నిజమైతే సాల్ నూనెలోని కొంత సమాచారాన్ని ఈ చెట్టు పేజీకి తరలించవచ్చును.Rajasekhar1961 14:25, 6 సెప్టెంబర్ 2011 (UTC)
నూనె సంగ్రహం
మార్చునూనె తయారు చేయడం అంటే బాగుంటుందా లేదా నూనె సంగ్రహం అంటేనా. ఏది సరైనది. వివిధ విధానాలను వేరువేరుగానే తెలియజేయండి. బొమ్మలు ఉంటే చేర్చండి.Rajasekhar1961 06:05, 9 సెప్టెంబర్ 2011 (UTC)
కొవ్వు ఆమ్లాలు
మార్చుఒక్కొక్క కొవ్వు ఆమ్లానికి ఒక చిన్న వ్యాసం తయారుచేద్దామనుకుంటున్నాను. మీ వద్ద అధిక సమాచారం ఉంటే అందులో చేర్చవచ్చును. ఏమంటారు.Rajasekhar1961 09:01, 9 సెప్టెంబర్ 2011 (UTC) ఒక్కొక్క కొవ్వు ఆమ్లానికి వ్యాసాల రచన మొదలుపెట్టాను. దయచేసి మీవద్దనున్న సమాచారాన్ని అక్కడ కూడా చేర్చి వాటిని విస్తరించండి. వాటికి మీరు రచించిన నూనెల నుండి లింకులు ఇవ్వవచ్చును.Rajasekhar1961 05:14, 12 సెప్టెంబర్ 2011 (UTC)
వృక్షశాస్త్రం
మార్చువృక్షశాస్త్రము విభాగానికి మీలాంటి ఉన్నత అభిరుచి గల వ్యక్తి అవసరం ఉన్నది. మీకు తెలిసిన వారెవరైనా వికీపీడియా కు సహాయపడలరా ! నేను కొంత గ్రౌండ్ వర్క్ చేశాను. నేను వైద్యున్ని కానీ వృక్షశాస్త్రం అంటే ఇష్టం. మానవ, జంతు సమాజానికి మొక్కలే మూలాధారం. అందుకే వీటిని అభివృద్ధి చేయాలని ఆ చిరకాల ఆకాంక్ష. ఆ శాస్త్రంలో పట్టభద్రులలో ఎవరైనా వికీకి సహాయం చేయగలరేమో అనే ఆశతో మీకు రాస్తున్నాను. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారితో మాట్లాడి తన సహాయాని అభ్యర్ధించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 05:29, 12 సెప్టెంబర్ 2011 (UTC)
తవుడు-తవుడు నూనె
మార్చుతవుడు నూనెలో నుండి ధాన్యం నుండి తవుడు తయారయ్యే విధానాన్ని వేరొక తవుడు పేజీకి తరళిస్తున్నారు. రెండు పేజీలలో సరిచూచి విభజించండి.Rajasekhar1961 08:18, 23 సెప్టెంబర్ 2011 (UTC)
వరి బొమ్మ
మార్చు- వరి వ్యాసంలో మీరు అడిగిన బొమ్మను చేర్చాను. మిగిలిన వ్యాసాలలో దానిని ఉపయోగించి దానిలోని భాగాల్ని గుర్తించండి. ఆంగ్లం నుండి తర్జుమా చేస్తే సరిపోతుంది.Rajasekhar1961 09:24, 23 సెప్టెంబర్ 2011 (UTC)
వెబ్ ఛాట్
మార్చుమీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -అర్జున 09:54, 18 డిసెంబర్ 2011 (UTC)
స్వాగతం
మార్చుతెలుగు వికీపీడియాకు తిరిగి స్వాగతం. ఇంతకు ముందుకు వలెనే మరెన్నో మంచి వ్యాసాల్ని రచిస్తారని భావిస్తున్నాను. నా సహకారం పూర్తిగా ఉంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:41, 10 మార్చి 2012 (UTC)
- మీ సమస్య తొలగిపోయిందా. నూనెల వ్యాసాల తర్వాత మీ ఆలోచనా విధానం ఏమిటి. మీరు ప్రస్తుతం వేనిగుంరించి వ్యాసరచన చేద్దామనుకుంటున్నారు.Rajasekhar1961 (చర్చ) 05:56, 18 మార్చి 2012 (UTC)
నూనెలకు సంబంధించిన పుస్తకాలు
మార్చుమీ పరిచయం చదివిన తరువాత నాకొక ఆలోచన వచ్చింది. మీరిప్పటికే రాసిన వుచిత పుస్తకాలు, వీలైతే వికీసోర్స్ లేక వికీ బుక్స్ లో పెట్టటం గురించి ఆలోచించండి. ఇప్పటికే వికీలో రాస్తున్నట్లున్నారు. సమగ్రంగా అందచేయాలనుకుంటే అదొక మార్గము. --అర్జున (చర్చ) 12:13, 10 ఏప్రిల్ 2012 (UTC)
ఫార్ములా
మార్చుమీ సమస్య ఫార్ములాలను చేర్చడం. నేను ఆంగ్ల వికీ నుండి ఈ మూసను తీసుకున్నాను పనిచేసింది. దీనిని ఉపయోగించి ప్రయత్నించండి. అలాగే తెలుగులో వ్రాయాలనుకుంటున్న వ్యాసానికి చెందిన ఆంగ్ల వ్యాసాలలో మరికొన్ని మూసలు దొరకవచ్చును.
మీ సమస్య తీరకపోతే తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 06:07, 26 ఏప్రిల్ 2012 (UTC)
పతకం
మార్చుపాలగిరి గారికి, తెలుగు వికీ లో 500పైగా మార్పులతో మీ కృషి అభివందనీయం--అర్జున (చర్చ) 04:04, 4 మే 2012 (UTC) |
టైపింగ్ సమస్యలు
మార్చు- రామకృష్ణ రెడ్డి గారూ నాకూ దీని వలన ఇబ్బందే దీనొక్కదానికి మాత్రం నేను లేకిని వాడుతుంటాను. లింక్ ఉన్నది http://lekhini.org/ మీరూ వాడండి. (కాపీ పేస్ట్).విశ్వనాధ్ (చర్చ) 12:25, 9 మే 2012 (UTC)
- మీకు న తరువాత స రావాల్సి (అది మొట్టమొదటి అక్షరంగా ప్రారంభమయ్యే) టైపు చేయాలనుకున్న పదాన్ని ఇంగ్లీషు అక్షరాలు వాడి తెలపండి. దీనిని మరింత పరిశీలించవచ్చు. --అర్జున (చర్చ) 00:51, 10 మే 2012 (UTC)
మీ చర్చా వ్యాఖ్యలలో లింకు
మార్చుమీ చర్చా వ్యాఖ్యలలో మీ సంతకం లింకు లేకుండా వస్తున్నది. దానిని దయచేసి ఈ క్రింది విధంగా మార్చుకోండి.మీఅభిరుచుల విభాగానికి వెళ్లి సంతకం మాత్రమే (లింకు లేకుండా) అనే వరుసకు ముందు చెక్ బాక్స్ ని ఖాళీ చేసి భద్రపరచండి. మీకు స్పందించడానికి మీ చర్చా పేజీలకు వెళ్లడానికి సహాయంగా వుంటుంది.--అర్జున (చర్చ) 00:51, 10 మే 2012 (UTC)
మీ సమీకరణాల సమస్య
మార్చుమీ సమీకరణాల సమస్య గురించి వికీపీడియా:సహాయ కేంద్రం స్పందించాను. గమనించారా?--అర్జున (చర్చ) 00:51, 10 మే 2012 (UTC)
పరికరాలు
మార్చువ్యవసాయ వుత్పత్తుల పరీక్షలను బాగా తయారుచేస్తున్నారు. ధన్యవాదాలు. ఈ పరీక్షల కోసం ఉపయోగించే పరికరాలకు కూడా చిన్న వ్యాసాలు తయారుచేయాలని ఉన్నది. సహాయం చేయండి.Rajasekhar1961 (చర్చ) 10:57, 19 మే 2012 (UTC)
ఆవశ్యక నూనెలు
మార్చుమీరు తయారుచేస్తున్న ఆవశ్యక నూనెలు వ్యాసాన్ని మొదటి పేజీలో ఉంచాను. గమనించండి. తగిన మార్పులు చేసి మరింత మెరుగుపరచండి. ఆంగ్ల వికీపీడియాలో en:Essential oil వ్యాసం ఒకసారి చూసి తెలుగు వ్యాసాన్ని విస్తరించండి. కామంస్ లో చాలా తైలాల బొమ్మలు మరియు ఉత్పత్తి పరికరాల బొమ్మలు ఉన్నాయి. వానిలో కొన్ని మంచివాటిని మన వ్యాసంలో ఉపయోగించవచ్చును. Rajasekhar1961 (చర్చ) 09:55, 11 జూన్ 2012 (UTC)
స్వాగతం
మార్చుపాలగిరి గారు, స్వాగతం. తిరిగి వికీపీడియాలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఏమైనా సహాయం అవసరమైతే తెలియజేయండి. 9246376622. Rajasekhar1961 (చర్చ) 14:31, 23 ఆగష్టు 2012 (UTC)
బొమ్మలు కామన్స్ లో చేర్చటం
మార్చుప్రజోపయోగ పరిధి లైసెన్స్ (public domain or equivalent )బొమ్మలు కామన్స్ లో చేర్చితే అన్ని ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి. తెలుగు వికీలో చేర్చితే ఎలా వాడుతారో అలాగే వాడుకోవచ్చు--అర్జున (చర్చ) 03:09, 24 ఆగష్టు 2012 (UTC)
పిరదౌసి
మార్చుపిరదౌసి (కావ్య సమీక్ష) వ్యాసాన్ని మొదటి పేజీలో ఉంచాను. గమనించండి. ఈ పుస్తకం యొక్క ముఖచిత్రం మీ వద్ద ఉన్నచో స్కాన్ చేసి ఆ వ్యాసం పేజీలో చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 08:23, 3 సెప్టెంబర్ 2012 (UTC)
- Jashuva.jpg బొమ్మ పాతకూర్పును సరిచేశాను సి. చంద్ర కాంత రావు- చర్చ 17:56, 3 సెప్టెంబర్ 2012 (UTC)
ధన్యవాదాలు
మార్చుద్రావణం అంశంలోని సూక్ష్మ లోపాలు సరిదిద్దినందుకు ధన్యవాదాలు.(Kvr.lohith (చర్చ) 04:28, 30 నవంబర్ 2012 (UTC))
మూసల అతికింపు
మార్చురెడ్డి గారు, మీరు నూనెలకు సంబంధించిన అన్ని వ్యాసాలలో మొత్తం మూసకు చెందిన సమాచారాన్నే చేర్చారు. అలా చేర్చే అవసరం లేదండి. ఒక మూస తయారుచేసి ప్రతి వ్యాసంలో ఆ మూస పేరు మాత్రం అతికిస్తే సరిపోతుంది. మూసలో ఒక విషయం చేర్చాలంటే మళ్ళీ అన్ని వ్యాసాలలో మార్పు చేసే అవసరం కూడా ఉండదు. కేవలం మూసలో మార్పు చేస్తే సరిపోతుంది. నేను మూస:నూనెలు తయారుచేసి కొన్ని వ్యాసాలలో చేర్చాను చూడండి. మిగితా వ్యాసాలలో కూడా మూస సమాచారం తొలిగించి {{నూనెలు}} చేర్చండి చాలు. ఇంకనూ ఏవేని సందేహాలుంటే అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:47, 27 డిసెంబర్ 2012 (UTC)
ఉష్ణమాపకాలు - రకాలు
మార్చుమితృలు పాలగిరి గార్కి నమస్కారములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, మీరు తెలియజేసిన అంశములను "ఉష్ణమాపకాలు-నిర్మాణం" అనే ఉప శీర్షికను ఉంచి విషయాన్ని చేర్చి సహకరించండి.నేను పాదరస ధర్మామీటర్ల గూర్చి మాత్రమే వ్రాసాను. సెల్సియస్ పాదరస థర్మామీటరు పే చేసిన క్రమాంకనాన్ని వివరించాను. తదుపరి థెర్మామీటర్ల లో వివిధ రకాల వచ్చాయి. వాటిని కూడా మీరు చేర్చి సహకరించండి.( కె.వి.రమణ- చర్చ 03:44, 1 జనవరి 2013 (UTC))
చిత్రాలు
మార్చుమితృలు పాలగిరి గార్కి నమస్కారములు
భౌతిక శాస్త్ర అంశాలలో చిత్రాలు చేర్చుతున్నందుకు ధన్యవాదాలు.మీకు తెలిసిన విషయాలను కూడా చేర్చి సహకరించండి.మనం తెవికీ లో విజ్ఞాన శాస్త్ర అంశాలను అభివృద్ధి చేయవససిన అవసరం ఉంది.అందువల్ల శాస్త్రవేత్తలను కూడా చేర్చుటకు సంకల్పించాను. భౌతిక,రసాయన,గణిత శాస్త్ర అంశాల లొ పటములు లేని చోట స్వంతంగా తయారుచేసి చేర్చుతున్నాను.విద్యుత్తు,ఉష్ణము అంశాలను అభివృద్ధి చేయుటకు మీవంటి అనుభవజ్ఞుల సలహాలు అవసరం.మీ సహకారం ఉంటే విజ్ఞాన శాస్త్ర అంశాలను ఎక్కువగా వృద్ధి చేయుటకు వీలుంటుంది. మీరు తెలియజేసిన విశిష్టోష్ణం విలువలను చేర్చాను.మీరు చేర్చవససిన అంశాలు చెర్చండి.పట్టికలు,మూసలు నేను తయారుచేయగలను.( కె.వి.రమణ- చర్చ 01:57, 5 జనవరి 2013 (UTC))
కెలోరిఫిక్ విలువలు
మార్చుమితృలు పాలగిరి గార్కి,
- కొన్ని ఇంధనముల , పదార్థముల కెలోరిఫిక్ విలువలు ఉన్నచో "ఉష్ణము" వ్యాసములో చేర్చండి. లేదా చర్చ పేజీలో చేర్చి సహకరించండి.( కె.వి.రమణ- చర్చ 11:10, 6 జనవరి 2013 (UTC))
- విలువలను చేర్చి సహకరించినందుకు ధన్యవాదాలు కె.వి.రమణ- చర్చ 12:54, 6 జనవరి 2013 (UTC)
ధన్యవాదములు
మార్చుDear friend,
- thanks for your compliment. కె.వి.రమణ- చర్చ 01:39, 11 జనవరి 2013 (UTC)
- తోటి సభ్యుని కృషిని గుర్తించి పతకాన్ని ప్రదానంచేసినందులకు ఆ విధంగా తెవికీ నిర్వహణలో పాలు పంచుకున్నందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 05:58, 15 జనవరి 2013 (UTC)
2012 లోమీ కృషికి అభివందనలు
మార్చు, --అర్జున (చర్చ) 07:01, 15 జనవరి 2013 (UTC)
గౌరవం
మార్చువిషయ జ్ఞానం గల మీ వంటి వారంటే నాకు గౌరవం మరియు అభిమానం. మీ మాటలకు బాథ పడలేదండి. తెవికీ లో వ్యాసాలు రాసేటపుడు తెలిసిన సభ్యులు ఇచ్చే సూచనలు పాటించాలి లేదా చర్చించాలి. నేను అనేకసార్లు మీవంటి పెద్దల సూచనలు స్వీకరించాను. కొందరు ఏకపక్షంగా ఎలాపడితే అలా రచనలు చేస్తూ సూచనలు కూడా స్వీకరించనందుకు బాధ పడ్డాను అంతే! ఎవరో ఒకరు వ్రాయనివ్వండి. వీలయినంత సహకారం అందిద్దాం.( కె.వి.రమణ- చర్చ 07:44, 23 జనవరి 2013 (UTC))
రమణగారు,
మీ స్పందనకు ధన్యవాదాలు.తెవిలో ఎవ్వరో ఒక్కరు వ్రాయడంకాదు,వ్రాస్తున్న విషయము పై పట్టువున్నవాళ్ళు రాస్తేనే,వ్యాసంలో విషయముంటుంది,లేనిచో వ్యాసం తేలిపోతుంది.తెలుగు వీకిని అభివృద్ధి పరచవలసిన అవసరం మీలాంటి సామాజిక సృహ వున్నవాళ్లు చక్కగా చెయ్యగలరు.మనచేతికున్న ఐదు వేళ్లుఒకేలా వుండవు.అలాగే సభ్యులందరు ఒకేలా వుండరు.మీలాంటికొందరు సలహలను స్వీకరించి ఏమైన తేడాలుంటే సరిద్దుకుంటారు,మరికొందరు తత్తిమా సభ్యులెంతమంది చెప్పిన మంకుపట్టుతో తమపద్ధతి మార్చుకోరు(అతనెవ్వరో మీకుతెలుసు).కాని వారికోసమని మీలాంటి విజ్ఞతకల్గినవారు రచనలు మానివెయ్యరాదు.ప్రస్తుతం రసాయనిక,బౌతికశాస్త్రాలకు సంబంధించి వివరణాత్మక వ్యాసాలు తక్కువ వున్నాయి,వున్నవాటిలో లోపాలున్నాయి.కాబట్టి మీరు ఆలోటు భర్తిచెయ్యాలి-చెయ్యగలరుకూడా.లక్షలాది విద్యార్థులకు,అసక్తి గలవారికి ఉపయోగపడతాయి.పిల్లలకుపాఠాలు చెప్పిన మీ అనుభవం మీనుండి చక్కని వ్యాసాలను రాయడానికి దోహదపడుతుంది,మాలాంటి వారికి సాధ్యంకనిదది.ఇలాంటి ఇబ్బందికరమైనవాటిపై కలసి స్పందిద్దాం.All the best.పాలగిరి (చర్చ) 08:18, 23 జనవరి 2013 (UTC)
- నా మనోభావాన్ని రాజశేఖర్ గార్కి తేలియజేసినందుకు ధన్యవాదములుSomu.balla (చర్చ) 05:52, 29 జనవరి 2013 (UTC)
తెవికీ పరిరక్షణ
మార్చు- పాలగిరి గార్కి
తెవికి సువిశాల క్షేత్రంలో కలుపు మొక్కలలా ఉన్న నాణ్యత లేని ఏకవాక్య వ్యాసాలని తొలగించే విధానం పై రచ్చబండ లొ వేరొక చర్చ ప్రారంభిస్తే బాగుండునని నా అభిప్రాయం. దయచేసి మీరు గుర్తించిన నాణ్యత లేని ఏకవాక్య వ్యాసాలలో కారణంతో పాటు తొలగిపు మూసను చేర్చండి. మనలాంటి వాళ్ళం తెవికీ పరిరక్షణకు కృషి చేయకపోతే అది కల్ప వృక్షం లా కాకుండా విషవృక్షం అయిపొతుంది.Somu.balla (చర్చ) 01:28, 28 జనవరి 2013 (UTC)
- పాలగిరి గార్కి
ఏకవాక్య వ్యసాల గూర్చి రచ్చబండ లో నా సంధేహం పై స్పందించండి(Santu (చర్చ) 04:47, 25 జనవరి 2013 (UTC))
తెవీకీ లో మీ కృషి
మార్చుపాలగిరి గారూ ! తెవీకీ లో మీ అనుభవ సారాన్ని రంగరించి అందించిన నూనెల గురించిన వ్యాసాలకు ధన్యవాదాలు. తెవీకీలో ఈ తరహా వ్యాసాలు అందించిన వారిలో మీరు మొదటివారు అనుకుంటున్నాను. తెవీకీలో నిరంతరంగా కృషి చేస్తున్న మీరు ఇక ముందు కూడా ఇలాగే కృషి చేయగలరని ఆశిస్తున్నాను. --t.sujatha (చర్చ) 06:22, 30 జనవరి 2013 (UTC)
- మిత్రులు పాలగిరి గారికి, మీ అభినందనకు ధన్యవాదములు. మీవంటి విజ్ఞుల ఆడుగుజాడలలో నా వంతు కృషి తెవికీ కి చేస్తానని తెలియజేయుచున్నాను.( కె. వి. రమణ. చర్చ 04:57, 28 ఫిబ్రవరి 2013 (UTC))
ఆర్థర్ కాటన్ మరణ తేదీ గూర్చి
మార్చుమీరు వ్రాసిన వ్యాసములో ఆర్థర్ కాటన్ మరణ తేదీ 25 జూలై అని వ్రాసారు. ఆంగ్ల వికీలో[2] 24 జూలై ఉన్నది. సవరించవచ్చా.( కె.వి.రమణ- చర్చ 15:16, 13 ఫిబ్రవరి 2013 (UTC))
కిత్తూరు చెన్నమ్మ
మార్చుకిత్తూరు చెన్నమ్మ గురించిన ఆంగ్ల వికీపీడియా en:Kittur Chennamma వ్యాసానికి లింకిచ్చాను. దానిలోని సమాచారాన్ని కూడా ఇక్కడ అనువదించి చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 09:22, 2 మార్చి 2013 (UTC)
మెటల్ ఆర్కు వెల్డింగు
మార్చువ్యాసం చాలా బాగుంది. కొంత వికీకరణ చేసి. వెల్డింగ్ విధానం అనే విభాగాన్ని చేర్చాను. కొన్ని బొమ్మలు చేర్చాను. గమచించండి.Rajasekhar1961 (చర్చ) 06:57, 5 మార్చి 2013 (UTC)
సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం
మార్చువికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం సృష్టించాను. ఈ నెల రోజులు అందరూ వీలైనన్ని మహిళలకు సంబంధించిన వ్యాసాలను విస్తరించడం లేదా మొదలుపెడితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:00, 5 మార్చి 2013 (UTC)
సంచలనం
మార్చుపాలగిరిగారూ ! సంచలనం అనే మాట తొలగించి కృషిచేసిన వారు అని వ్రాసాను గమనించ గలరు. ఏది ఏమైనా మీ కృషి మాత్రం శ్లాఘించతగినది, గుర్తింపు పొందతగినది. తెవీకీలో చిన్న మార్పులు చేసినా గుర్తించడానికి అర్హతకలిగినవారే.అంతర్జాతీయ వికీపీడియా వ్యాసం సర్వసభ్యసమావేశం కొరకు తయారు చేస్తున్నను. --t.sujatha (చర్చ) 05:50, 6 మార్చి 2013 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశం
మార్చుపాలగిరి గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 04:22, 13 మార్చి 2013 (UTC)
గండపెండేరం
మార్చుమీ సభ్యపేజీలో ఒక గండపెండేరాన్ని బహుకరించాను చూడండి.Rajasekhar1961 (చర్చ) 16:21, 7 ఏప్రిల్ 2013 (UTC)
విక్షనరీ తలపుట
మార్చుమిత్రులు పాలగిరి గార్కి,
నేను విక్షనరీ మొదటి పేజీని పరిశీలించాను. దానిలో అనేక లోటుపాట్లు కనిపించినవి. first impression is the best impression కదా! అందులో మొదట విషయ సూచిక సరిగా లేదని గమనించితిని. దానికి సరైన లింకులు లేవు. సరిగా ఓపెన్ అగుట లేదు. అందువల్ల దానిని లింకులతో తయారుచేసితిని. ఇపుడు ఏ అక్షరమైనా క్లిక్ చేస్తె ఆ అక్షరాలతోకూడిన పదాల జాబితా కనిపిస్తుంది. అదే విధంగా అంగ్ల విషయ సూచికలో అక్షరాలు చిన్నవిగా ఉండటం వల్ల దాని పరిమాణం పెంచి సరిచేశాను. దాని తర్వాత గల "శాస్త్రములు" అనే మూసలో ఏ శాస్త్రాలకూ లింకులు లేవు. ఏ శాస్త్రం పైన నైనా క్లిక్ చేస్తే దాని అర్థం మాత్రమే వస్తున్నట్లు గమనించితిని. దాన్ని సరిచేయుటలో భాగంగా "మూస:విజ్ఞాన శాస్త్రం" ను వివిధ శాస్త్రాలతో వాటి లింకులతో కలిపి తయారుచేసి మొదటి పేజీలో ఉంచితిని. తదుపరి విడిగా ఉన్న పెట్టెలు అయిన "నేటి పదం" మరియు " ప్రారంభ మూసతో కొత్తపదాల సృష్టి " లను ఒక సముదాయంగా చేసితిని. "నేటి పదం" మూసను సరిచేసితిని అందులో పదం, భాషా భాగం, అర్థములు అనే వివిధ అంశాలను చేర్చితిని. ఈ కార్యక్రమములన్నీ మీ వంటి పెద్దలతో చర్చించకుండా చేసినందుకు ఏమీ అనుకోవద్దు. మొదటి పేజీ అందంగా ఉండాలని నా అభిలాష.మరొక విషయం తెవికీ లో "మీకు తెలుసా" మరియు "చరిత్రలో ఈ రోజు" లను ఆకర్షణీయంగా చేయుటకు కృషి చేయుచున్నాలు. విక్షనరీ లో మొదటి పేజీలో గల ఈ రోజు పదం ఎటువంటివి చేర్చాలి? దానికి ఒక "భాండారము" ఉంచి అందులో విశేష మైన పదములను చేర్చితే ప్రతిరోజూ దానిని మొదటి పేజీలో సరిచేయవచ్చని నా అభిప్రాయం. మీరు సహకరించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 18:08, 9 ఏప్రిల్ 2013 (UTC)
ప్రత్యుత్తరం
మార్చుMessage added 06:09, 23 ఏప్రిల్ 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
అధికారి హోదాకు మద్దతుకు కృతజ్ఞతలు
మార్చురహ్మానుద్దీన్ గారూ, వైజాసత్యగారు నాకు అధికారిహోదాకై ప్రతిపాదించిన ఓటింగులో నాకు మద్దతు ఇచ్చినందులకు కృతజ్ఞతలు. కాని నాకు ఈ హోదా స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:24, 8 మే 2013 (UTC)
అధికార హోదాకు మద్దతు
మార్చుమీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 09:59, 13 మే 2013 (UTC)
కన్నడ వికీ
మార్చుపాలగిరి గారూ, మీకు కన్నడ వికీలో కూడా వ్యాసాలు వ్రాసేంత కన్నడ పరిజ్ఞానముండటం చాలా సంతోషం. చాలా రోజుల క్రితం ఇక్కడ రాకేశ్వర అనే సభ్యుడు కన్నడ నుంచి యక్షగానం వ్యాసం అనువందించే ప్రయత్నం చేశారు కానీ ముందుకు సాగలేదు. అది కాస్త మీరు పూర్తిచేయగలిగితే చాలా సంతోషం --వైజాసత్య (చర్చ) 03:34, 17 మే 2013 (UTC)
ప్రత్యుత్తరం
మార్చుMessage added 05:38, 17 మే 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
యక్షగానం వ్యాసం గురించి వైజాసత్య (చర్చ) 05:38, 17 మే 2013 (UTC)
- పాలగిరి గారూ, అడిగిన వెంటనే యక్షగానం వ్యాసాన్ని చక్కగా కన్నడ నుండి అనువదించి చక్కగా తీర్చిదిద్దునందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 01:33, 20 మే 2013 (UTC)
ధన్యవాదాలు
మార్చుమిత్రులు పాలగిరి గార్కి,
మీ అభినందనలకు ధన్యవాదాలు. మన అభివృద్ధి కంటే తెవికీ లో విశేష వ్యాసాలను చేర్చి మహోన్నతంగా తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష. మంచి ఆశయం ఉన్నపుడు దాన్ని వేగంగా సాధించాలనేదే నా అభిప్రాయం. మీ వంటి విజ్ఞుల ఆశీస్సులతో నేను సాధించవలసిన ఆశయాలను తొందరగా నెరవేర్చగలనని భావిస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 03:36, 25 మే 2013 (UTC)
నిర్వాహక హోదాకు మద్దతు
మార్చుమీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 12:09, 18 జూలై 2013 (UTC)
నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు
మార్చుమీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:51, 22 జూలై 2013 (UTC)
అజ్ఞాత సభ్యుని దుశ్చర్యలు
మార్చుపాలగిరి గారూ, అజ్ఞాత సభ్యుని దుశ్చర్యలు నిర్వాహకుల దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఐపీపై ఒక నెల రోజులు నిషేధం విధించాను --వైజాసత్య (చర్చ) 05:42, 20 ఆగష్టు 2013 (UTC)
నిర్వాహక హోదాకై ప్రతిపాదన
మార్చుపాలగిరి గారూ, మిమ్మల్ని నేను నిర్వాహక హోదకై ప్రతిపాదించాను. ఈ ప్రతిపాదనకు మీ అంగీకారము ఇక్కడ తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:00, 20 ఆగష్టు 2013 (UTC)
కాపీరైట్ హక్కులు మరియు న్యాయ వివాదాలు
మార్చుమహారాజశ్రీ పాలగిరి గారికి,
ఆర్యా,
మీరు వ్రాసిన వ్యాసాలు అత్యుత్తమ నాణ్యతతో అందరికీ అర్థమయ్యే విధముగా ఉన్నవి. ముఖ్యముగా విద్యార్థిలోకానికి ఇవి వరప్రదాయినులు అని చెప్పవచ్చును. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న నా మిత్రబృందం లోని కొందరు విద్యార్థులు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (నూనెలు మరియు సంబంధిత వ్యాసాలు) పై మీరు రాసిన వ్యాసాలను ప్రింట్ చేయదచిచారు. తద్వారా తెలుగు మీడియం నుండి వచ్చిన వీరు మీ వ్యాసాల ద్వారా తమ తరగతి పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకోవచ్చునని వారి ఉద్దేశ్యము. కావున మీరు వారి ఎడల దయచూపి, మీ వ్యాసాలను ముద్రణ చేయుటకు వారికి అనుమతివ్వమని, వారిపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోరని కోరుతున్నాను. ఒక వేళ మీరు వారి నుండి రాయల్టీ కోరుతున్నవారైతే దయచేసి తెలియజెయమని విన్నవించుకుంటున్నాను. విద్యార్థి లోకానికి మీ వ్యాసములు కడు ఉపయోగకరంగా ఉన్నవని, మరిన్ని ఇలాంటి వ్యాసాలను మీనుండి రావాలని ఆశిస్తున్నాము. పేద విద్యార్థుల అభ్యర్థన పట్ల మీరు సానుకూలంగా స్పందించి ముద్రణకు అనుమతిస్తారని ఆశిస్తూ, మీ కృషికి ధన్యవాదములు తెలుపుతున్నాను.
ఇట్లు,
మీ,
--పోటుగాడు (చర్చ) 07:20, 26 ఆగష్టు 2013 (UTC)
- పోటుగాడు గారు,
మీ మిత్రులు నూనెపైనేను వ్రాసిన వ్యాసాలను ముద్రించదలచినందులకు సంతోషం.వికిపీడియాలో వ్రాసిన వ్యాసాలపై రచయితలకు వ్యక్తిగత హక్కులువుండవు.ఇది వికీపిడియా విధానం.ఎందులకనగా కొన్ని సందర్భాలలో ఒకవ్యాస్యాన్ని అనేకమంది తీర్చిదిద్దివుండవచ్చును.అందువలన కాపీ రైట్ హక్కులసమస్య వుత్పన్నముకాదు.కాకపోతే తెలుగు వీకిపీడియ నుంచి సమాచారం సేకరించాము,ఇందులో పలానా వారి చే వ్రాసిన వ్యాసాలున్నాయని ఆ పుస్తకంలో వ్రాసిన సముచితం.నేను వ్రాసిన వ్యాసాలు కొందరినైన ప్రభావితంచేసినందులకు సంతోషం.పాలగిరి (చర్చ) 10:06, 26 ఆగష్టు 2013 (UTC)
పాలగిరి గారు,
మీ స్పందనకు ధన్యవాదములు. నూనె లపై మరియు వెల్డింగు లపై మీచే విరచించబడిన పెక్కు వ్యాసములు ముద్రింపబడి పంపిణీ చేయబడినవి. అలాగే ఎమ్మెస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షకు సిద్దమవుతున్న మరికొంతమంది మిత్రులు కూడా వీటిని ముద్రణ చేసుకుని ఆయా పరీక్షలకు రెట్టించిన ఉత్సాహముతో సిద్దమవుతున్నారు. భవిష్యత్తులో మీరు ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడే మరిన్ని వ్యాసాలను రాయాలని, ఆ శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సెలవు.
మీ,
----పోటుగాడు (చర్చ) 14:28, 27 ఆగష్టు 2013 (UTC)
వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది?
మార్చువంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది? అనే వ్యాసం శీర్షిక ప్రశ్న రూపంలో ఉంది. యిలా ఉండవచ్చునా? అలా కాకుండా ఏ శీర్షిక పెడితే బాగుంటుందో సూచించండి. ఈ వ్యాసంలో హెచ్చు విషయం ఉన్నందున దీనిని నూనెలు వ్యాసంలో ఉపశీర్షికగా "ప్రధాన వ్యాసం|వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది?" అని చేర్చిచే బాగుంటుందని నా అభిప్రాయం. మీ సలహా అందించండి.-- -- కె.వెంకటరమణ చర్చ 04:14, 9 సెప్టెంబర్ 2013 (UTC)
ప్రత్యుత్తరం
మార్చుMessage added 02:13, 11 సెప్టెంబర్ 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
తోటి సభ్యులకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు
మార్చుసహాయం కావాలి మూస వాడిన సందర్భాలలో పాల్గొని సహాయపడుతున్నందులకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:57, 30 సెప్టెంబర్ 2013 (UTC)
ఒక చిరుకానుక
మార్చు- పాలగిరి గారూ ప్రత్యేక అభినందనలు అందుకోండి, మీరు వ్రాస్తున్న వ్యాసాలు తెలుగు భాష యందే అద్భుతాలు. పతకం అందించిన చంద్రకాంతరావుగారికి ధన్యవాదాలు. నిజానికి నా మనసులో వున్న విషయాన్ని చంద్రకాంతరావు గారు కార్యరూపం ఇచ్చేసారు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:34, 8 అక్టోబర్ 2013 (UTC)
- విశేషమైన కృషిచేసి తెవికీ అభివృధ్ధి కోసం అనేక విశేషమైన వ్యాసాలు అందించిన మీకు మీ కృషికి గుర్తింపు పతకం వచ్చినందుకు అభినందనలు. -- కె.వెంకటరమణ చర్చ 01:15, 9 అక్టోబర్ 2013 (UTC)
సందేహం
మార్చుకన్నడ భాష మొదటి పేజీలో "ವಿಕಿಪೀಡಿಯಾ" అని, హిందీ లో "विकिपीडिया" అని ఉంది. మన తెలుగులో "వికీపీడియా" అని ('క' కు గుడిదీర్ఘం) ఉన్నది. ఈ మూడు భాషలలో ఉచ్ఛారణ ఒకటేనా?--K.Venkataramana (talk) 10:40, 26 అక్టోబర్ 2013 (UTC)
ఒలిక్ ఆమ్లం
మార్చుపాలగిరి గారు, మీరు రచించిన ఒలిక్ ఆమ్లం వ్యాస చరితాన్ని పరిశీలించాను. ఇప్పటి వ్యాస చరితం ప్రకారం చూస్తే మీరు చెప్పినట్లు వ్యాస ప్రారంభకులుగా రమణగారి పేరు మీదే ఉంది. అయితే అలా మారడానికి కారణం రమణగారి దిద్దుబాట్లలో తప్పేమీ లేదు. వ్యాసాన్ని దారిమార్పు చేసిననూ చరితం మొత్తం కొత్త పేరుతో ఉన్న వ్యాసానికే బదిలీ అవుతుంది కాబట్టి వ్యాసం పేరు మారిననూ వ్యాస ప్రారంభకుల పేరులో తేడా ఉండదు. కేవలం దారిమార్పు పేజీ మాత్రమే తరలించినవారి పేరిట తయారౌతుంది. మీరు వ్యాసం పేరును మళ్ళీ పాతపేరుకు తరలించడానికి బదులు (మళ్ళీ పాతపేజీకి దారిమార్పు చేయాలంటే ముందుగా ఆ పాత పేజీని తొలగించవలసి ఉంటుంది, కాబట్టి మీరు ప్రయత్నించిననూ సాధ్యం కాలేదనుకుంటున్నాను) రమణగారి పేరిట తయారైన దారిమార్పు పేజీలోనే సమాచారాన్ని కాపీపేస్ట్ చేశారు. ఇలా చేయడం వల్లే ఇప్పటి వ్యాసం మీపేరిట లేదు. దారిమార్పు పేజీ మాత్రం మీ పేరిట ఉంది. యాధృచ్ఛికంగా మీరు చేసిన దిద్దుబాటు ద్వారానే ఈ పొరపాటు జరిగినట్లుంది. అయిననూ ఇక్కడి అన్ని దిద్దుబాట్లు భద్రంగానే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ వ్యాస కూర్పుల్ని వెనక్కి చేసి వ్యాసాన్ని మీ పేరిట చేయడానికి అవకాశం ఉంది. రమణగారు కూడా ఇదే విషయాన్ని నా చర్చాపేజీలో కూడా తెలియజేశారు. మీ స్పందనకు ఎదురుచూస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:41, 9 నవంబర్ 2013 (UTC)
- ఒలిక్ ఆమ్లం వ్యాసాన్ని మీరే ప్రారంభించినట్లు చరితాన్ని సరిచేశాను. ఈ పేజీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. సమాచారం నేనే చేరిస్తే అన్ని బైట్ల సమాచారం నా పేరిట నమొదౌతుంది కాబట్టి వదిలివేశాను. ఓలిక్ ఆమ్లం పేజీ సమాచారాన్ని ఒలిక్ ఆమ్లంలో అతికించి ఆ పేజీని దారిమార్పుగా చేయండి చాలు. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే అడగండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 10 నవంబర్ 2013 (UTC)
ప్రత్యుత్తరం
మార్చుMessage added 00:13, 14 నవంబర్ 2013 (UTC). {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
కొలరావిపుప్ర. నకు ప్రతి పాదన
మార్చుపలగిరి గారు....
కొలరావిపుప్ర. నికి మీపేరును ప్రతిపాదించాను. దయచేసి మీ సమ్మతిని తెలియజేయగలరు. వాడుకరి.భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 08:00, 2 డిసెంబర్ 2013 (UTC)
- Bhaskaranaiduగార్కిపురష్కారానికి నా పేరు ప్రతిపాదించినందులకి మీకు ధన్యావాదాలు.కాని నాకంటె తెవీకికి ఎక్కువ సమయాన్ని కేటాయించి,ఎక్కువ రచనలు చేసిన మీలాంటి వారు(తెవికీ,విక్షనరి,వికీ సోర్సు),ఇంకా నాకు తెలియని, పరిచయం లేని వారు ,చాలా కాలంగా మౌనంగా తమరచనలు చేస్తున్నవారు చాలా మంది వున్నారు.నా మటుకు నా వ్యక్తిగత ఆబిప్రాయం నాకు అంత సీన్ లేదు .మీరు ఇంకెవ్వరి పేరయిన లేదా మీరు స్వయంగా స్వయం ప్రతిపాదన చేసుకున్న మద్ధతు ఇవ్వటానికి నేసు సిద్ధం ,ఏమైన మీ అభిమానానికి ధన్యవాదాలు.Palagiri (చర్చ) 09:12, 2 డిసెంబర్ 2013 (UTC)
ఆర్యా.... కొంత మందికి తమ సామర్థ్యము తమకు తెలియదు. గ్రహించిన ఎదుటి వారికే అది తెలుస్తుంది. అదియును గాక నా రచనలు గానీ, ఇక్కడ వ్రాస్తున్నఇతర వాడుకారుల రచనలు గానీ చాలమటుకు వారు కాక మరి ఎవ్వరైనా వ్రాయగలిగినవే. కాని మీ రచనలు మీరు తప్ప మరెవ్వరు వ్రాయలేనివి. ఇదొక్కటి చాలు మీసామర్థ్యాన్ని తెలియ జేయడానికి. మరొక్క సారి పునరాలోచించుకోవలసినదిగా మనవి. Bhaskaranaidu (చర్చ) 09:37, 2 డిసెంబర్ 2013 (UTC)
పురస్కార ప్రతిపాదనలు
మార్చుక్షమించాలి. చిత్తురూపంలో వున్నప్పడు చేర్చిన పేజీలు తొలగించాను. ప్రతిపాదనలు ప్రకటన సిద్దత తరువాత చేసిన ప్రతిపాదనలకు కొత్త పేజీలింకుతో మరలసందేశాలు పంపవలెను --అర్జున (చర్చ) 14:33, 2 డిసెంబర్ 2013 (UTC)
ధన్యవాదాలు
మార్చుప్రకటన సిద్ధత తర్వాత ప్రతిపాదనలకు నాంది పలికినందులకు ఎంపికమండలి తరపున ధన్యవాదాలు. తయారైన ప్రతిపాదన పేజీలలో వాడిన కోడ్ లో కొన్ని దోషాలుంటే మానవీయంగా సవరించాను. ఇంకేమైనా దోషాలున్నా, సందేహాలున్నా సంబంధిత చర్చాపేజీలో రాసి{{ సహాయంకావాలి}} మూస చేర్చండి.--అర్జున (చర్చ) 14:45, 2 డిసెంబర్ 2013 (UTC)
- అర్జునగారు దోషాలు సవరించినందుకు ధన్యవాదాలుPalagiri (చర్చ) 14:49, 2 డిసెంబర్ 2013 (UTC)
నెనరులు
మార్చుపలగిరి గారికి ..... పురస్కారానిని నా పేరును ప్రతిపాదించినందుకు ముందుగా దన్యవాదాలు. వాడుకరి. భాస్కరనాయుడు.Bhaskaranaidu (చర్చ) 15:15, 2 డిసెంబర్ 2013 (UTC)
పురస్కార అనుమతి గూర్చి
మార్చుపాలగిరి గార్కి, మీ పేరును 2013 కొలరావిపుప్ర పురస్కారానికి ప్రతిపాదించాను. దయచేసి ఆ పేజీలో మీ సమ్మతి తెలుపగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 15:28, 2 డిసెంబర్ 2013 (UTC)----కె.వెంకటరమణ (చర్చ) 15:28, 2 డిసెంబర్ 2013 (UTC)
ధన్యవాదములు
మార్చునాపేరు ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 04:55, 4 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
మార్చుమీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:31, 13 డిసెంబర్ 2013 (UTC))
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
మార్చుమీరు సహసభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదించినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదితి సభ్యుని ప్రతిపాదనను విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 08:43, 14 డిసెంబర్ 2013 (UTC))
- అర్జున గారు నేను వృత్తిరీత్యా ఒక సాల్వెంట్ ఏక్సుట్రాక్షను ప్లాంట్కు సంప్రదింపు నిపుణుడి(consultant engineer)గా 2.12.13 నుండి 17.12.13వరకు నెట్ సౌకర్యంలేని మూల గ్రామీణ ప్రాంతంలో వుండటం వలన,నా సెల్ పోనుకు,ల్యాఫ్‌ట్యాప్ కు నెట్ కనెక్షను లేనందున(కేవలం డెస్కు టాప్ కు మాత్రమే నాకు నెట్ సౌకర్యం వుంది)మీ సందేహానికి ప్రతిస్పందించి,ప్రతిపాదిత సభ్యుల ప్రతిపాదన విస్తరించే వీలుకలుగలేదు.ఇందువలననేను ప్రతిపాదించిన సభ్యుల ప్రతిపాదన తిరస్కారానికి గురై ఆవకాశమున్నదా?అట్లు అయినచో నన్ను క్షమించగలరు.02:02, 18 డిసెంబర్ 2013 (UTC)
అభినందనలు
మార్చుశ్రీ పాలగిరి గారికి,
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఎంపిక ఈ అవార్డ్ కే తలమానికము. మీ కృషిని ఇలాగే కొనసాగించి మరిన్ని నాణ్యమైన రచనలు కొనసాగించాలని, ఆ శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:54, 28 డిసెంబర్ 2013 (UTC)
- వాడుకరి:Palagiri గారికి, కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడి నందులకు నా హృదయ పూర్వక అభినందన శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:38, 28 డిసెంబర్ 2013 (UTC)
- శ్రీయుతులు పాలగిరి గార్కి, సలాములు. మీ రచనలు తెవికీ కే గాదు, యావత్ ఆంధ్రకే గర్వకారణం. తెలుగు ప్రజలందరూ గర్వంగా చదివే రచనలు మీవి. మీరు తెవికీలో సభ్యులుగా వుండడం మాకందరికీ గర్వకారణమే. మీలాంటి నిష్ణాతులకు కొ.ల.రా.వి.పురస్కారం రావడం మా అందరికీ సంతోషదాయకం. శుభాభినందనలు స్వీకరించండి. మీరు ఆంద్రప్రదేశ్ లోనే గాక భారత్ మరియు ప్రపంచంలో ఒక ప్రముఖ మరియు ప్రఖ్యాత శాస్త్రవేత్తగా గుర్తింపబడాలని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 20:02, 28 డిసెంబర్ 2013 (UTC)
- 2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:46, 28 డిసెంబర్ 2013 (UTC)
- పాలగిరి గారు 2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము పొందినదులకు హార్దిక శుభాకాంక్షలు. --విష్ణు (చర్చ)08:12, 3 జనవరి 2014 (UTC)::
- సుల్తాన్ ఖాదర్,జె.వి.ఆర్.కె.ప్రసాద్, అహ్మద్ నిసార్, కె.వెంకటరమణ.విష్ణుగార్లకు నా అనారోగ్యం(టైపాయిడ్)కారణంగా మీ అభినందనలకు ధన్యవాదాలు ఆలస్యంగా తెలుపుతున్నందులకు మన్నించండి.08:34, 22 జనవరి 2014 (UTC)
APCOST వెబ్-సైట్ ను కొంచెం చూడండి
మార్చుపాలగిరిగారూ, దయచేసి APCOST వారి వెబ్-సైట్ ను ఒక సారి చూడండి. [3] అలాగే, [4] నూ ఒక సారి చూడండి. బహుశా మీ సాంకేతిక పరిజ్ఞానం ఆ.ప్ర.సాంకేతిక సంస్థ వారికి ఉపయోగపడవచ్చేమో. అహ్మద్ నిసార్ (చర్చ) 21:08, 28 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం విజేతలకు ఆహ్వానం
మార్చురామకృష్ణా రెడ్డి గారికి
2003 డిసెంబర్ 10న ప్రారంభమైన తెలుగు వికీపీడియా ప్రస్థానం నిరంతరాయంగా సాగుతూ ఇప్పటికి పది సంవత్సరాలను పూర్తిచేసుకున్నది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాను అనేక రూపాలలో అభివృద్ధి పరుస్తున్న మీలాంటి ఎందరో మహానుభావులు. అలాంటి మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, ఆనంద పరచాలనీ, మేమానందించాలనీ సదుద్దేశంతో విశిష్ట వికీపీడియన్ పేరుతో 10 మంది సభ్యులను ఎన్నుకొనడం జరిగింది. వారిలో ఒకరిగా మిమ్ము ఈ సత్కారాన్ని అందుకొనేటందుకు తప్పక విచ్చేసి మీ యొక్క అనుభవాలను, సూచనలను, సలహాలను మాతో పంచుకోవాలని తద్వారా కొత్త తరానికి మీ యొక్క స్పూర్తిని అందించాలని మా ఆకాంక్ష.. శ్రమ అయినా పని ఉన్నా మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి రాగలరని మా ఆశ...
అభినందనలతో... కార్యవర్గం
మరిన్ని వివరాలు ఈ పేజీలలో
మీ వ్యాసం
మార్చుపాలగిరి రామక్రిష్ణా రెడ్డి వ్యాసంలోని సమాచారం తొలగించారని చూశాను. అలా చేయటం మంచి సాంప్రదాయం కాదు. ఎవరి వ్యాసానికి వారు మార్పులు చేసుకోవటాన్ని వికీ సమాజం హర్షించదు. సమాచారంలో ఏవైనా తప్పులు తడకలు ఉంటే తప్పకుండా చర్చా పేజీలో వ్రాయవచ్చు. ఉదాహరణతో వివరించాలంటే నందమూరి బాలకృష్ణ వచ్చి వికీలో నా పేజీ తొలగించండి అంటే తొలగిస్తామా? వికీలో పేజీ ఉందంటే ఎంతోకొంత మీరు పబ్లిక్ పర్సనాలిటీ అయ్యారని చెప్పాలి. అలాంటి వారి సమాచారం సార్వజనీకం. పాలగిరి రామక్రిష్ణా రెడ్డి వ్యాసం ఉంచాలో లేదో అని సమాజం ఇక్కడ చర్చిస్తుంది. అక్కడ మీ అభిప్రాయాలను వినిపించవచ్చు. --వైజాసత్య (చర్చ) 09:56, 22 జనవరి 2014 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం
మార్చుతెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails--t.sujatha 05:18, 29 జనవరి 2014 (UTC)
- సుజాత గారి ఆహ్వానానికి ధన్యవాదాలు.Palagiri (చర్చ) 06:34, 29 జనవరి 2014 (UTC)
సందేహం
మార్చుపలభా యంత్రము అనగా నీడ గడియారమేనా? పలభా యంత్రం అనే పదం నిఘంటువులో ఉన్నదా? ఆ పదం సరియైనదేనా? సందేహ నివృత్తి చేయగలరు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 13:38, 9 ఫిబ్రవరి 2014 (UTC)
- పలభా యంత్రము గురించి ఆంధ్రభారతి నిఘంటువులో చూసాను. దొరకలేదు. sun dial అని వెతికితే నీడ గడియారము అని రెండు నిఘంటువులలో ఉన్నట్లు తెలిసింది.Rajasekhar1961 (చర్చ) 13:55, 9 ఫిబ్రవరి 2014 (UTC)
- రమణ మరియు రాజశేఖరుగార్లకు, నీడగడియారం,sundail,మరియు పలభాయంత్రం అన్నిటి అర్థం ఒక్కటే.అన్నవరం లోని నీడగడియారం పేరు పలభాయంత్రం అనే చెక్కబడివున్నది.బహుశా ఇది సంస్కృత పదం అయ్యిండవచ్చును.Palagiri (చర్చ)
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము
మార్చునమస్కారం Palagiri గారు,
తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్నఉపకార వేతన అభ్యర్థన మాకందినది. |
---|
ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:42, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం
కొలరావిపు ప్రశంసాపత్రం
మార్చుకొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
పాలగిరి గారూ, తెలుగు మరియు కన్నడ వికీమీడియా ప్రాజెక్టులలో సమగ్రమైన వ్యాసాలు వ్రాసి చేస్తున్న కృషి అద్భుతం. వికీపీడియాలో ఆయిల్ వ్యాసాలను విశేషంగా అభివృద్ధి చేసి, విక్షనరిలో అనేక వేల పదాలు చేర్చి మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
ధర్మసందేహం
మార్చుఅలచందలతో కూడా నూనె తీస్తారా? అని ధర్మసందేహం వచ్చినది. దీనిపై కాస్త వెలుతురు ప్రసరించగలరు (ప్లీజ్ త్రో సం లైట్)!!! - శశి (చర్చ) 14:31, 19 మార్చి 2014 (UTC)
- శశి గారు అలసందలలో నూనె ఉండదండీ.ఫాబేసి కుటుంబానికి చెందిన వాటిల్లో ప్రోటినులు అధికంగా ఉంటాయి.ఈ కుటుంబానికి చెందినసోయా చిక్కుడు లో మాత్రం నూనె 18-19% వరకు ఉన్నది.
ఏప్రిల్ 27, 2014 సమావేశం
మార్చుఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:49, 23 ఏప్రిల్ 2014 (UTC)
ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం
మార్చునమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా నూనెల గురించిన వివిధ అంశాలలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు,
నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో--పవన్ సంతోష్ (చర్చ) 13:24, 26 జూలై 2014 (UTC)
వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ
మార్చుసభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 18:10, 6 ఆగష్టు 2014 (UTC)
మీ వాడుకరి పేజీ లో సమాచారపెట్టె
మార్చునమస్కారం,
మీకు అభ్యంతరం లేకపోతే మీ వాడుకరి పేజీలో సమాచారపెట్టెను చేరుద్దామనుకుంటున్నాను. అనుమతించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:33, 26 అక్టోబరు 2014 (UTC)
- వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గారు.నాపేజిలో సమాచార పెట్టె చేర్చుటకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.Palagiri (చర్చ) 02:09, 27 అక్టోబరు 2014 (UTC)
- సమాచార పెట్టె చేర్చాను. మీ జనన తేదీని పరిశీలించి సవరించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:48, 29 అక్టోబరు 2014 (UTC)
- వాడుకరి:సుల్తాన్ ఖాదర్ గార్కి,నా సమాచార పెట్టెచేర్చినందులకు మీకు ధన్యవాదంలు.06:58, 29 అక్టోబరు 2014 (UTC)
- సమాచార పెట్టె చేర్చాను. మీ జనన తేదీని పరిశీలించి సవరించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:48, 29 అక్టోబరు 2014 (UTC)
11 వ వార్షికోత్సవాల గురించి.....
మార్చుఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu
చేతి పుస్తకము గురించి
మార్చుచేతి పుస్తకము (హాండ్ బుక్) కు కావలసిన సమాచరమంతా.... సకలనం చేసి రచ్చబండ లో పెట్టాను. దానిని పరిశీలించి ఉచితమైన మార్పులు చేర్పులు చేసి, తగు పేరును చూచించ వలసినదిగ కోరడమైనది. దీనిని త్వరలో ముద్రిస్తే 11 వ వార్షిక ఉత్సవాలకు అందు బాటులోని రాగదు. ఎల్లంకి (చర్చ) 05:15, 30 డిసెంబరు 2014 (UTC)
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మార్చురామకృష్ణారెడ్డి గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు.నూనెలపై మరియు ఇతర రంగాలలో మీ విశేశ కృషిని తెవికీలో ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు,
మీ మిత్రుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:51, 2 జనవరి 2015 (UTC)
అభినంధనలు
మార్చుమీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు
https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1
తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:41, 9 ఫిబ్రవరి 2015 (UTC)
వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు
మార్చువెండి సమ్మేళనాలు
మార్చువెండి వ్యాసాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు. డైసిల్వరు ఫ్లోరైడ్ మరియు సిల్వర్ సబ్‌ఫ్లోరైడ్ రెండూ ఒకటేనా. ఒకసారి నిర్ధారించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:31, 13 మార్చి 2015 (UTC)
- Rajasekhar1961 గారు,రెండు ఒకటేనండి.Palagiri (చర్చ) 11:57, 13 మార్చి 2015 (UTC)
- ధన్యవాదాలు. రెండూ విలీనం చేశాను.--Rajasekhar1961 (చర్చ) 12:07, 13 మార్చి 2015 (UTC)
వాడుకరి పుటలోని info boxబదులు ఎదో text కన్పిస్తున్నది
మార్చునా వాడుకరి పుటలోని info boxస్థానంలో ఎదో text కనపడుచున్నది.దయచేసి ఎవ్వరైన పరిస్కారం చెప్పగలరా? Palagiri (చర్చ) 06:02, 5 ఏప్రిల్ 2015 (UTC)
- ఏదో ఒక ముఖ్యమైన సమాచారపెట్టెల మూసలో పొరపాటు వళ్ళ ఇది జరిగినట్టుంది. సరిచేసే ప్రయత్నం చేస్తానండి --వైజాసత్య (చర్చ) 06:07, 5 ఏప్రిల్ 2015 (UTC)
వైజాసత్యగారు:మీస్పందనకు ధన్యవాదాలు.Palagiri (చర్చ) 06:09, 5 ఏప్రిల్ 2015 (UTC)
- సమస్య పరిష్కారం అయ్యిందండి. ఇప్పడు చూడండి --వైజాసత్య (చర్చ) 06:18, 5 ఏప్రిల్ 2015 (UTC)
- సమస్య పరిష్కారం అయ్యిందండి.ధన్యవాదాలుPalagiri (చర్చ) 03:33, 6 ఏప్రిల్ 2015 (UTC)
వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం
మార్చుదీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)
- విశ్వనాధ్ గార్కి, మీ అభినందనకు ధన్యవాదాలు.Palagiri (చర్చ) 07:42, 18 ఏప్రిల్ 2015 (UTC)
రసాయన మూలకాలు
మార్చుమీరు రసాయన మూలకాల వ్యాసాలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు కోరినట్లు {{రసాయన మూలకాలు}} మూసను తయారు చేసాను. పరిశీలించండి. లాంథనైడ్లు, ఆక్టినైడ్లు కూడా చేర్చుతాను. ఏవిధమైన మార్పులు చేయలన్నా తెలియజేయండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 00:48, 25 ఏప్రిల్ 2015 (UTC)
- కె.వెంకటరమణగారు,మూస బాగానే ఉన్నది.ఇలా ఉంచండి,అవసరమైతే ముందుముందుమార్చవచ్చు.మీ సహాయానికి ధన్యవాదాలు.Palagiri (చర్చ) 07:20, 25 ఏప్రిల్ 2015 (UTC)
రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము
మార్చుపాలగిరి రామకృష్ణారెడ్డి గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 19:08, 8 మే 2015 (UTC)
సముదాయేతర సంస్థలు
మార్చుపాలగిరి గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:06, 3 జూన్ 2015 (UTC)
తెలంగాణ గ్రామాలు
మార్చుపాలగిరి గారు, నమస్కారము. వర్గం:తెలంగాణ గ్రామాలు అనే వర్గం ఉన్నది. తదుపరి, మూసలలో చేర్చితే గ్రామాలు జాబితా వస్తుంది. మీరు కొత్తగా మరో వర్గం చేశారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒకరిని పనిచేయమని కాని లేదా వద్దని కాని చెప్పకూడదు అని నా అభిప్రాయము. మనం చేస్తున్న వికీగుడి పూజ పనులు శ్రీ- కాళ- హస్తి విధానంలో ఉంటున్నాయి. అందుకని ఎవరికీ నేను ఉచిత సలహాలు ఇవ్వడము సముచితము కాదని వారికి తెలియజేయడము లేదు. చేస్తున్న పనిలో ఎవరి సంతోషము వారిది. వారే తెలుసుకుంటారని అనుకుంటున్నాను. గ్రామాలు పని మీరు ఒకసారి ఆలోచించండి. మీ పనికి అడ్డుచెప్పేంత సాహసము మాత్రము చేయను. దయచేసి అర్థం చేసుకోగలరు అని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 14:36, 22 ఆగష్టు 2015 (UTC)
- పాలగిరిగారు, నేను మీకు వ్రాసిన విషయానికి మీ నుండి సమాధానము లేదు. మీరు కొత్తగా వర్గం:తెలంగాణా రాష్తంలోని గ్రామాలు అనే వర్గం ఎందుకు సృష్టించారో తెలియజేయండి. దానిని నేను రెండుసార్లు తొలగించాను. మరలా మీరు ఆ వర్గంలో హట్‌కేట్ ద్వారా మూడోసారి గ్రామాలను చేర్చుతున్నారు. కారణము తెలియదు. వర్గం:తెలంగాణ గ్రామాలు అనే వర్గం ఏనాడో ఉంది. గ్రామాలన్నీ ఆ వర్గములోనికి వస్తాయి. గ్రామవ్యాసాల ప్రక్షాళన అనేది ఒక గంట లేదా ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. దయచేసి మీరు చేస్తున్న పనికి వివరణ ఇస్తూ కొన్నాళ్ళు చేస్తున్న పనిని గమనించండి. ఎవరి పూజ విధానము వారిది అన్నట్లు ఉన్న నలుగురు ఉంటే ఏ పనిని ఒకకొలిక్కి తేవడము ఎవరికైనా చాలా కష్టం అవుతుంది. JVRKPRASAD (చర్చ) 11:22, 23 ఆగష్టు 2015 (UTC)
చిరుకానుక
మార్చురసాయన శాస్త్ర వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు | |
----
పాలగిరిగారికి, తెవికీ లో విశిష్ట రచనలు చేస్తూ అలుపెరుగక నిరంత కృషితో అనేక వ్యాసాలను చేర్చి తెవికీ ప్రగతి పాటుపడుతున్న మీకు కృతజ్ఞతలు. మీరు వ్రాసిన రసాయనశాస్త్ర వ్యాసాలు, నూనెల వ్యాసాలు అనేకమంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తెవికీని విశిష్ట వ్యాసాలతో సుసంపన్నం చేస్తున్నందుకు రసాయనశాస్త్ర కానుకను స్వీకరించగలరు. ధన్యవాదాలు. -- కె.వెంకటరమణ⇒చర్చ 13:39, 14 సెప్టెంబరు 2015 (UTC) |
రసాయన శాస్త్రం
మార్చురసాయన సమ్మేళనాలకు సంబంధించిన వ్యాసాలను విద్యార్థులకు ఉపయోగకరంగా తయారుచేసి అభివృద్ది చేస్తున్నందుకు ధన్యవాదాలు. మూలకాల వ్యాసాలు చాలా బాగున్నాయి. అలాగే సమ్మేళనాలలో కీలకపాత్ర పోషిస్తున్న క్లోరైడు, నైట్రేటు, బ్రోమైడు మొదలైన వాటి గురించి కూడా వ్యాసాలు తయారుచేస్తే బాగుంటుంది. ఈ వ్యాసాలలో ఇతర సభ్యులు చేయాల్సిన సహాయం ఏదైనా ఉంటే దయచేసి తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:02, 18 అక్టోబరు 2015 (UTC)
- Rajasekhar1961గార్కి, మీ అభినందనకు ధన్యవాదాలుPalagiri (చర్చ) 08:44, 18 అక్టోబరు 2015 (UTC)
స్వాగతానికి ధన్యవాదాలు
మార్చుఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు Palagiri గారు.--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 06:35, 10 ఫిబ్రవరి 2016 (UTC)
వెబ్ అర్కైవ్ లింకులు వాడుతున్నందుకు ధన్యవాదాలు.
మార్చువెబ్ అర్కైవ్ లింకులు వాడుతున్నందుకు ధన్యవాదాలు. ఉదాహరణ. మీలాగా మరింతమంది ఇలా చేస్తూ పనిచేయని లింకులను తొలగించుతూ వుంటే వికీ నాణ్యత మెరుగవుతుంది. --అర్జున (చర్చ) 06:41, 24 మార్చి 2016 (UTC)
- అర్జునగార్కి,.ధన్యవాదాలు. ముఖ్యంగా వార్తాపత్రికలను మూలాలుగా పేర్కొనవాల్సినపుడు వెబ్ అర్కైవ్ లింకులు ఉపయోగిస్తున్నాను.శాశ్వితవెబ్ సైట్లకు మాములు రెపరెన్స్ వాడుచున్నాను. Palagiri (చర్చ) 08:34, 24 మార్చి 2016 (UTC)
Participate in the Ibero-American Culture Challenge!
మార్చుHi!
Iberocoop has launched a translating contest to improve the content in other Wikipedia related to Ibero-American Culture.
We would love to have you on board :)
Please find the contest here: https://en.wikipedia.org/wiki/Wikipedia:Translating_Ibero_-_America/Participants_2016
పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం
మార్చుపంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం | |
పంజాబ్ ఎడిటథాన్లో పట్టుదలతో, ఉత్సాహంతో కృషి చేసి అనేక వ్యాసాలను సృష్టించి తెవికీ విజయంలో మంచి పాత్ర పోషించినందుకు తెవికీ విజయం సాధించిన సందర్భంగా మీకు ఓ విజయ పతకం.
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున |
రాకెట్టు పతకం
మార్చుఖగోళంలో మనదేశ ప్రతిభను ప్రపంచ ప్రసిద్ధిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని తెలుగులో ప్రజలందరికీ సుమారు 40 పైగా వ్యాసాలను అభివృద్ధిచేసిన పాలగిరి గారికి సభ్యులందరి తరపున ధన్యవాదాలను తెలుపుకొంటున్నాను. ఇందుకని అందిస్తున్న చిన్న పతకం: దయచేసి అందుకోండి.--Rajasekhar1961 (చర్చ) 10:38, 24 మార్చి 2017 (UTC)
- ఖగోళంలో మనదేశ ప్రతిభను ప్రపంచ ప్రసిద్ధిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని తెలుగులో ప్రజలందరికీ వ్యాసాల ద్వారా అందజేసిన పాలగిరి రామక్రిష్ణా రెడ్డి కృషికి ధన్యవాదాలు. విశేష "అంతరిక్ష పతకాన్ని" అందుకున్నందుకు అభినందనలు. -- కె.వెంకటరమణ⇒చర్చ 13:38, 24 మార్చి 2017 (UTC)
- అభినందనలు పాలగిరి గారు. వీటీని మీ వాడుకరి పేజీకి మార్చుకొండి. అన్నీ ఒక్కచోట కనిపిస్తూ ఉంటాయి..--Viswanadh (చర్చ) 01:12, 26 మార్చి 2017 (UTC)
- శాస్త్ర సాంకేతిక అంశాలలో అత్యంత నాణ్యమైన వ్యాసాలు రాస్తూ తెవికీ విశ్వసనీయతను పెంచుతూ మాలాంటి సభ్యులకు ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ పాలగిరి రామకృష్ణారెడ్డి గారికి అభినందనలు. మీరు తమ కృషిని ఇలాగే కొనసాగించి తెవికీని మరో స్థాయికి తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:22, 24 మార్చి 2017 (UTC)
ధన్యవాదాలు
మార్చువాడుకరి:Rajasekhar1961 గారు. నేను రాసిన ఇస్రో వ్యాసాలకై మీరు రాకెట్ పతకం ఇచ్చి ప్రొత్సాహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
- రాకెట్ పతకం పొందిన సందర్భంగా అభినందనలు తెల్పిన కె.వెంకటరమణ,Viswanadh మరియు సుల్తాన్ ఖాదర్ గార్లకు ధన్యవాదాలుPalagiri (చర్చ) 03:21, 25 మార్చి 2017 (UTC)
సహాయం కావాలి
మార్చుHi Sir
I'm Naveen From Karnataka, My mother tongue is Kannada still i can speak little bit Telugu, But i hardly know telugu writing. Recently i had Translated Thotadappa English Wikipedia page to Telugu గుబ్బి తోటదప్ప using Google translate. It would be great if you can correct the Grammatical mistakes & Sentences in this article (గుబ్బి తోటదప్ప).
--NaveenNkadalaveni (చర్చ) 06:01, 22 జూలై 2017 (UTC)
చర్చ:రాయభూపాల పట్నం వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుచర్చ:రాయభూపాల పట్నం వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.
ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/చర్చ:రాయభూపాల పట్నం వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.
చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. Palagiri (చర్చ) 08:19, 22 జనవరి 2018 (UTC)
Edit Count tool for Wikipedias
మార్చుTool you've referred for [5] --IM3847 (చర్చ) 12:50, 1 జూలై 2018 (UTC)
మంచి వ్యాసం ప్రతిపాదనలు - పద్ధతి
మార్చుపాలగిరి గారూ,
నమస్తే. మంచి వ్యాసం ప్రమాణాల ప్రకారం మంచి వ్యాసం ప్రతిపాదనలు చేస్తున్నాం. ఈ ప్రతిపాదనలు పేజీలోని క్రమంలో మొదటిది - మంచుమనిషి వ్యాసాన్ని ఇప్పటికే నేను ఒక దఫా సమీక్షించి, రెండో అభిప్రాయాన్ని కోరాను. ఆ పేజీ పరిశీలించవచ్చు. మీ వ్యాసాల్లో కానీ, ఇతరుల వ్యాసాల్లో కానీ మీకు మంచి వ్యాసం అవుతుందని అనిపిచినదాన్ని దాని చర్చా పేజీలో {{GA nominee|~~~~~|nominator=~~~|page=1|status=|subtopic=}} ఉపయోగించి ప్రతిపాదించవచ్చు. ప్రతిపాదించాకా {{GANentry|1=ఫలానా వ్యాసం|2=1}} అన్న మూసతో మంచి వ్యాసం ప్రతిపాదనలు పేజీలో జాబితా వేస్తే సరిపోతుంది. ప్రతిపాదకునిగానో, సమీక్షకునిగానో మీకు నచ్చిన వ్యాసంపై పనిచేస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:29, 9 ఆగస్టు 2018 (UTC)
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్
మార్చుభారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో మన వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ పేజీలో చేయదగ్గ పనులు ఉప విభాగంలో వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేనివి, తెలుగులో స్వాతంత్ర్యోద్యమం గురించి ఉన్నవీ వ్యాసాలు, వాటి వికీడేటా ఐటంలు జాబితా వేశాను. వికీడేటా పేజీలో పేరు నమోదుచేసుకుని, నేను అందించిన పట్టిక ఉపయోగించి కృషి ప్రారంభించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:50, 15 ఆగస్టు 2018 (UTC)
These files have no license
మార్చుHi! It seems that these files you uploaded have no license. All file need license and information about source and author.
If the file should be licensed freely please add {{Information}} and fill it out with all relevant information and also chose a license for example {{Cc-by-sa-4.0}}. If you are not the photographer/creator you need to add a link to a website or in an other way explain where you got the file and why it is under a free license.
If you want to use the file as fair use you need to fill out {{Non-free use rationale}} or one of the other templates and also add the relevant license template ({{Non-free fair use}} or another relevant template).
This is a list of the files:
- File:Vijay_narsampet.jpeg
- File:Triglyceride.gif
- File:001.jpg
- File:Seven_summits.jpg
- File:Rkr.jpg
- File:Ricebranoil.jpg
- File:Rice-bran-pellet-.jpg
- File:Photos_063.jpg
- File:Photos_062.jpg
- File:Palagiri.jpg
- File:PSLV-C30_towards_sky.JPG
- File:Oilpalm-sterilizer.jpg
- File:Oil_palm-fruit_bunch.jpg
- File:Nagavali.jpg
- File:Mdp_009.jpg
- File:Kanuga_pod.jpg
- File:Kanuga_kernels.jpg
- File:Jel1.jpg
- File:Hydrolysis.gif
- File:Gslv-d1.JPG
- File:GSLV_Mk2D3_Cryo_Engine.jpg
- File:GSLV_D1.JPG
- File:GSLV1.jpg
- File:Dp_005.jpg
- File:Chitradurga_058.JPG
- File:Chitradurga_-raghavendramatam.JPG
- File:Cartosat1Assembly.jpg
- File:Calicu.jpg
- File:Cal.jpg
- File:Astrosat_folded_large.png
- File:Apple_Key_Board_copy.JPG
If you find out that the file is no longer usable or if it can't be kept on Wikipedia then please nominate it for deletion. --MGA73 (చర్చ) 16:24, 30 మార్చి 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:52, 1 సెప్టెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
మార్చు@Palagiri గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన 21 బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది. గతంలో user:MGA73 గారు ఈ విషయమై మీకు సందేశం పెట్టారు. వారు నన్ను ఈ విషయమై పనిచేయమని కోరారు. వీటి జాబితా క్రింద ఇస్తున్నాను
Palagiri | 20150930 | File:PSLV-C30_towards_sky.JPG |
Palagiri | 20150928 | File:Astrosat_folded_large.png |
Palagiri | 20150912 | File:GSLV1.jpg |
Palagiri | 20150912 | File:GSLV_Mk2D3_Cryo_Engine.jpg |
Palagiri | 20150908 | File:Gslv-d1.JPG |
Palagiri | 20150908 | File:GSLV_D1.JPG |
Palagiri | 20150901 | File:Cartosat1Assembly.jpg |
Palagiri | 20141229 | File:Apple_Key_Board_copy.JPG |
Palagiri | 20120824 | File:Nagavali.jpg |
Palagiri | 20120515 | File:Jel1.jpg |
Palagiri | 20120409 | File:Dp_005.jpg |
Palagiri | 20120408 | File:Mdp_009.jpg |
Palagiri | 20120404 | File:Chitradurga_058.JPG |
Palagiri | 20120314 | File:Photos_063.jpg |
Palagiri | 20120310 | File:Chitradurga_-raghavendramatam.JPG |
Palagiri | 20110923 | File:Hydrolysis.gif |
Palagiri | 20110915 | File:Triglyceride.gif |
Palagiri | 20110907 | File:Kanuga_pod.jpg |
Palagiri | 20110907 | File:Kanuga_kernels.jpg |
Palagiri | 20110824 | File:Oil_palm-fruit_bunch.jpg |
Palagiri | 20110824 | File:Ricebranoil.jpg |
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}}, వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. పై వాటిని సవరించితే పై పట్టికలోనే చివర కొత్త వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 07:11, 30 నవంబరు 2021 (UTC)
@Palagiri గారు, మీ బొమ్మలు పరిశీలించిన మీదట, ఇవన్నీ మీ స్వంత కెమేరాతో తీసినవిలాగున్నాయి. వీటికి మీరు ఎంపిక చేసే లైసెన్స్ ఈ వ్యాఖ్యకు స్పందన ద్వారా తెలియపరస్తే, ఆ వివరాలు నేను బాటు ద్వారా చేరుస్తాను. సాధారణంగా బొమ్మలను వికీపీడియాలో CC-BY-SA 3.0 లైసెన్స్ వాడుతారు. మీరు ఒక వారంలో అనగా 17-12-2021లోగా స్పందించకపోతే, ఈ చిత్రాలు తొలగించవలసి వస్తుంది. --అర్జున (చర్చ) 04:50, 10 డిసెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
మార్చు@Palagiri గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)
మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
మార్చు@Palagiri గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:11, 11 జనవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
మార్చు@Palagiri గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)
నమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నమస్కారం @ Palagiri గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
మార్చుపాలగిరి గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:58, 25 మార్చి 2024 (UTC)
- పాలగిరి గారూ, పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:32, 29 మార్చి 2024 (UTC)
మొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుమొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మూస తప్ప ఎటువంటి సమాచారం లేదు. తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మొక్కల నుండి లభించు ఆల్కలాయిడ్స్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:54, 15 ఏప్రిల్ 2024 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:54, 15 ఏప్రిల్ 2024 (UTC)
- తొలగింపు వ్యాసం యొక్క చర్చ పేజిలో సమాధానం ఇచ్చాను.Palagiri (చర్చ) 03:51, 17 ఏప్రిల్ 2024 (UTC)