పిండి పదార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
కర్బనోదకాల పేర్లన్నీ "-ఓజు" శబ్దంతో అంతం అవాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. ఉదాహరణకి కర్బనోదకాలన్నిటిలోనూ అతి చిన్న బణువు గ్లూకోజు. రక్తంలో ఉండే చక్కెర ఇదే. పళ్ళకి తీపినిచ్చేది ఫ్రూక్టోజు (ప్రూట్ అంటే పండు, ప్రూట్ + ఓజు = ఫ్రూక్టోజు). మనం సాధారణంగా కాఫీ, టీ లలో వేసుకునేది సుక్రోజు. పాలకి తియ్యదనాన్నిచ్చేది లేక్టోజు. మన జన్యు పదార్ధంలో ఉండేది రైబోజు. పీచు, పిప్పి పదార్ధాలలో ఉండేది కణోజు (కణం + ఓజు = కణోజు, లేదా సెల్‌ + ఓజు = సెల్యులోజు). మనం ఏ భాషలో మాట్లాడినా, ఏ కొత్త పేర్లు పెట్టినా ఈ ఒప్పందం మనస్సులో పెట్టుకుంటే సర్వదా క్షేమకరం. అదే విధంగా కుడిచేతి వాటం ఉన్న చక్కెరలని డెక్‌స్ట్రోజు (dextrose) అనీ, ఎడమ చేతి వాటం ఉన్న చక్కెరలని లీవోజు (levose) అనీ అంటారు. (లేటిన్‌లో Dextro అంటే కుడి, levo అంటే ఎడమ.) వీటిని కావలిస్తే మనం దక్షిణోజు, వామోజు అని అనొచ్చు.
 
== cells lines ==
== అణువుల అమరిక ==
 
ఆంగిక రసాయనంలో పేర్లు ఎంత ముఖ్యమో, ఒక బణువులో ఉన్న అణువుల అమరిక వైఖరి కూడ అంతే ముఖ్యం. ఈ అణువుల అమరికని నిర్మాణక్రమం (structural formula) అంటారు. ఈ నిర్మాణక్రమం లో చిన్న మార్పు వచ్చినా బణువు లక్షణం మారిపోతుంది. ఉదాహరణకి గ్లూకోజు బణువులో ఉన్న అణువులు తిన్నటి గొలుసు (straight-chain) ఆకారంలో ఉండొచ్చు, చక్రం (ring) ఆకారంలో ఉండొచ్చు. కొన్ని అమరికలలో సౌష్టత (symmetry) ఉండొచ్చు, కొన్ని అమరికలలో ఉండక పోవచ్చు. కొన్ని అమరికలకి 'కుడిచేతి వాటం' ఉండొచ్చు, కొన్నింటికి ఎడం చేతి వాటం' ఉండొచ్చు. ఈ 'వాటం' ని సాంకేతిక పరిభాషలో కరత్వం (handedness or chirality) అంటారు. ఈ కరత్వం అన్న మాటలోంచి వచ్చినదే chirality అనే ఇంగ్లీషు మాట!
"https://te.wikipedia.org/wiki/పిండి_పదార్థాలు" నుండి వెలికితీశారు