ఇది నా చర్చా పేజి. మీ సందేహాన్ని "ఇక్కడ".తెలియజేయండి.


ప్లీహం గురించి ఇంకా వివరాలు పూర్తిగా పెట్టండి

జావేద్ మియాందాద్ వ్యాసంలో మూసల గురించిసవరించు

కె.వెంకటరమణ గారూ నేను జావేద్ మియాందాద్ వ్యాసాన్ని ఆంగ్లవికీ నుండి అనువదించాను. దానిలో టెస్ట్ ప్రదర్శన, వన్డే ప్రదర్శన అనే పేరాల క్రింద ఉన్న పట్టికలలో cr|ENG,cr|IND,cr|NZL,cr|WIN,cr|ZIM,cr|RSA,cr|UAE మూసలు సరిచేయవలసి ఉంది. అలాగే అదే వ్యాసంలో రికార్డులు, ఘనతలు అనే శీర్షిక క్రింద ఉన్న మూస Age in years and days తెలుగులో కనిపించేలా మార్చగలరా? మీ సహాయానికి ముందస్తు ధన్యవాదాలు.--స్వరలాసిక (చర్చ) 16:16, 12 జూన్ 2020 (UTC)

మూసలు సరిచేసితిని. K.Venkataramana(talk) 04:31, 13 జూన్ 2020 (UTC)
కె.వెంకటరమణ గారూ ధన్యవాదాలు. అయితే జావేద్ మియాందాద్ వ్యాసంలో ఇంకా ఎర్రలింకులు అలాగే ఉండిపోయాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పుట తెవికీలో లేదు కనుక ఆ మూసలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కాక ఆస్ట్రేలియా దేశానికి లంకె ఇస్తే బాగుంటుంది. --స్వరలాసిక (చర్చ) 13:58, 13 జూన్ 2020 (UTC)
స్వరలాసిక గారూ, అన్ని మూసలలో క్రికెట్ జట్టు వ్యాసాలు లేనందున, ఎర్ర లింకులు నివారించుటకు దేశాల పేర్లను మూసలలో చేర్చితిని. కానీ వెస్ట్ ఇండీస్ వ్యాసం తెవికీలో లేదు. మిగిలిన మూసలన్నీ సరిచేసితిని. K.Venkataramana(talk) 14:47, 13 జూన్ 2020 (UTC)

ప్రారంభ ముగింపు తేదీలు మూససవరించు

కె.వెంకటరమణ గారూ రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు పేజీలో సమాచారపెట్టె కొరకు మూస:Start and end dates అనే మూస పేజీని సృష్టించాలి. దయచేసి ఆ మూసను సృష్టించగలరు. --స్వరలాసిక (చర్చ) 13:52, 26 జూన్ 2020 (UTC)

{{Start and end dates}} దిగుమతి చేయడం జగిరింది. K.Venkataramana(talk) 14:04, 26 జూన్ 2020 (UTC)

ప్రస్థానత్రయం పేజీలోసవరించు

ప్రస్థానత్రయం పేజీలో వ్యాఖ్య విభాగంలో ఉన్న పాఠ్యంలోని వాక్యాల సవరణలు చెయ్యాల్సిన అవసరం ఉందనిపించింది. కానీ చెయ్యాలంటే నాకు విషయం తెలియక చెయ్యలేకపోయాను. ఆ పాఠ్యాన్ని మీరు చేర్చారు కాబట్టి మీకు అవగాహన ఉండవచ్చు అనిపించింది. మీకు వీలున్నపుడు పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 00:59, 29 జూన్ 2020 (UTC)

చదువరి గారూ ప్రస్థానత్రయం వ్యాసం ఒక అజ్ఞాత సృష్టించినది. అంతకు ముందు కూడాప్రస్థానాత్రయం అనే మరొక వ్యసం వికీలో ఉంది. విలీనం చేసే కార్యక్రమంలో భాగంగా 2013 ఆగస్టు 17న ప్రస్థానాత్రయం లోని మొత్త సమాచారన్ని ఈ వ్యాసంలో చేర్చాను. అప్పుడు నాకు వికీ విధానాలపై, శుద్ధి కార్యక్రమాలపై సరైన అవగాహన లేనందున శుద్ధి చేయలేకపోయాను. నాకు కూడా ఆ విషయంపై సరైన అవగాహన లేనందున యదాతథంగా చేర్చాను. కనుక ఆ విభాగం అర్థవంతంగా మార్చలేని పక్షంలో తొలగించవచ్చు. K.Venkataramana(talk) 02:15, 29 జూన్ 2020 (UTC)
సరేనండి. __చదువరి (చర్చరచనలు) 02:40, 29 జూన్ 2020 (UTC)

మూస దిగుమతిసవరించు

వెంకటరమణ గారు ఈ మూస {{Infobox firearm cartridge}} ను దిగుమతి చేయండి.Ch Maheswara Raju (చర్చ) 06:44, 12 జూలై 2020 (UTC)

దిగుమతి చేసి అనువదించాను. K.Venkataramana(talk) 07:45, 12 జూలై 2020 (UTC)
ధన్యవాదాలు అండిCh Maheswara Raju (చర్చ) 08:01, 12 జూలై 2020 (UTC)

మరింగంటి వంశవృక్షంసవరించు

తాలాంక నందినీ పరిణయము (1980) గ్రంథంలో మరింగంటి కవుల వంశవృక్షం ఉన్నది. దయచేసి తయారుచేయడానికి ప్రయత్నించండి. లింకు: https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/10&action=edit&redlink=1 --Rajasekhar1961 (చర్చ) 06:39, 15 జూలై 2020 (UTC)

మీ విస్తరణ జాబితాలోసవరించు

‎మొదటి ప్రోలరాజు, కందిమళ్ల ప్రతాపరెడ్డి, గుంటుపల్లి గోపాలకృష్ణకవి - మూడు పేజీలనూ మీరు విస్తరించి మూస తీసేసారు గానీ మీ మొలకల విస్తరణ జాబితాలో చేర్చలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:53, 25 జూలై 2020 (UTC)

రాగోలు చిన అప్పలస్వామి, ఆరతీ ఛాబ్రియా, జె.జె. థామ్సన్ _ ఈ మూడు పేజీలను వేరే పేజీల్లో విలీనం చేసి, వీటిని దారిమార్పుగా చేసారు. వీటిని కూడా మీ జాబితా లోకి చేర్చుకోవాలనుకుంటాను. తొలగించిన పేజీలు తప్ప అన్నీ మన జాబితాలో ఉండాల్సిందే కదా! పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 08:34, 25 జూలై 2020 (UTC)

పురపాలక సంఘ వ్యాసాలలో మ్యాప్ గురించిసవరించు

పురపాలక సంఘ వ్యాసాలలో సమాచార పెట్టె లో మ్యాప్ వచ్చే విధంగా పెట్టండి. ఉదాఅమలాపురం పురపాలక సంఘం లో పెట్టండి మిగిలిన వ్యాసాలలో నేను మార్పు చేస్తాను.Ch Maheswara Raju (చర్చ) 07:30, 13 ఆగస్టు 2020 (UTC)

తెలుగు అనువాద వ్యాసాల పతకంసవరించు

Translation Barnstar te.svg తెలుగు అనువాద వ్యాసాల పతకం
K.Venkataramana గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:42, 13 ఆగస్టు 2020 (UTC)

బైస దేవదాస్సవరించు

బైస దేవదాస్ పేజీని విస్తరించారు గానీ, మూసను తీసెయ్యలేదు. మీ లెక్క లోకీ చేరలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 05:37, 17 ఆగస్టు 2020 (UTC)

విస్తరణ చేసిన పై వ్యాసాలకు మొలక మూసలు తొలగించడం జరిగింది. K.Venkataramana(talk) 02:45, 21 ఆగస్టు 2020 (UTC)

పాత చర్చలకు ప్రధానపేజీలు అవసరంలేదుసవరించు

వాడుకరి:K.Venkataramana/పాత చర్చ 2 అవసరంలేదు, అందువలన వర్గం:ఆంగ్ల_వికీ_వ్యాసాలని_తెలుగు_వికీ_లో_అనువదించే_వాడుకరులు పరిశీలించేటప్పుడు ఆ పేజీలు కూడా చేరుతున్నాయి. పరిశీలించి తొలగించండి. --అర్జున (చర్చ) 06:24, 23 ఆగస్టు 2020 (UTC)

అలాగే మూస:వాడుకరి:Kvr.lohith/వాడుకరి పెట్టెలు కూడా పరిశీలించి నేరుగా వాడుకరిపేజీ లో ఆ విషయాన్ని చేర్చటం మంచిదనుకుంటాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:27, 23 ఆగస్టు 2020 (UTC)
అలాగే మీ AWB ఖాతా పేజీలో కూడా వాడుకరి పెట్టెలు సరిచేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 06:45, 23 ఆగస్టు 2020 (UTC)
మార్పులు చేసినందులకు ధన్యవాదాలు. వాడుకరి:K.Venkataramana/పాత చర్చ 3 లో కూడా మార్పులు చేయవలసివుంది. పరిశీలించండి. --అర్జున (చర్చ) 08:14, 23 ఆగస్టు 2020 (UTC)
మీరు తెలియజేసిన మార్పులన్నీ చేసాను K.Venkataramana(talk) 08:48, 23 ఆగస్టు 2020 (UTC)
User:K.Venkataramana గారు, ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 10:47, 23 ఆగస్టు 2020 (UTC)

ఈ పేజీ చూడండిసవరించు

విరియాల కామసాని గూడూరు శాసనము __చదువరి (చర్చరచనలు) 09:24, 31 ఆగస్టు 2020 (UTC)

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు విజయవంతమైనందుకు అభినందిస్తూ...సవరించు

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక
పతకం ఇచ్చి మరింత కృషి చేయడానికి ప్రోత్సాహం ఇచ్చిన స్వరలాసిక గారికి ధన్యవాదాలు. K.Venkataramana(talk) 14:33, 3 సెప్టెంబరు 2020 (UTC)

వెల్ది ఇందిర చిత్రం చేర్చుట గూర్చిసవరించు

వెంకటరమణ గారు నా ఫోటోను తెలంగాణ హైదరాబాద్ కవులలో వెల్ది ఇందిర ఏడ్ ఎలా చెయ్యాలి దయచేసి సహాయం చేయగలరు.16:13, 5 September 2020‎ వెల్ది.ఇందిర talk

వెల్ది ఇందిర గారూ, మీ వాడుకరి పేజీలో మీ గురించి విషయాలను చేర్చారు. మీరు రచయిత్రి, కవయిత్రి అని తెలియజేసే వార్తాపత్రిక మూలాలు లభ్యమగుట లేదు. అంతర్జాలంలో గానీ, మీరు రచించిన పుస్తకాల సమీక్షలు గానీ లభ్యమగుట లేదు. కనుక మీ వ్యాసాన్ని వికీలో ప్రస్తుతం సృష్టించలేము. మీ గురించి ఏవేనీ వార్తా పత్రికల లేదా అంతర్జాల మూలాలు లభిస్తే మీరు మీ వ్యాసాన్ని సృష్టించరాదు. ఎవరైనా మీ వ్యాసాన్ని సృష్టిస్తారు. విషయ ప్రాముఖ్యత ఉన్నప్పుడు మీ చిత్రాన్ని హైదరాబాదు కవుల జాబితాలో చేర్చవచ్చు. ప్రస్తుతానికి మీ ఫోటోను మీ వాడుకరి పేజీలోకి అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసే విధానాన్ని ఈ క్రింద తెలియజేస్తున్నాను.
 1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
 2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
 3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
 4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
 5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
 6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
 7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే Cercle noir 100%.svg లో క్లిక్ చేయండి.
 8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
 9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.

మీరు రచయిత్రి, కవయిత్రిగా అనేక రచనలు చేసి ఉంటారు. మీరు తెలుగు వికీపీడియాలో మీ రచనలను కొనసాగించండి. ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి. K.Venkataramana(talk) 05:39, 6 సెప్టెంబరు 2020 (UTC)

ది రేస్క్యూయర్స్సవరించు

Hello. On ది రేస్క్యూయర్స్, there is an Infobox, but most of it is in English. Could that be translated? Also, it's one of many Disney articles that are underdeveloped. I saw you worked a bit on Dumbo, but that page also has English names in the Infobox. Also, I found out that the remake of Dumbo (the 2019 film of the same name) has been dubbed into Telugu, but no article about it exists yet. Should there be one? Also, it's one of the many facts missing from the page about the 1941 film of Dumbo, that the remake premiered in 2019. There is also a sequel to The Rescuers, en:The Rescuers Down Under. Again, no article exists. What would it be called? 2602:306:CEF1:7BF0:A050:49CD:1650:3B20 20:32, 16 సెప్టెంబరు 2020 (UTC)

Also, I saw you deleted షార్లోట్టేస్ వెబ్, but can a new article be written to replace the old one? 2602:306:CEF1:7BF0:A050:49CD:1650:3B20 20:51, 16 సెప్టెంబరు 2020 (UTC)
Two more pages that were deleted were ఆలివెర్ ఎండ్ కంపెనీ and ఫ్రోజెన్ 2. They were both deleted for Wikipedia management. So, should ది రేస్క్యూయర్స్ be deleted or improved? Dumbo was improved for example. But what about షార్లోట్టేస్ వెబ్ (1973 సినిమా) and షార్లోట్టేస్ వెబ్ 2: విల్బుర్స్ గ్రేట్ అడ్వెంచర్? 2600:1700:53F0:AD70:B01C:9F4A:DFB7:E9A7 19:36, 11 అక్టోబరు 2020 (UTC)

We sent you an e-mailసవరించు

Hello K.Venkataramana,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)

Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020సవరించు

Mahatma-Gandhi, studio, 1931.jpg

Hello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.

Note a few points

 • You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
 • If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.

If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (చర్చ) 23:09, 30 సెప్టెంబరు 2020 (UTC))

మూసలలో సవరణకై విజ్ఞప్తిసవరించు

కె.వెంకటరమణ గారూ నమస్కారం. మీ నుండి ఈ క్రింది రెండు సహాయాలు అర్థిస్తున్నాను.

 1. మూస:Lang-la వాడినప్పుడు Latin అని కాకుండా లాటిన్ అని కనిపించాలి. (సెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు సమాచారపెట్టె చూడండి.)
 2. మూస:Infobox model వాడినప్పుడు alma_mater పారామీటర్ తెలుగులో కనిపించాలి. (సుష్మితా సేన్ వ్యాసం చూడండి.)

ధన్యవాదాలతో --స్వరలాసిక (చర్చ) 09:03, 18 అక్టోబరు 2020 (UTC)

స్వరలాసిక గారూ, మీరడిగిన మార్పులు చేసాను. –

K.Venkataramana  – 10:13, 18 అక్టోబరు 2020 (UTC)

కె.వెంకటరమణ గారూ ధన్యవాదాలు. మూస:Infobox pageant titleholderలో రెండు పారామీటర్లు ఇంగ్లీషులో ఉన్నాయి. (చూడండి డయానా హేడెన్)--స్వరలాసిక (చర్చ) 14:19, 18 అక్టోబరు 2020 (UTC)
చేసాను. ☑Y
 – 

K.Venkataramana  – 14:36, 18 అక్టోబరు 2020 (UTC)

మొదటిపేజీ నిర్వహణసవరించు

మొదటిపేజీని నిరంతరాయంగా ఒంటిచేత్తో ఏళ్ళ తరబడి నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకుగాను మీకు ధన్యవాదాలు. ఈ పనిలో మీ భారాన్ని కొంత నేను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏదైనా కొంత భాగాన్ని నాకు ఇవ్వండి. లేదా ఆ భారాన్ని పూర్తిగా నాపై వేసినా నాకు అభ్యంతరం లేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:03, 19 అక్టోబరు 2020 (UTC)

చదువరి గారూ, ఇది ప్రత్యేకమైన బాధ్యతగా నేను భావించడం లేదు. ఇందులో ఏముంది? మొదటి పేజీలో వ్యాసాలను తయారుచేయడం, మీకు తెలుసా వాక్యాలను చేర్చడమే కదా! ఈ పని అందరూ చేయవచ్చు. 2013లో మొదటి పేజీ నిర్వహణ చేసేవారు తగ్గినందున మీకు తెలుసా వాక్యాలు ప్రచురించబడకపోవడం వలన నేను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలోకి చేరాను. అప్పటి నుండి ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. ఇందులో భాగం ఇవ్వడానికి ఏముంది సార్. అందరం సమిష్టి కృషితో మొదటి పేజీ నిర్వహణ చేద్దాం. –

K.Venkataramana  – 06:14, 19 అక్టోబరు 2020 (UTC)

సహాయం కావాలిసవరించు

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితాలో "ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు" మూసలో మూలాల జాబితా, బయటి వనరులు merge అయిపోయి కనిపిస్తున్నాయి. వాటిని విడివిడిగా కనిపించేలా చేయగలరు. --స్వరలాసిక (చర్చ) 15:27, 24 అక్టోబరు 2020 (UTC)

స్వరలాసిక గారూ, మీరు తయారు చేసిన మూసలో సమాచారం చేర్చిన తరువాత క్లోసింగ్ బ్రాకెట్లు " |} " లు చేర్చక పోవడం వలన అలా జరిగింది. సరిచేసాను. –

K.Venkataramana  – 01:48, 25 అక్టోబరు 2020 (UTC)

Mahatma Gandhi 2020 edit-a-thon: Token of appreciationసవరించు

Mahatma-Gandhi, studio, 1931.jpg

Namaste, we would like to thank you for participating in Mahatma Gandhi 2020 edit-a-thon. Your participation made the edit-a-thon fruitful. Now, we are sending a token of appreciation to them who contributed to this event. Please fill the Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further. Please find the form here. Nitesh (CIS-A2K) (చర్చ) 17:19, 26 అక్టోబరు 2020 (UTC)

Festive Season 2020 edit-a-thonసవరించు

Rangoli on Diwali 2020 at Moga, Punjab, India.jpg

Dear editor,

Hope you are doing well. First of all, thank you for your participation in Mahatma Gandhi 2020 edit-a-thon.
Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute in this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 18:22, 27 November 2020 (UTC)

Reminder: Festive Season 2020 edit-a-thonసవరించు

Dear Wikimedians,

Hope you are doing well. This message is to remind you about "Festive Season 2020 edit-a-thon", which is going to start from tonight (5 December) 00:01 am and will run till 6 December, 11:59 pm IST.

Please give some time and provide your support to this event and participate. You are the one who can make it successful! Happy editing! Thank You Nitesh (CIS-A2K) (talk) 15:53, 4 December 2020 (UTC)

మన్నించండిసవరించు

గురువుగారు వెంకటరమణ గారు మీకు చెప్పకుండానే మధ్యలో ప్రతిపాదన నిర్వాహకం సార్ మీతో సహా ముగ్గురు నన్ను సమర్థించారు. వారికి నా వందనాలు, ఇప్పటికీ ముగ్గురు నిర్వాహకులు వ్యతిరేకించారు. వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రభాకర్ గౌడ్ నోముల వీరి అభిప్రాయం మరి కొంతకాలం ఆగాలన్నరు. దానికి నా ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నాను. తొందరపాటు నిర్ణయం కాదు, ఎందుకు అంటే కలిసి పని చేయాలి వీరు నాకు ఓటు వేయలేదు వీరు వేశారు. నేను కొన్ని పనులను చేస్తుంటే మధ్యలో అంశాల వారీగా బేధాభిప్రాయాలు రావడం గ్రూపుగా, వర్గాలుగా విడిపోకూడదని నా అభిప్రాయం. నేను ఏమి విధ్వంసం పనులు చేసే వాడిని కాదు కానీ, అవకాశం ఇస్తే ఒక్కొక్కటి నేర్చుకొని అనుభవం వచ్చి ఉండేది, నిర్వాహక పదవి కోసం ఇంతకు ముందు జరిగిన వికీలో గతంలో జరిగినవి అన్ని చదివాను. బేదాభిప్రాయాలు పెంచుకొని తెగేదాక లాగితే ఉద్దేశం నాకు లేదు. అందరితో కావాలని కలిసిపోవాలి అనుకుంటున్నాను. అందుకే మధ్యలోనే నా ప్రతిపాదన వెనక్కి తీసుకున్నాను నా మీద నమ్మకంతో ప్రతిపాదించిన అందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు.-- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:12, 16 డిసెంబరు 2020 (UTC)

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ వికీపీడియాలో ఎంతమంది నిర్వాహకులున్నా నిర్వాహక పనులపై శ్రద్ధ చూపేది కొందరు మాత్రమే. ఈ నేపధ్యంలో మీరు నిర్వాహక పనులపై ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తున్నందున మిమ్మల్ని నిర్వాహకునిగా ప్రతిపాదించాను. అందుకు మీరు సమ్మతి తెలిపినందుకు ధన్యవాదాలు. ఇక్కడ వచ్చే నిర్వాహకులు గానీ, సభ్యులు గానీ ప్రారంభంలో వికీ విధానాలు తెలియక అనేక పొరపాట్లు చేస్తారు. "తప్పులెన్నువారు తండోపతండంబు-లుర్విజనులకెల్ల నుండు తప్పు" అన్నట్లుగా ఎవరి దిద్దుబాట్లు మొత్తం పరిశీలించినా తప్పులు దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ ఎవరూ వికీ పండితులు కాదు కదా. అందరూ కాలానుగుణంగా వికీ విధానాలు తెలుసుకుంటారు. తాము వికీలో గతంలో చేసిన దోషాలను తెలుసుకొని సరిదిద్దుకుంటారు. నేను వికీపీడియాలో చేరి నిర్వాహకునిగా ఎన్నికయిన తరువాత మిగిలిన నిర్వాహకులు చేస్తున్న కార్యకలాపాలను పరిశీలించి, "turn the page, learn the work" అన్నట్లుగా కొన్ని విషయాలను చేర్చుకున్నాను. ఇప్పటికీ వికీ సముద్రం నుండి గ్రహించినది కొన్ని నీటి బిందువులు మాత్రమే. ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉంది. నేర్చుకుంటున్నాను. అలాగే మీకు విధానాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. సహ సభ్యుల పట్ల గౌరవం ఉంది. ఎవరైనా విధానాలను చెబితే వాటిని అనుసరించే గుణం ఉంది. సహసభ్యుల సూచనలతో మంచి నిర్వాహకునిగా ఎదిగి వికీపీడియా అభివృద్ధికి తోడ్పడతారని అనుకున్నాను. కానీ అభ్యర్థనలో సహసభ్యులు మీరు వికీకి చేస్తున్న సేవలను గుర్తిస్తూనే ఇంకా విధానాలపై అవగాహన పెంచుకుని కొంతకాలం తరువాత నిర్వాహకత్వానికి అభ్యర్థించమని కోరారు. వారి కోరికను మన్నించి మీరు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మీ అభిప్రాయానికి అభినందిస్తున్నాను. గతంలోలాగే వికీలో మీరు కృషి కొనసాగించాలని కోరుకుంటున్నాను. వికీ అభివృద్ధి చేయాలంటే నిర్వాహకులమే కానక్కరలేదు. పాలగిరి, వేమూరి గార్లలా సభ్యునిగా కూడా వికీపీడియాలో విశేష సేవలనందించవచ్చు. ధన్యవాదాలు. –

K.Venkataramana  – 14:01, 16 డిసెంబరు 2020 (UTC)

కాల్సియం సమ్మేళనాలు వర్గం చర్చసవరించు

వెంకటరమణ గారూ, వర్గం చర్చ:కాల్సియం సమ్మేళనాలు వర్గంలో మీ స్పందనలు గురించి 14న అడిగాను. .బహుశా గమనించలేదనుకుంటాను. తెలియజేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:38, 20 జనవరి 2021 (UTC)

వర్గం చర్చ:కాల్సియం సమ్మేళనాలు లో నా స్పందన తెలియ జేసాను. –

K.Venkataramana  – 16:47, 20 జనవరి 2021 (UTC)

సంగీత నాటక అకాడమీ అవార్డుసవరించు

వెంకటరమణ గారూ, పై వ్యాసంలోని సమాచారపెట్టె మూస సంగతి చూడగలరు.--స్వరలాసిక (చర్చ) 05:50, 7 ఫిబ్రవరి 2021 (UTC)

స్వరలాసిక గారూ అందులో మూసను సరిచేసితిని.-- K.Venkataramana -- 06:14, 7 ఫిబ్రవరి 2021 (UTC)
ధన్యవాదాలు వెంకటరమణ గారూ!--స్వరలాసిక (చర్చ) 06:27, 7 ఫిబ్రవరి 2021 (UTC)

ధన్యవాదాలుసవరించు

వెంకటరమణ గారూ!--మీతో మాట్లాడటం చాలా సంతోషం కలిగించింది. మీ సూచనలు తప్పక అనుసరిస్తాను. 14:48, 23 February 2021‎ శరత్ బాబు

వికీడేటా అంశంసవరించు

వెంకటరమణ గారూ! నేను ఎం.ఎ.నరసింహాచార్ అనే వ్యాసాన్ని సృష్టించి దానికి వికీడేటాలో Q105644354 అనే అంశాన్ని చేర్చాను. దానిలో తెలుగు వికీపీడియాలోని వ్యాసాన్ని జతచేశాను. కానీ ఎం.ఎ.నరసింహాచార్ వ్యాసం సృష్టించబడని వర్గం "Articles without Wikidata item"లో కనిపిస్తున్నది. కారణం తెలుపగలరా? --స్వరలాసిక (చర్చ) 10:59, 24 ఫిబ్రవరి 2021 (UTC)

స్వరలాసిక గారూ వికీడేటాలో ఆంగ్లంలో పుటను సృష్టించాలి. ఆంగ్ల వ్యాసం లేనప్పటికీ ఒక వ్యాస శీర్షికను సృష్టించి అందులో తెలుగు వ్యాసాన్ని లింకు చేయాలి. అలా చేయడం జరిగినది.-- K.Venkataramana -- 11:35, 24 ఫిబ్రవరి 2021 (UTC)
వెంకటరమణ గారూ! మీరు చెప్పినట్లే వికీడేటాలో ఆంగ్లంలో ఎస్.వి.పార్థసారథి పుటను సృష్టించి తెలుగు వ్యాసాన్ని లింకు చేశాను. అయినా "Articles without Wikidata item" అని వస్తున్నది.--స్వరలాసిక (చర్చ) 07:26, 25 ఫిబ్రవరి 2021 (UTC)

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులుసవరించు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)

ఖనిజ తైలము వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

ఖనిజ తైలము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2012 డిసెంబరులో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో Mineral oil అనే వ్యాసం ఉంది.దాని ఆధారంగా విస్తరించటానికి ప్రయత్నించగా సాంకేతిక పదాలలో ఉన్నందున సాధ్యంకాలేదు. దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 5 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఖనిజ తైలము పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 16:18, 28 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:18, 28 ఏప్రిల్ 2021 (UTC)

గురుత్వ మాపకాలు వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

Ambox warning yellow.svg

గురుత్వ మాపకాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2013 జనవరిలో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో వికీడేటా లింకు కలిపిలేదు.సాంకేతిక పదాలలో ఉన్నందున విస్తరించటానికి సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 11 వ తేదీలోపు విస్తరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గురుత్వ మాపకాలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 12:44, 4 మే 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:44, 4 మే 2021 (UTC)