దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Pk123 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
పంక్తి 47:
 
[[1967]]లో ఎన్నికల ప్రచార సమయములో [[విజయవాడ]] నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. [[1972]] [[మే 7]] వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో [[ఢిల్లీ]]లో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు [[మే 9]]వ తేదీన [[సికింద్రాబాదు]]లోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా ''సంజీవయ్య పార్కు'' అని పేరు పెట్టారు.
ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. జిల్లా పర్యటనలో భాగంగా ఓ ప్రముఖుడి ఇంటికి భోజనానికి వస్తానన్నారు. అదే సమయంలో సాంఘిక సంక్షేమ వసతి గృహం పిల్లలతోను కలిసి భోజనం చేస్తానన్నారు. ఇది అక్కడున్న వారెవరికీ అర్ధం కాలేదు. 'అదేమిటి నేను పిలిస్తే వస్తామన్నారు, ఇప్పుడు హాస్టల్లో భోజనం చేయడానికి అంగీకరించారు' అని సదరు ప్రముఖుడు ముఖ్యమంత్రిని అడిగితే 'మీరు వండిన పదార్ధాలన్నీ హాస్టల్‌కు పంపిస్త అక్కడే పేద విద్యార్థులతో కలిసి భోజనం చేయొచ్చు'కదా అని బదులిచ్చారాయన. ఆయనే సంజీవయ్య. పేదరికంలో పుట్టి పేదవాడిగానే ఎదిగి,పేదవాడిగానే జీవితం చాలించి విలువలకు అద్దం పట్టిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. బడుగులు జీవితాలలో సజీవుడు సంజీవయ్య. నేటి తరాలకు ఆదర్శప్రాయుడు, భావితరాలకు మార్గదర్శి.
సృష్టిలో కొందరి జననానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి ప్రత్యేకతే సంజీవయ్యది. దామోదరం అంటే నిజాయితీకి నిలువెత్తురూపం. ఒకటి కాదు రెండు కాదు మూడు దశాబ్దాల పాటు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిరాడంబరుడు ఆయన. హోదా ఏదైనా విలువలకే అగ్రాసనం వేస్తూ నికార్సయిన పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి, 39 ఏళ్లకే సిఎం కాగలిగిన జనం మనిషి. అట్టడుగు వర్గాలకు చెందిన సంజీవయ్య తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరగాంధీల ఆశీస్సులతో ఎదుగుతూ అఖిలభారత కాంగ్రెస్‌పార్టీకి రెండుసార్లు అధ్యక్షుడుగా సేవలందించారు. 1950-60 సంవత్సరాల్లో సంజీవయ్య రాష్ట్రానికి అందించిన సేవలు ఎవ్వరూ మరిచిపోలేనివి. విలువలకు కట్టుబడి జీవించిన అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో సంజీవయ్య ఒకరు. వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించి పేదరికంతో సావాసం చేశారు. కేవలం తన శక్తి సామర్ధ్యాలు నీతి నిజాయితీలే పెట్టుబడులుగా పండిత పామరులను రంజింపచేసినఘనత ఆయన సొంతం. 1950లో ప్రొవెన్షియల్‌ పార్లమెంటు సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించి 1952లో ఎమ్మిగనూరు-పత్తికొండ ద్వంద్వ నియోజక వర్గం నుండి మద్రాసు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజాజీ మంత్రివర్గంలో పురపాలక, సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, 1953లో కర్నూలు రాజధానిగా అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు మంత్రి వర్గంలో ఆరోగ్యం, హరిజనోద్ధరణ,పునరావాస శాఖల మంత్రిగా ఆ పదవికి ఎనలేని వన్నే తెచ్చారు. అప్పట్లో కర్నూలు రాజధానిగా ఏర్పడటం వెనుక సంజీవయ్య పాత్ర ఎంచదగిందని సమకాలీన నాయకులు చెబుతుంటారు. మద్యపాన నిషేధం అమల్లో ఎదురైన ఇబ్బందుల వల్ల ప్రకాశం ప్రభుత్వం పడిపోతే 1955 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి విజయం సాధించి బెజవాడ గోపాలరెడ్డి ప్రభుత్వంలో వాణిజ్యం, రవాణాశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో కార్మిక, పురపాలక శాఖల మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి ప్రశంసలను అందుకున్నారు. తదుపరి జరిగిన అనూహ్యపరిణామాల వల్ల 1960 జనవరి 10న సంజీవయ్యను ముఖ్యమంత్రిని చేశాయి. భూసంస్కరణలను అమలు చేసి ఆరులక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంచిపెట్టారు. చట్టాలను పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు, సమన్వయ పరిచేందుకు స్టేట్‌ లా కమీషన్‌ను ఏర్పాటు చేశారు. 27 నెలలపాటు జనరంజకంగా పాలనను అందించి 1962 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అన్నీ తానై నడిపించి విజయపధాన నిలిపారు. దీంతో రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగినా అధిష్ఠానం ఆదేశాలను గౌరవించి నీలం సంజీవరెడ్డి సిఎం కావడానికి మార్గం సుగమం చేసారు. రెండేళ్ల తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా పనిచేసి దేశంలోని లక్షలాది మంది కార్మికుల ఆశాజ్యోతి కాగలిగారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి మంత్రివర్గంలోనూ అదే శాఖను చేపట్టి బోనస్‌ బిల్లును తీసుకు వచ్చి కార్మికులకు ప్రయోజనాన్నిఇచ్చారు.
1968-69 మధ్యకాలంలో నెలకొన్న క్లిష్ట రాజకీయ పరిణమాలు ఇందిరాగాంధీకి ఒకింత ఇబ్బందిని కలిగించగా ఆమెకు బాసటగా నిలిచి తనవిధేయతను చాటుకున్నారు. 1970లో ఇందిరాగాంధీ అధికారంలోకి రావటంతోనే సంజీవయ్యకు అత్యంత కీలకమైన పరిశ్రమల శాఖను అప్పగించారు. అటు యాజమాన్యం, ఇటు కార్మిక వర్గాల మెప్పు పొందారు. చివరగా రెండోసారి 1971లో ఎఐసిసి అధ్యక్షుడిగా నియమితులై 1972 మే 7న అనారోగ్యంతో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ అధికార నివాసంలో తుది శ్వాస విడిచారు.
సాహిత్యాభిలాషి సంజీవయ్య
రాజకీయాల్లో తనదైన శైలిని చూపిన సంజీవయ్య సాహిత్యం పట్ల అమితమైన మక్కువను చూపేవారు. తెలుగుపై అసాధారణ పట్టు కలిగిన సంజీవయ్య ఆ భాషపై ఉన్న మమకారంతో 1960 మే 6న హైదరాబాద్‌ తొలి అఖిలభారత తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహింపచేశారు.
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
కాంగ్రెస్‌లో నేతలపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం ఈనాడే కాదు అప్పట్లోనూ ఉంది. సంజీవయ్య సిఎంగా ఉన్న రోజుల్లో ఆయనతో పొసగని వారు నాటి ప్రధాని నెహ్రూకు ఫిర్యాదు చేశారు. నిజానిజాలను తేల్చేందుకు అప్పటి హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పర్మార్‌ను నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు పంపారు. ఆయన కర్నూలులోని సంజీవయ్య స్వగ్రామం పెదపాడును సందర్శించి సిఎం స్వగ్రహానికి వెళ్లాలని భావించారు. పర్మార్‌తో పాటు నేటి శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి కూడా ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ పూరింటి ముందు ఆగింది. దీంతో 'ఇక్కడెందుకు ఆపారు' అని పర్మార్‌ చక్రపాణిని అడిగారు. ఇదే సంజీవయ్య ఇల్లు అంటే చక్రపాణి బదులివ్వడంతో ఆశ్చర్యపోవడం పర్మార్‌ వంతయింది. ఆ పూరింట్లో సంజీవయ్య తల్లి సుంకులమ్మ కట్టెలపొయ్యి వద్ద వంటచేస్తూ కనిపించారు. ఆ దృశ్యం చూసిన పర్మార్‌ మరే విచారణ లేదంటూ వెనుదిరిగారు. సంజీవయ్య మృతి చెందే నాటికి ఓ పాత ఫియట్‌కారు, రూ.17వేల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మాత్రమే ఆయన ఆస్తి. ఆయనకు సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీకి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదేమో. రాష్ట్ర ప్రజల మదిలో చిరస్మరణీయునిగా ఉన్న సంజీవయ్య స్పృతి చిహ్నంగా రాజధానిలో సంజీవయ్య పార్కును ప్రభుత్వం అభివృద్ధిపరిచింది. అణగారిన వర్గాలపై ఆయన చూపిన నిబద్ధతకు, వారి సంక్షేమానికి ఆయన చేసిన కృషికి గుర్తుగా రాష్ట్ర సంక్షేమ భవన్‌కు సంజీవయ్య సంక్షేమ భవన్‌గా గుర్తింపు ఇచ్చింది.అరుదైన ఆ మహానేత నేటి తరానికి ఆదర్శం. ఆయన కలల సాఫల్యానికి ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయటమే సంజీవయ్యకు నిజమైన నివాళి.
 
==నిర్వహించిన పదవులు==
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు