బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1939 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
తారకం న్యాయవాద పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టారు. [[బోయి భీమన్న]] కూతురు విజయభారతిని 1968లో పెళ్లి చేసుకున్నారు. భార్య నిజామాబాదులో ఉద్యోగం చేస్తుండంతో, సంసారం నిజామాబాదుకు మార్చి అక్కడే ప్రాక్టీస్ మొదలెట్టారు. నిజామాబాదులో 'అంబేద్కర్ యువజన సంఘం' స్థాపించారు. బీసీని అధ్యక్షుడిగా, ఎస్సీని కార్యదర్శిగా పెట్టడం ద్వారా ఆ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిజామాబాద్‌లో అరెస్టు చేశారు. 1979 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ అనేక దళిత సమస్యలపై పోరాడారు. [[కారంచేడు సంఘటన]] తర్వాత హైకోర్టులో న్యాయవాద పదవి రాజీనామా చేసి [[కత్తి పద్మారావు]]తో పాటు కారంచేడు శిబిరంలో నిరసన దీక్ష చేశాడు.
 
పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్న తారకంకు రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరుంది. ఈయన రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.
 
==భావాలు అనుభవాలు==
*అన్యాయమైన పద్దతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చు..
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు